ఎన్కటికి వట్టి శేపల కూర వడిపిల్ల మెతుకులని మస్తు తినేటోల్లు. ఇప్పటికీ శేపలంటే కొందరు శెవులు కోసుకుంటరు. రుశికి రుశి, ఆరోగ్యానికారోగ్యం. గా కౌసుకు, ముండ్లకు భయపడ్తరు గనీ, గాదాన్ని కాదంటే, గా రుశే యేరు? గసొంటి శేపలు గాడ ఒలెయ్యకుండనే ఎదురెక్కి వత్తానయి? ఒకటి కాదు రెండు కాదుల్లా.. లచ్చల శేపలు!
గది తమిళనాడు తూత్తుకుడి జిల్లా కాయల్పట్టినం దగ్గరున్న సింగిత్తురై బీచ్. గా బీచ్ ల బుధారం అధాట్న లచ్చల ‘సాలై’ రకం శేపలు గా తీరానికి వచ్చిపడ్డయి. పానాలతో కొట్టుకొచ్చిన గా శేపలను శూసి గా జాలర్లు, జనం ఆశీర పోతాండ్రు. గవాటిని ఇండ్లకు తీస్కపోతాండ్రు. తింటోల్లు తింటాండ్రు. కొందరు అమ్ముకుంటాండ్రు. ఇంకొందరైతే ఎండబెట్టుకుంటాండ్రు. అయితే, గాడ గిట్ల శేపలు కొట్టుకొచ్చుడు మామూలేనట! ఏటా అక్టోబరు నుండి డిసెంబరు దాకా గా ‘సాలై’ శేపల సీజన్ ఉంటదట. వాతావరణ మార్పుల వల్ల తీరాల్లో గాలి వీస్తుండడంతోటి ఉపరితల నీల్లు సముద్రం నుంచి ఎల్లిపోతయట. ఇగ లోతైన సముద్రంల ఉండే సల్లటి నీల్లు పైకి వత్తయట. ఇగప్పుడు గుంపుగ పోయే ‘సాలై’ శేపలు తీరానికి కొట్టుకొత్తయట. గీ మద్దెల గా మణప్పాడు బీచ్ ల కూడ గిట్లనే గా శేపలు పానాలతోటి తీరానికి కొట్టుకొచ్చినయట.
వలెయ్యకుండనే శేతికి లచ్చల శేపలు!?|ADUGU TRENDS

