కొత్తగ ఇల్లు కడితే, గా గోడలకు నీల్లు పట్టుడు అంత అల్కన కాదు. గోడలెక్కి పైపుతోటి నీల్లు కొట్టాలె. లేకపోతే గా కింది నుండే పైపుతోటి గోడలకు పట్టాలె. ఇగ గా నీల్లతోటి గోడ తడత్తది కనీ, కమ్ముగ నీల్లు తాగది. మరి గా గోడకు కమ్ముగ నీల్లు పట్టుడెట్లనో గీ అన్న కనిపెట్టిండు. గా ఇకమతేందో సూద్దామా?

గోడ మీద ఓ పైపు పెట్టిండు. గా పైపునకు రంద్రాలు సేసిండు. గా పైపులకు నీల్లొదిలిండు. ఇగ గా రంద్రాలల్ల కెల్లి నీల్లు మొల్లెగ దుంకుతానయి. ఇగ గా గోడ గూడ మెల్లెగా నిండుగ తడిసి, కమ్ముగ నీల్లు తాగుతాంది. ఇగ గా తడి శానా సేపుంటది. ఇగ గా గోడ రాయిలెక్క గట్టిగ ఉంటదన్నట్లు?

