ఎండా కాలం రానే వచ్చె. ఎండ యేడికి ఇండ్లల్లనే కుమ్ముల పెట్టినట్లు ఉడకబడితిమి. ఎండ యేడి 50 డిగ్రీల దగ్గర దగరికి శేరబట్టె. ఇగ కూలర్లు, ఏసీలు ఎన్ని పెట్టినా, యేడ సరిపోతయి? పై నుంచి వచ్చే ఎండ తాకిడికి యేడ తట్టుకుంటయి? గందుకే రూఫ్ కూలింగ్ కోసం రకరకాల సల్ల బరిసేవి రాబట్టె. గట్లాంటియే గీ కూలింగ్ రేకులన్నట్లు. గివీటిని ప్రీమియర్ కూలింగ్ రేకులంటరట. గవాటి సంగతేందో సూద్దామా?

పకుతి విసిరే పతి సవాల్ కి ఓ పరిష్కారం ఉంటది. పెయింటింగ్ గసొంటి వాటిల్ల గీ ఇంటిని సల్లంగ ఉంచే రేకులు కూడ ఒకటన్నట్లు. గియీటిని ప్రీమియం రేకులంటరట. గియీటిని మన ఇండ్ల మీద కప్పుకుంటే ఇగ ఎండ కొట్టినట్లే ఉండదట. ఇండ్లల్ల ఉడుకపోయదట. ఎండా కాలం సల్లగ, సలి కాలం యేడిగ, వానా కాలం వెచ్చగ ఉంటదట. గీ రేకులు సుత కరాబు కావట. గవాటిని తట్టుకునేంత బలముంటదట. మరి మీరు సుత శోచాయించుండ్రి.

