Sunday, November 22, 2026
30.2 C
Hyderabad

నడుస్తున్న మనిషి|POETRY|PARVATHALU

నిలబడిన చోట
పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు
మనుషులు కూలిపోతూ
కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు
అనారోగ్యమిప్పుడు
శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది
వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో
ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో
నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే
అయ్యో !ఇందాకనే
ఫోన్ లో మాట్లాడిండని అంటూ ఆవేదనలు
విచిత్ర కాలం !

పనులన్నీ
మూలన పడున్నవి కళ్లనిండా కన్నీళ్లు
కలలు పూలు పూయకుండానే
జీవిత నావ మునిగినట్లు

పచ్చని చెట్టులాంటి మనిషి
పాటలాంటి ప్రయాణం
అమ్మలాంటి మనసు
ద్వేషంలేని నిరాడంబరుడు
కుటుంబం
సేద్యం
చెడుకు తావివ్వని పాలలా
పదిమందికి చేయూత
అందరూ నావాళ్లని చేరదీసి
బంతిపూల పరిమళంలా
పెద్దమ్మ తల్లిలా నీడైండు

అమ్మ ఒడిలో కేరింతలప్పుడే
తండ్రిని కోల్పోయ్యాడు
ఎడ్లు,బండిలా
బతుకు బండికి అన్నీ అమ్మనే
కల్లుదుకుణం కాడ
బజ్జీలు సుట్లు గుగ్గీళ్లు
బుట్టి చెమటతో బడి మెట్లెక్కీ
సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో పుస్తకం పట్టి
సినిమా టాకీసు ఆపరేటర్ గా ఎదురీదాడు
రీల్ నడుస్తుండగానే
రీల్ ఎక్కించెంత నైపుణ్యం సొంతమైంది
ప్రజాసంబంధాల కార్యాలయంలో
ఆపరేటర్ గా ఉద్యోగం
ముప్పై ఏళ్ల సర్వీసులో
ఊరూర ప్రభుత్వ సంక్షేమాల ప్రచార కార్యకర్తగా
ప్రొజెక్టర్ ద్వారా మరింత దగ్గరయ్యాడు
రిటైర్మెంట్ అయ్యాడు ….

పొలం ,పశువులు
వ్యవసాయమే జీవనంగా
తెల్లారిలేస్తే తీరికలేని
గట్టుకాడికి
కాలువలా పయనం

సాధించె కోరికలు
తెల్లకాగితాలుగా వెక్కిరిస్తుంటే
ప్రాణాలు
యముడి అకౌంట్ లోకి వెల్లిపోతున్నాయి
బీమారీలన్నీ చావు వార్తలై
మనుషులు శవాల దిబ్బలై
ఊర్లు స్మశానాలై వెలిస్తే
సూర్యుడుదయించటం అనవసరమే!

చెట్టుకైనా
చెరువుకైనా
చరిత్రకైనా
మనిషికైనా
సార్థకతుండాలి
తెల్లారిందాక వెలుగునివ్వాల్సిన దీపం
హటాత్తుగా
గాలి వీయకముందే ఆరిపోయే
నడుస్తున్న మనిషి
గోడపై ఫోటోగా మీగిలే!

●AVS (DPRO)ఆడియో వీడియో సూపర్ వైజర్
కావలి పర్వతాలు యాదిలో……

వనపట్ల సుబ్బయ్య
20.08.2026
9492765358

…………..

 

Latest News

ప్రజాపాలన పట్టు తప్పుతోందా?|CONGRESS|TELANGANA|CM|REVANTH REDDY

-అడుగు ప్రత్యేకం పార్టీ తప్పటడుగులతో తడబడుతోందా? కాంగ్రెస్ లో ఎందుకీ కస్సు బుస్సులు! సీఎం వర్సెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళపై సిద్ధిపేటలో సీఎం సీరియస్ కాంగ్రెస్ లో వివాద వ్యాఖ్యల కలకలం వాళ్ళ వ్యాఖ్యలు సరే, మరి చర్యలేవి? వారి సామాజికవర్గాలే సమస్యా? సురేఖకు...

రోజుకు 5యేలు! 7ఏండ్లకు జరిమానా!?|ADUGU TRENDS

మనం బ్యాంకుల్ల బాకీలు తెచ్చుకుంటం. ఏదన్న కుద పెట్టకపోతే గవాల్లు గా బాకీలియ్యరు. గట్ల బాకీ తీర్సినంక కుద పెట్టిన పేపర్లియ్యకపోతే గా అదాలత్ ఏం శేసిందో సూడుండ్రి. ఉత్తరప్రదేశ్ ల అలీగడ్ కు...

