Thursday, April 16, 2026
38.2 C
Hyderabad

ఈ సారి మేడారం జాతరలో పెను సంచలనం!?|MEDARAM|JATHARA

ASTROLOGY|జ్యోతిష్కుడు వేణుస్వామి|VENU SWAMY సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, జనవరి 21 (అడుగు న్యూస్):
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క–సారలమ్మ మేడారం మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామం భక్తులతో కిటకిటలాడుతోంది. కోరిన కోర్కెలు తీర్చే వనదేవతలుగా భక్తులు విశ్వసించే సమ్మక్క–సారలమ్మలను దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారు. ఈ మేరకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇదే సమయంలో మేడారం జాతరపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, భక్తులు పెద్ద సంఖ్యలో కూడే ప్రాంతాల్లో 2026లో పెను సంచలనాలు జరిగే అవకాశముందని శాస్త్ర ఆధారంగా వ్యాఖ్యానించారు. అది మేడారం జాతరలోనైనా, పుష్కరాల్లోనైనా, దేవాలయాల్లోనైనా కావొచ్చని చెప్పారు. గతంలో రైలు, విమాన ప్రమాదాలపై తాను చేసిన అంచనాలు నిజమయ్యాయని పేర్కొంటూ, ఈ ఏడాది ప్రకృతి, అగ్ని, వాహన ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా, జాతరలో భాగంగా జనవరి 27న పగిడిద్దరాజు, జంపన్న మేడారానికి పయనమవుతారు. 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులు గద్దెలపై కొలువుదీరనున్నారు. జనవరి 29న సమ్మక్క దేవత కుంకుమ భరిణె రూపంలో గద్దెపై ప్రతిష్ఠించబడనుంది. జనవరి 30న బెల్లం సమర్పణ, 31న వనప్రవేశంతో జాతర ముగియనుంది. ఫిబ్రవరి 4న తిరుగువారం పండుగతో ఉత్సవాలు ముగుస్తాయి. దాదాపు కోటికి పైగా భక్తులు ఈ మహాజాతరలో పాల్గొననున్నట్లు అంచనా.

Latest News

గిట్ల శేత్తే గా కుండల నీల్లు ప్రిజ్జంత సల్ల..గుంటయి!?|ADUGU TRENDS

పేదోల్ల అవ్వల్ దర్జా ప్రిజ్జి ఏందంటే? ఎవ్వలైనా ఏం శెప్తరు? మట్టి కుండ అంటరు! అవు మల్ల గీ నేల తల్లి, మన గా కుమ్మరన్నలు మనకిచ్చిన మట్టి కుండల నీల్లు పెయికి...

స్పష్టతలేని బిల్లులు సమస్యలకు హేతువులు!?|EDITORIAL

భారతదేశ ప్రజాస్వామ్య దశ, దిశను ప్రభావితం చేసే కీలక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత అవసరం. ఈ రెండు అంశాల చుట్టూ ఉన్న అనుమానాలు, రాజకీయ వాదోపవాదాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి....

16-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ చతుర్దశి రాత్రి 07.01 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12.45 వరకు ఉపరి రేవతి యోగం ఐంద్ర ఉదయం 09.35 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం...

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News