శ్రీ పరాభవనామ సంవత్సరం
దక్షిణాయణం-శరత్ ఋతువు
కార్తీకమాసం శుక్లపక్షం
తిధి శు.నవమి రాత్రి 01.40 వరకు
ఉపరి దశమి
నక్షత్రం శతభిషం రాత్రి 02.06 వరకు
ఉపరి పూర్వాభాద్ర
యోగం వ్యాఘాత రాత్రి తెల్ల 04.48
వరకు ఉపరి హర్షణ
కరణం బాలవ పగలు 01.15 వరకు
ఉపరి కౌలవ
రాహుకాలం పగలు 12.00 నుండి
01.30 వరకు
దుర్ముహూర్తం ఉదయం 11.18 నుండి
12.02 వరకు
వర్జ్యం ఉదయం 08.20 నుండి 10.02
వరకు
సూర్యోదయం ఉదయం 06.20
సూర్యాస్తమయం సాయంత్రం 05.41
మేష రాశి:
మీ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు. ఆర్థిక విషయాల్లో అనవసర ఖర్చులను నియంత్రించండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
వృషభ రాశి:
నిలిచిపోయిన పనుల్లో కదలిక కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఆహార నియమాలు పాటించడం మంచిది.
మిథున రాశి:
మీ ప్రతిభను నిరూపించుకోవడానికి మంచి అవకాశం వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాజనకమైన సమాచారం అందుతుంది. ధన సంబంధిత నిర్ణయాల్లో తొందరపడకండి. స్నేహితుల సహకారంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది.
కర్కాటక రాశి:
కుటుంబ బాధ్యతలు కొంత పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కొత్త మార్గాలు అన్వేషిస్తారు. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది.
సింహ రాశి:
గతంలో చేసిన ప్రయత్నాలకు గుర్తింపు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం అందుతుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడుల విషయంలో ఆలోచించి ముందడుగు వేయండి. ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తారు.
కన్య రాశి:
ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకునే అవకాశం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తారు. కుటుంబంలో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. మాటతీరు మృదువుగా ఉంచితే పరిస్థితులు అనుకూలిస్తాయి.
తుల రాశి:
మీకు అనుకూలమైన పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో సహచరుల సహకారం లభిస్తుంది. వ్యాపారంలో కస్టమర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. శుభవార్త వినే సూచనలు ఉన్నాయి. వ్యక్తిగత సంబంధాల్లో ఆనందం పెరుగుతుంది.
వృశ్చిక రాశి:
మీ నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. వృత్తిలో ఎదురైన ఆటంకాలను అధిగమిస్తారు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యుల సలహాలు పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
ధనుస్సు రాశి:
కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన మార్పులు కనిపించవచ్చు. దూరప్రాంతాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఖర్చుల విషయంలో పొదుపు పాటించండి.
మకర రాశి:
మీ కష్టానికి తగిన గుర్తింపు పొందే సమయం. ఉద్యోగంలో పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి. పాత ఆర్థిక సమస్య పరిష్కార దిశగా సాగుతుంది. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు.
కుంభ రాశి:
కొత్త ఆలోచనలు మీకు మంచి అవకాశాలను తీసుకొస్తాయి. వ్యాపారంలో పోటీని సమర్థంగా ఎదుర్కొంటారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నించేవారికి అనుకూల సమాచారం రావచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలు బలపడతాయి. తొందరపాటు నిర్ణయాలు వద్దు.
మీన రాశి:
మీలో సృజనాత్మకత పెరుగుతుంది. వృత్తి జీవితంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది.


