Tuesday, September 15, 2026
29.8 C
Hyderabad

TELANGANA|తెలంగాణ సాహితీ శిఖరం ANDE SRI|అందెశ్రీ ఇక లేరు

CM REVANTH REDDY|సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

మృతి పట్ల ADUGU|DIGITAL MEDIA|అడుగు డిజిటల్ మీడియా దిగ్బ్రాంతి

తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయహే తెలంగాణ, జననిని జయ జయహే తెలంగాణ రచయిత, ప్రముఖ కవి, సాహితీ వేత్త అందెశ్రీ ఈరోజు ఉదయం ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మరణ వార్తతో సాహితీ వర్గాలు, తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు, రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిన అందెశ్రీని కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి మరణించినట్లు నిర్ధారించారు. ఆయన వయసు 68 సంవత్సరాలు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అందెశ్రీ ఆకస్మిక మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు కలిగింది. ఆయన రచనల ద్వారా కోట్లాది తెలంగాణ ప్రజల్లో ఆత్మగౌరవం నింపారు అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణ గేయం రాష్ట్ర సాధనకు ప్రతీకగా నిలిచిందని, ఆ పాట ప్రతి తెలంగాణ వాసి హృదయంలో స్ఫూర్తిగా మారిందని సీఎం గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గేయాన్ని కొత్త స్వరూపంలో రూపకల్పన చేసినప్పుడు అందెశ్రీతో కలిసి ఆలోచనలు పంచుకున్న సందర్భాలను ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఆయనతో తనకున్న స్నేహం, సాహిత్య దృష్టి, తెలంగాణపైనున్న మమకారం ప్రత్యేకమని అన్నారు. “
తెలంగాణ సాహితీ శిఖరం నేలకూలింది. ఆయన మరణం తెలంగాణ ఆత్మను తాకే లోటు అని సీఎం అన్నారు.

అందెశ్రీ కేవలం కవి, రచయిత మాత్రమే కాకుండా, తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో భావోద్వేగాల పునాదిగా నిలిచిన సాహిత్య జ్యోతి. ఆయన రచనలు తెలంగాణ మట్టివాసనతో, ప్రజల మనసుల్ని తాకే భాషతో ప్రసిద్ధి పొందాయి. ప్రజా కవిగా ఆయన కలం ఎప్పుడూ అణగారిన వర్గాల గొంతుకగా మారింది. కవిత్వం, గేయరచన, నాటకరచనల్లో తనదైన శైలిని ప్రదర్శించి, తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారు.

సాహిత్య రంగంలో తన కృషికి అనేక పురస్కారాలు అందుకున్న అందెశ్రీ, తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక సభల్లో పాల్గొని, జయ జయహే తెలంగాణ గేయం ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించారు. ఆ గేయం ఉద్యమానికి చిహ్నంగా మారి, ప్రతి ర్యాలీలో, ప్రతి మనసులో తెలంగాణ గర్వాన్ని నింపింది.

సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. తెలంగాణకు అందెశ్రీ చేసిన సాహిత్య సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి అని తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అందే శ్రీ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు.

సోమనాథ కళా పీఠం సంస్థ సోమనాథ సాహిత్య పురస్కారం అందించిందని, అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని ఆ సంస్థ అధ్యక్షులు డా.రాపోలు సత్యనారాయణ అన్నారు. వారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలందరికీ జయ జయహే గేయం స్ఫూర్తిదాయకంగా నిలిచినందెశ్రీ లేని లోటు భర్తీ కాని ఖాళీగా మారిందని అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా. మార్గం లక్ష్మీ నారాయణ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సాహిత్యం, భావజాలం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని, వారి మృతి తనకి వ్యక్తిగతంగా తీరని లోటు అన్నారు.

అందెశ్రీ మృతితో తెలంగాణ సాహితీ ప్రపంచం మౌనంగా మారిపోయింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పాలకుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గూడూరు లెనిన్, అడుగు డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజ, రాపోలు సోంసాయి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News