మనం బ్యాంకుల్ల బాకీలు తెచ్చుకుంటం. ఏదన్న కుద పెట్టకపోతే గవాల్లు గా బాకీలియ్యరు. గట్ల బాకీ తీర్సినంక కుద పెట్టిన పేపర్లియ్యకపోతే గా అదాలత్ ఏం శేసిందో సూడుండ్రి.
ఉత్తరప్రదేశ్ ల అలీగడ్ కు శెందిన గుల్వీర్సింగ్ చౌహాన్ అనేటాయిన ఎస్బీఐ సిటీ బ్రాంచ్ నుండి 1997ల తన ఇంటిని కుదపెట్టి బాకీ తీసుకున్నడు. ఇగా టైంల తన దగ్గరున్న గా ఇంటి పత్రాలను బ్యాంకుకు అప్పగించిండు. 2019 మే కల్లా గా బాకీ మొత్తం కట్టిండు. ఇగా బ్యాంకు ‘నో డ్యూ సర్టిఫికేట్’ కూడా ఇచ్చింది. ఇగా ఇంటి పత్రాలను మాత్రం తిరిగి ఇయ్యలేదు. ఇగయ్యి ఎక్కడ ఉన్నయో కనిపిత్త లేవని గా బ్యాంకోల్లు పట్టించుకోలే.

గిదంత పనికాదని, ఇగాయినె 2023 జూన్ల వినియోగదారుల కమిషనన్ దగ్గరికిపోయిండు. విశారించిన గా అదాలత్, 2019 మే 13 నుండి గిప్పుడు గా పత్రాలు అప్పగించే దాకా, రోజుకు రూ.ఐదు యేల శొప్పున బాధితుడికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. గంతేగాక, అదాలత్ కర్సుల కింద 10 యేలు ఇయ్యాలని శెప్పింది. ఇగా పత్రాలను 45 రోజుల లోపల్నే ఇయ్యాల్నని గడువు ఇచ్చింది. అదాలతంటే.. ఆటలా మరి?