ఢిల్లీ సుల్తానులు|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|EDUCATION

ఢిల్లీ సుల్తానులు పాలించిన ప్రాంతాలను ఇస్లాం భాషలో సల్తనత్ అంటారు. సల్తనత్ అనగా రాజ్యము అని అర్థం. రాజ్యాన్ని పాలించిన రాజులను సుల్తానులు అంటారు. కాబట్టి ఈ ఢిల్లీ సుల్తానులకు గల మరో...

భారత్ కు సవాల్ గా పాక్, చైనా వ్యూహాలు!?|EDITORIAL

పాకిస్తాన్ కు చైనా అండదండలు. భారత్‌ను చుట్టుముట్టే వ్యూహాలు! డ్రాగన్ ద్వంద్వ నీతిపై అమెరికా నివేదిక సంచలన వ్యాఖ్యలు. ఆసియాలో మారుతున్న శక్తి సమీకరణాలు భారత్‌కు కొత్త సవాళ్లను విసురుతున్నాయి! మార్గం - అడుగు,...

వార/ఈ రోజు రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 22 నుండి నవంబర్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాల ద్వారా...

వలెయ్యకుండనే శేతికి లచ్చల శేపలు!?|ADUGU TRENDS

ఎన్కటికి వట్టి శేపల కూర వడిపిల్ల మెతుకులని మస్తు తినేటోల్లు. ఇప్పటికీ శేపలంటే కొందరు శెవులు కోసుకుంటరు. రుశికి రుశి, ఆరోగ్యానికారోగ్యం. గా కౌసుకు, ముండ్లకు భయపడ్తరు గనీ, గాదాన్ని కాదంటే, గా...

నగరానికి గోదావరి జలాలు పరిష్కారమేనా?|EDITORIAL

హైదరాబాద్‌కు 40 ఎంజీడీల అదనపు గోదావరి జలాలు అందుబాటులోకి రావడం ఉపశమనమే తప్ప శాశ్వత పరిష్కారం కాదు. పైప్‌లైన్ పనులు, ట్రయల్ రన్ విజయవంతమై, నీటి పంపిణీ సమర్థంగా జరగాలి. మరోవైపు వర్షపు...

నవంబర్ 21, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం చిలుకు ద్వాదశి తులసి వివాహం చాతుర్మాస్య వ్రతసమాప్తి తిధి శు ద్వాదశి రాత్రి 01.16 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 03.24 వరకు ఉపరి అశ్విని యోగం సిద్ది రాత్రి 12.55...

ఆకరి సూపు కోసం అవ్వ శవం ఎదురు సూత్తాంది!?|ADUGU TRENDS

తలంత బలగం, తలకు పోసే దిక్కులేకుండా పోయిందనే సామెత గా అవ్వకు బాగా అతికింది. గా తల్లికి ఇద్దరు బిడ్డలు. బంధుగులు కూడా ఉన్నరు. కానీ, గవాల్లంతా గిప్పుడు యాడున్నరో తెలవదు. 40...

రైతులకు, వినియోగదారులకు ‘గిట్టు’బాటేది!?|EDITORIAL

రైతుకు గిట్టుబాటు ధర రావడం, వినియోగదారుడికి సరసమైన ధరకు కూరగాయలు అందడం పరస్పర విరుద్ధమేమీ కావు. మధ్యలోని సరఫరా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దితే, రెండూ సాధ్యమే. రైతు నష్టపోకుండా, వినియోగదారుడికి భారం కాకుండా...

నవంబర్ 20, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 01.54 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 03.29 వరకు ఉపరి రేవతి యోగం వజ్ర రాత్రి 02.33 వరకు ఉపరి సిద్ది కరణం వణజి పగలు 02.01...

పచ్చని సంసారంల చాట్ జీపీటీ చిచ్చు!?|ADUGU TRENDS

దేని మీదనైనా ఆధారపడినా, అలవాటైనా ఇగంతే సంగతులు. అయిన దానికి, కాని దానికి కూడా గాదాని మీదకే పానం గుంజుతది. గట్లనే గా లెక్కలు శేసే కాలుక్ లేటర్, శేతుల్ల పట్టుకునే పోన్లు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News