Thursday, November 19, 2026
20.7 C
Hyderabad

రైతులకు, వినియోగదారులకు ‘గిట్టు’బాటేది!?|EDITORIAL

రైతుకు గిట్టుబాటు ధర రావడం, వినియోగదారుడికి సరసమైన ధరకు కూరగాయలు అందడం పరస్పర విరుద్ధమేమీ కావు. మధ్యలోని సరఫరా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దితే, రెండూ సాధ్యమే. రైతు నష్టపోకుండా, వినియోగదారుడికి భారం కాకుండా చూడటం ప్రభుత్వాలు, మార్కెట్‌ వ్యవస్థల బాధ్యత. అన్నదాతకు ఆర్థిక భరోసా కల్పించినప్పుడే వ్యవసాయం నిలదొక్కుకుంటుంది. రైతు ముఖంలో చిరునవ్వు కనిపించినప్పుడే ఆహార భద్రతకు నిజమైన అర్థం చేకూరుతుంది!

మార్గం – అడుగు, ఎడిటోరియల్ 

వ్యవసాయంలో రైతు కష్టానికి తగిన సాయమే కాదు, ప్రతిఫలం కూడా దక్కడం లేదు. కూరగాయల సాగు రైతులకు లాభాల కంటే నష్టాలే ఎక్కువగా మిగులుస్తోంది. ఒక సీజన్‌లో టమాటాకు మంచి ధర వస్తే మరుసటి సీజన్‌లో ఎక్కువమంది రైతులు అదే పంట సాగు చేస్తున్నారు. ఫలితంగా మార్కెట్‌కు దిగుబడులు పోటెత్తి ధరలు కుప్పకూలుతున్నాయి. ధరలు పడిపోతే రైతులు సాగు తగ్గిస్తున్నారు. దీంతో కొరత ఏర్పడి మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఈ విషవలయం కూరగాయల మార్కెట్‌లో నిత్యకృత్యంగా మారింది.

అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, వరదలు, తెగుళ్లు వంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. సరఫరా తగ్గితే వినియోగదారుడికి ధరల భారం, సరఫరా పెరిగితే రైతుకు నష్టాలు తప్పడం లేదు. ఈ రెండు వర్గాల మధ్య సమన్వయం సాధించడంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ వైఫల్యం స్పష్టమవుతోంది.

ఈ సమస్య తీవ్రతను భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2024 అక్టోబర్‌లో విడుదల చేసిన ‘విజిటేబుల్స్ ఇన్ ఫ్లేషన్ ఇన్ ఇండియా : ఏ స్టడీ ఆఫ్ టొమాటో, ఆనియన్, పొటాటో’ అధ్యయనం వెల్లడించింది. పరిశోధన ప్రకారం వినియోగదారుడు చెల్లించే ప్రతి వంద రూపాయల్లో టమాటా రైతుకు కేవలం రూ.33, ఉల్లి రైతుకు రూ.36, ఆలుగడ్డ రైతుకు రూ.37 మాత్రమే దక్కుతున్నాయి. మిగిలిన మొత్తం సరఫరా వ్యవస్థలోని వివిధ దశలకు వెళ్తోంది. దీనికి భిన్నంగా పాల ఉత్పత్తుల విషయంలో రైతుకు తుది ధరలో సుమారు 70 శాతం వాటా లభిస్తోంది. అంటే కూరగాయల మార్కెట్‌లో రైతు వాటా ఎంత తక్కువగా ఉందో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఉదాహరణకు వినియోగదారుడు కిలో టమాటాకు రూ.30 చెల్లిస్తే రైతుకు సగటున రూ.10 మాత్రమే దక్కుతుంది. మిగిలిన రూ.20లో సేకరణ, రవాణా, నిల్వ, నాణ్యత విభజన, హోల్‌సేల్‌, రిటైల్‌ విక్రయాల ఖర్చులు, మార్జిన్లు ఉంటాయి. ఈ వ్యత్యాసమంతా వ్యాపారుల లాభమేనని భావించడం సరికాదు. అయితే, సరఫరా వ్యవస్థలో రైతు బేరసారాల శక్తి బలహీనంగా ఉండటం మాత్రం ఆందోళనకరం.
పంట కోసిన వెంటనే అమ్ముకోవాల్సిన పరిస్థితి రైతుది. అప్పులు తీర్చాలి, పెట్టుబడి సమకూర్చుకోవాలి. కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడంతో ధరలు తక్కువగా ఉన్నా విక్రయించక తప్పడం లేదు. మరోవైపు నిల్వ సామర్థ్యం, ఆర్థిక వనరులు ఉన్న వ్యాపారులకు సరుకును కొంతకాలం నిల్వ ఉంచే వెసులుబాటు ఉంటుంది. ఈ అసమానతే రైతు ఆదాయాన్ని దెబ్బతీస్తోంది.

