Wednesday, August 19, 2026
25.1 C
Hyderabad

POLICE|పోలీసులపై CP|సీపీ సీరియస్|SERIOUS

KONDA MURALI| కొండా మురళికి ESCORT| ఎస్కార్ట్ వెళ్లిన ACP| ఏసీపీ, INSPECTOR| ఇన్స్పెక్టర్లకు MEMO|మెమోలు

WARANGAL EAST CONSTITUENCY| వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నేత, రాష్ట్ర MINISTER| మంత్రి KONDA SUREKHA| కొండా సురేఖ భర్త కొండా మురళీధర్‌రావుకు ఎస్కార్ట్‌గా పోలీసులు వెళ్లిన వ్యవహారంపై WARANGAL| వరంగల్ POLICE COMMISSIONER| పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సీరియస్ అయ్యారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘించిన వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన పలువురు పోలీసు అధికారులకు ఆయన మెమోలు జారీ చేశారు. అధికారిక ప్రొటోకాల్ లేని వ్యక్తికి పోలీసులు బందోబస్తు ఇవ్వడం వల్ల పోలీస్ శాఖ పరువు తీసినట్లేనని వారితో అన్నట్లు తెలిసింది.

ఈ మేరకు వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్‌తో పాటు మిల్స్ కాలనీ, మట్టెవాడ, ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌ల ఇన్‌స్పెక్టర్లు, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్, ఎస్సైలకు సీపీ మెమోలు జారీ చేశారు. వారంతా శనివారం విధులను వదిలి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు వెంట ఎస్కార్ట్‌గా వెళ్లినట్లు సమాచారం. దీనిపై ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ ద్వారా విచారణ చేపట్టి నివేదిక సేకరించిన సీపీ, చర్యలకు శ్రీకారం చుట్టారు. నిబంధనలు ఉల్లంఘించిన తీరుపై మెమోలు తీసుకున్న అధికారులు రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే నివేదిక ఆధారంగా శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశమున్నదని మెమోలో పేర్కొన్నారు.

ఈ ఘటనపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నుండి తీవ్రమైన వ్యతిరేకత కన్పిస్తుంది. పోలీసులను వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం వినియోగించడం సరికాదన్న భావన వ్యక్తమవుతోంది. కొండా మురళికి ఎస్కార్ట్ ఇవ్వడమే కాకుండా, గతంలోనూ ఇలాగే పలుమార్లు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించినట్లు సమాచారం. నాలుగు రోజుల క్రితం కూడా కొండా మురళీతో పాటు మంత్రి సురేఖ హాజరైన ఓ ఫంక్షన్‌కు హనుమకొండ హంటర్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్‌కి పోలీసుల ఎస్కార్ట్ వెళ్లిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ సందర్భంలో సుబేదారి పోలీసులే కాకుండా, వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, మిల్స్ కాలనీ, మట్టెవాడ, ఇంతేజార్ గంజ్ ఇన్‌స్పెక్టర్లు కూడా హనుమకొండ రాంనగర్లోని కొండా నివాసం నుంచి ఫంక్షన్ హాల్‌కి ఎస్కార్ట్‌గా వెళ్లినట్లు సమాచారం.

ఇలాంటి ఘటనలతో సామాన్య ప్రజలకు పోలీసు సేవలు అందడంలో ఆటంకం ఏర్పడుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధులను వదిలి ప్రొటోకాల్ లేని వ్యక్తులకోసం వెళ్లడం వల్ల ప్రజలకు నష్టమే జరిగిందని, పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చేనని భావిస్తున్నారు. ఈ మెమోల జారీతోనైనా అధికారులు మారతారా? లేదా? అనేది చూడాలి.

Latest News

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 16 నుండి ఆగస్టు 22 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు ఆత్మవిశ్వాసం పెరిగి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు....

గీ మిఠాయి మస్తు పిరం. కిలోకి 51 యేలే!|ADUGU TRENDS

ధర అదిరింది కదా! యే తియ్ మిఠాయి కి గంత ధరే0ది? అనుకుంటా0డ్లా? ఔ మల్ల నిజంగానే గా మిఠాయి కి గంత ధర ఎందుకంటే గా మిఠాయిల బంగారం కలిపిండ్రు. గది...

స్వాతంత్ర్యం, విద్వేషం విధ్వంసం, విషాదం!?|EDITORIAL

స్వాతంత్య్రం మనకు గొప్ప వరం. విభజన దాని వెంటే వచ్చిన మహా విషాదం! ఆ చీకటి అధ్యాయాన్ని గుర్తుచేసుకోవడం ఏ పార్టీనీ అవమానించడానికి కాదు. భవిష్యత్తులో మతం, ప్రాంతం, భాష పేరుతో సమాజం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News