Monday, August 24, 2026
23.3 C
Hyderabad

నా వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం సరైంది కాదు|Konda Surekha|

మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు

|Konda Surekha|Comments|Sensational|Telangana

మంత్రి కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఆమె స్పష్టత ఇచ్చారు. “నిన్న వరంగల్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు,” అంటూ బీఆర్ఎస్ నేతలపై ఆమె మండిపడ్డారు. “నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పటి మంత్రులు ఏ పని చేయాలన్నా పైసలు తీసుకునేవారని మాత్రమే అన్నాను. ఇది అక్షర సత్యం. నా ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను,” అని మంత్రి స్పష్టం చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

బీఆర్ఎస్ హయాంలో మంత్రుల పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రతి ఫైల్‌కు ముడుపులు తీసుకునే అలవాటు ఆ సమయంలో ఉండేదని ఆమె ఆరోపించారు. “ఇది నిజమా కాదా అన్నదీ బీఆర్ఎస్ నేతలకే తెలుసు. కానీ ఇప్పుడు నా వ్యాఖ్యలను వక్రీకరించడం సరైన చర్య కాదని స్పష్టం చేశారు. పెయిడ్ సోషల్ మీడియా వేదికగా నా మాటల్ని ఎడిట్ చేసి, ముందు వెనక భాగాలు తొలగించి, కావాలనే వీడియో క్లిప్‌ను హైలైట్ చేస్తూ, మా మంత్రివర్గ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు,” అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

“ఈ కుట్రలు బీఆర్ఎస్ నాయకుల అసహనానికి నిదర్శనాలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పాలన అందిస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి దుష్ప్రచారాలకు తెగబడుతున్నారు,” అని సురేఖ మండిపడ్డారు. ఆమె చెప్పినట్లుగా, తన వ్యాఖ్యలు పూర్తిగా గత ప్రభుత్వంలోని అవినీతిపైనే ఉన్నాయని, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మంత్రి సహచరులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

“బీఆర్ఎస్ హయాంలో ‘పైసలు ఇస్తేనే ఫైళ్లు కదలుతాయ’న్న అభిప్రాయం ప్రజల్లో బలంగా పడింది. అప్పటి మంత్రుల నిర్వాకం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. దళిత బంధు, మిషన్ కాకతీయ వంటి పథకాల్లో ముట్టడిపోయిన కమిషన్ల బాగోతాలను మీ సీఎం కేసీఆర్ గారే స్వయంగా బయటపెట్టారు. ఒక మంత్రి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటాడని చెప్పిన ఘనత కూడా మీకే చెందుతుంది. ఇదే కారణంగా ప్రజలు మిమ్మల్ని ఓటుతో గుణపాఠం చెప్పారు,” అని మంత్రి తెలిపారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

“ఇప్పటికీ మీ బుద్ధి మారలేదు. ప్రతి అంశాన్ని వక్రీకరించి వక్రబాష్యం చెబుతున్నారు. ఇలా చేస్తూ మీ అసలు స్వరూపాన్ని ప్రజల ముందే బయటపెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతికి, అబద్ధాలకు పుట్టిన విష పురుగు. ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెబుతారు. మళ్లీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే అస్సలు సహించేది లేదు. తగిన చర్యలు తీసుకుంటాం,” అంటూ మంత్రి కొండా సురేఖ తీవ్ర హెచ్చరికలు చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

Latest News

ఆగస్టు 24, సోమవారం, 2026|RASHI PHALALU 

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి తెల్ల 05.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 08.43 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం ప్రీతి ఉదయం 08.32 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ సాయంత్రం 04.17...

మౌర్యుల చరిత్ర|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు) భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా...

నడుస్తున్న మనిషి|POETRY|PARVATHALU

నిలబడిన చోట పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు మనుషులు కూలిపోతూ కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు అనారోగ్యమిప్పుడు శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే అయ్యో !ఇందాకనే ఫోన్ లో మాట్లాడిండని అంటూ...

మనిషి అంటే పర్వతాలే!|PARVATHALU|HUMANITY

పర్వతాలు... పేరుకు తగ్గట్లే, మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం...

సీఎం సహాయ నిధికి 10 యేలిచ్చిన బిచ్చగాడు!?|ADUGU TRENDS

బిచ్చగాడే గదాని తీసి పారేయొద్దు. తక్కువ సూడొద్దు. ఒక్కొక్కటే వందలు, యేలైతయి. కానీ, గయి కూడబెట్టనీకే ఎంతో కట్ట పడాలె. బిచ్చమెత్తడం అంత అల్కనేం కాదు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా,...

రూపాయి బియ్యంతో కోట్లలో దళారుల దందా!|EDITORIAL

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే కాదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను నిలువునా మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నాయి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 23 నుండి ఆగస్టు 29 వరకు వార రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...

ఒక్కరోజు బిచ్చగాడి సంపాదనెంతంటే..!?|ADUGU TRENDS

ఒకాయినెకు ఓ అవుడియా వచ్చింది. తానే బిచ్చమెత్తితే? గట్ల బిచ్చమెత్తి రోజుకు ఎంత సంపాయించొచ్చు? గదాంట్ల ఉండే సాదకబాదకాలు తెలుసుకుందామని. ఇగ ఆగకుండ ఐవుడియా వచ్చిందే లెక్క... యెంటనే ఆ అవతారమెత్తిండు. ఆఖరికి...

ప్రియాంక-బెటర్ ఛాయిసేనా!?|EDITORIAL

కాంగ్రెస్ కు ‘ప్రియాంక బెటర్ ఛాయిసా?” అన్నదానికంటే ‘కాంగ్రెస్ మెరుగైన ప్రతిపక్షంగా ఎలా సాగాలి?’ అన్నదే ముఖ్యం. సభను సజీవంగా మార్చడం ద్వారా ప్రతిపక్షం బలపడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాన్ని...

ఆగస్టు 22, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి దశమి రాత్రి 01.18 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ పగలు 03.33 వరకు ఉపరి మూల యోగం వైధృతి ఉదయం 07.15 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల పగలు 12.18 వరకు ఉపరి గరజి రాహుకాలం...

కొండా సురేఖ చుట్టూ రాజకీయ ఉచ్చు..|KONDA SUREKHA|CONGRESS|CM|REVANTH REDDY

పార్టీ నుంచి బహిష్కరించాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు|MLA|MLC తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన...

గిదో కుక్కల కు.ని. పంచాయితీ!?|ADUGU TRENDS

గీ మద్దెల కుక్కల రోజులొచ్చినయి. మనుసుల లెక్కనే గా కుక్కల జనాభా కూడా పెరిగింది. గవి జనం మీదకు ఎగపడుడు. కరుసుడు, పీక్కతినుడు కూడా ఎక్కువై పోయింది. గ వాట్ని సంపుదామంటే, జీవ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News