ఈ పరిస్థితిని మార్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కోల్డ్‌ స్టోరేజీలు, శీతలీకరణ రవాణా వ్యవస్థలను విస్తరించాలి. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి సామూహిక విక్రయాలకు అవకాశం కల్పించాలి. టమాటా వంటి త్వరగా పాడయ్యే పంటలతో సాస్‌, ప్యూరీ, పల్ప్‌ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలి. మార్కెట్‌ డిమాండ్‌, ధరలు, సాగు విస్తీర్ణంపై ముందస్తు సమాచారాన్ని రైతులకు అందించాలి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలి. మార్కెట్‌ యార్డుల్లో పారదర్శక వేలం, ప్రత్యక్ష విక్రయాలు, మెరుగైన రవాణా సదుపాయాలు అందుబాటులోకి తేవాలి.

కూరగాయలకు కనీస మద్దతు ధర విధానాన్ని అమలు చేయడం సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించాలి. ధరలు ఉత్పత్తి వ్యయం కంటే దిగజారినప్పుడు రైతులను ఆదుకునే ధరల స్థిరీకరణ నిధి, మార్కెట్‌ జోక్య వ్యవస్థలను బలోపేతం చేయాలి.

రైతుకు గిట్టుబాటు ధర రావడం, వినియోగదారుడికి సరసమైన ధరకు కూరగాయలు అందడం పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు కావు. మధ్యలోని సరఫరా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దితే రెండూ సాధ్యమే. పంట పండించిన రైతు నష్టపోకుండా, కొనుగోలు చేసిన వినియోగదారుడికి భారం కాకుండా చూడటం ప్రభుత్వాలు, మార్కెట్‌ వ్యవస్థల బాధ్యత. అన్నదాతకు ఆర్థిక భరోసా కల్పించినప్పుడే వ్యవసాయం నిలదొక్కుకుంటుంది. రైతు ముఖంలో చిరునవ్వు కనిపించినప్పుడే ఆహార భద్రతకు నిజమైన అర్థం చేకూరుతుంది.

Latest News

ఆకరి సూపు కోసం అవ్వ శవం ఎదురు సూత్తాంది!?|ADUGU TRENDS

తలంత బలగం, తలకు పోసే దిక్కులేకుండా పోయిందనే సామెత గా అవ్వకు బాగా అతికింది. గా తల్లికి ఇద్దరు బిడ్డలు. బంధుగులు కూడా ఉన్నరు. కానీ, గవాల్లంతా గిప్పుడు యాడున్నరో తెలవదు. 40...

నవంబర్ 20, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 01.54 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 03.29 వరకు ఉపరి రేవతి యోగం వజ్ర రాత్రి 02.33 వరకు ఉపరి సిద్ది కరణం వణజి పగలు 02.01...

పచ్చని సంసారంల చాట్ జీపీటీ చిచ్చు!?|ADUGU TRENDS

దేని మీదనైనా ఆధారపడినా, అలవాటైనా ఇగంతే సంగతులు. అయిన దానికి, కాని దానికి కూడా గాదాని మీదకే పానం గుంజుతది. గట్లనే గా లెక్కలు శేసే కాలుక్ లేటర్, శేతుల్ల పట్టుకునే పోన్లు...

కాలుష్య కాసారంగా భూగోళం!?|EDITORIAL

ప్రకృతిని కాపాడితేనే మన భవిష్యత్తును కాపాడుకోగలం. భావితరాలకు కాలుష్య భరిత ప్రపంచాన్ని కాకుండా ఆరోగ్యకరమైన భూగోళాన్ని అందించడం నేటి తరంపై ఉన్న చారిత్రక బాధ్యత!? మార్గం - అడుగు, ఎడిటోరియల్  ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి పేరుతో...

నవంబర్ 19, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.దశమి రాత్రి 02.03 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 03.02 వరకు ఉప6 ఉత్తరాభాద్ర యోగం హర్షణ రాత్రి తెల్ల 03.53 వరకు ఉపరి వజ్ర కరణం తైతుల పగలు 01.54...

ఆంటీ మైక్రోబియల్ నిరోధకతను నివారిద్దాం|DR RASANA|HEALTH|MEDICAL|ESSAY

(ప్రపంచ ఆంటీ మైక్రోబియల్ అవగాహన సప్తాహమ్: 18-24 నవంబర్ 2026) వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు, పరాన్నజీవులు వాటిని చంపటానికి ఉద్దేశించిన మందులకు తట్టుకొని మనగలగటమే ఆంటీ మైక్రోబియల్ నిరోధకత (ఎఎంఆర్). ఫలితంగా...

ఓటుతోటే ‘నోటు’!?|ADUGU TRENDS

జనాలు బీరుకు, బిర్యానీకి, ఓటుకు నోటుకు అలవాటు పడ్డరు. గా నేతలు గట్ల అలవాటు శేసిండ్లు. ఇగ గదాన్నే నాయకులు, జనం కొనసాగిత్తున్నరు. నోటిత్తేనే ఓటేత్తమని, గట్లియ్యకపోతే, గా ఓటే ఏయ్యనోల్లు కూడా...

ఇది ‘సువర్ణా’వకాశమేనా!?|EDITORIAL

పైపైకి వెళ్ళిన పసిడి ధరలు కిందకు దిగి వస్తున్నాయి. మరి బంగారం ధర లక్షకు చేరేనా? వెండి ధరలు మరింత తగ్గేనా? పెట్టుబడులకు ఇదే సరైన సమయమా? కొనుగోలుకు ఇదే సువర్ణావకాశమా!? మార్గం -...

నవంబర్ 18, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం తిధి శు.నవమి రాత్రి 01.40 వరకు ఉపరి దశమి నక్షత్రం శతభిషం రాత్రి 02.06 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం వ్యాఘాత రాత్రి తెల్ల 04.48 వరకు ఉపరి హర్షణ కరణం బాలవ పగలు 01.15...

బొంద పెట్టినా, బతికిండు!?|ADUGU TRENDS

భూమ్మీద నూకలుండాలె గనీ, గా బొంద పెట్టినా బతుకుతరు! కట్టెల్ల కాల్సినా లేత్తరు!! నడి సంద్రంల ముంచినా తేల్తరు!!! యినడానికి ఇచ్చెంత్రంగున్నా, కనడానికి కట్టుకత లెక్క అనిపించినా, గిదే నిజముల్లా. కావాల్నంటే, ఇగో...

ఏఐ భవిష్యత్తుపై నీలినీడలు!?|EDITORIAL

ఒక వ్యక్తి ప్రతిభతో ఎదిగిన సంస్థ, అదే వ్యక్తి వ్యక్తిగత వ్యవహారాలతో సంక్షోభంలో పడటం కార్పొరేట్‌ ప్రపంచానికి హెచ్చరిక. గొప్ప విజయాలు సాధించినంత మాత్రాన వ్యక్తిగత బాధ్యతల నుంచి మినహాయింపు ఉండదు. నైతికత,...

నవంబర్ 17, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు కార్తీకమాసం శుక్లపక్షం గోఅష్టమి వ్రతం తిధి శు.అష్టమి రాత్రి 12.47 వరకు ఉపరి నవమి నక్షత్రం ధనిష్ఠ రాత్రి 12.40 వరకు ఉపరి శతభిషం యోగం ధ్రువ రాత్రి తెల్ల 05.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర పగలు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News