Tuesday, September 29, 2026
32.8 C
Hyderabad

పాలకుర్తి రాజకీయాల్లో పెనుమార్పులు

బీఆర్‌ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ,

కాంగ్రెస్‌లో వలసల జోరు

ఝాన్సీ రెడ్డి సమక్షంలో కీలక మైనారిటీ నేత పార్టీలో చేరిక

పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బి.ఆర్.ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్‌లోకి వెళ్లిపోతున్నారు. తాజాగా శనివారం జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మహమ్మద్ మదార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఈ పరిణామం బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కలకలం రేపుతోంది.

ఎర్రబెల్లి నాయకత్వంపై అసంతృప్తి కారణమా?

బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నాయకత్వంపై ఉన్న అసంతృప్తే ఈ వలసలకు ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పలు వర్గాల సమాచారం ప్రకారం, మరికొంత మంది బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. పార్టీ లోనికి నూతన రక్తం తీసుకురావడంలో విఫలమవుతుండటం, నాయకత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే భావనతో పలువురు అసంతృప్త నేతలు ఇతర పార్టీల వైపు మొగ్గు చూపుతున్నారు.

సీనియర్ నేతల గందరగోళం

తన 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఉపయోగించినప్పటికీ, అనుచరులను కాపాడుకోలేకపోతున్నందుకు మాజీ మంత్రి తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో అధికారం కోల్పోతామన్న భయం, అనుచరులు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్న విధానం ఆయనను కలవరపెడుతున్నాయనే మాటలు వినిపిస్తున్నాయి.

వ్యూహాత్మకంగా కాంగ్రెస్

ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీ రాజేందర్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. బీఆర్‌ఎస్‌లో అసంతృప్త నేతలను ఆకర్షించేందుకు ఎన్నికల ముందు మాజీ మంత్రి నేర్పిన రాజకీయాన్ని వాడుతున్నారు. ఈ పరిణామాలు సాగుతున్న వేళ, బీఆర్‌ఎస్ నాయకత్వం దీనికి ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Latest News

తెలంగాణలో… కమల వికాసం కలేనా!?|TELANGANA|BJP

రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉందా? కాషాయంలో అంతర్గత కలహాలు! కావాల్సిన కసరత్తేది? కార్యాచరణేది? పార్టీకి సత్తువెక్కడ? సమన్వయం ఎక్కడ? సీనియర్లకు, కార్యకర్తలకు గుర్తింపేది? సమీక్షలున్నాయా? సవరింపులున్నాయా? పెరుగుతున్న పార్టీకి... పెరగని గ్రామీణ బలం! కేంద్ర పదవులు... రాష్ట్రానికి ఉపయోగమేనా? బూత్ కమిటీలు ఉన్నాయా? పనిచేస్తున్నాయా? కొత్త...

ఇంద్రుడి మీద న్యాయమూర్తికి ఫిర్యాదు!?|ADUGU TRENDS

వాన దేవుడు వానలు కురిపిత్తరని మనం నమ్ముతం. గా వానాకాలం, సలికాలం, ఎండాకాలమని ఓ లెక్క పకారం వత్తయి. గీ మద్దెల గయి కూడా లెక్క తప్పినయి. పడితే ఒకటే వాన.. లేకపోతే...

మాటలు మంటలు రేపితే.. యుద్ధం ఎక్కడ ఆడుతుంది.!?|EDITORIAL

శాంతి చర్చలు సాగాల్సిన వేళ.. అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. క్షిపణుల హెచ్చరికలతో ప్రపంచం వణుకుతోంది.. చమురు ధరలు కదులుతున్నాయి.. ఆర్థిక వ్యవస్థలు ఆందోళనలో పడుతున్నాయి. ఒకవైపు సైనిక ఒత్తిడి.....

సెప్టెంబర్ 29, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి బ తదియ సాయంత్రం 06.25 వరకు ఉపరి చవితి నక్షత్రం అశ్విని ఉదయం 11.09 వరకు ఉపరి భరణి యోగం వ్యాఘాత ఉదయం 09.07 వరకు ఉపరి హర్షణ కరణం వణజి ఉదయం...

సెప్టెంబర్ 28, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 07.56 వరకు ఉపరి తదియ నక్షత్రం రేవతి ఉదయం 10.49 వరకు ఉపరి అశ్విని యోగం ధ్రువ ఉదయం 11.21 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల ఉదయం 08.32...

గీ యినాయకునికి.. నిమజ్జనమే లేదు!?|ADUGU TRENDS

పతి ఏటా యినాయకులను పతిష్టించి, పూజించి, కోటొక్క తీర్గ కొలిచి సివరాకరికి నిమజ్జనం చేస్తుంటం. కానీ, గీ యినాయకునికి నిమజ్జనమే లేదు!? ముంబై గిర్గావ్ లో ఓ గణేశ్ మండలి గీ సంప్రదాయాన్ని...

కత్తులు దూసిన చేతులే.. కరచాలనం!|EDITORIAL

నిన్నటి వరకు పరస్పరం సుంకాలు, ఆంక్షలు, హెచ్చరికలతో ఢీకొన్న అమెరికా–చైనా.. ఒక్కసారిగా ఆత్మీయ ఆలింగనంలో కనిపించాయి. శత్రువుల్లా కనిపించిన రెండు అగ్రశక్తుల అధినేతలు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది....

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 03 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం కొత్త బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో మీ పనితీరును ఉన్నతాధికారులు గమనించే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న...

ఇగ్రహం ఉన్న సోటనే నిమజ్జనం!|ADUGU TRENDS

ప్రతి ఏటా ఇనాయకులను నిలబెడత0.. తొమ్మిది, పది రోజులు ఘనంగా పూజలు సేస్త0. ఇగ గా ఇగ్రహాలను చెరువుల్ల, కుంటల్ల నిమజ్జనం సేస్త0. గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సేసే గా...

సర్ వివాదం.. ఈసీ విశ్వసనీయతకు సవాల్!|EDITORIAL

ఓటు ప్రజాస్వామ్యానికి ఆయుధం.. ఆ ఓటుకు కాపలాదారు ఈసీ! మరి కాపలాదారుడి విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తితే? సర్ వివాదాలు, కమిషనర్ల అభ్యంతరాలు, ప్రతిపక్షాల ఆరోపణల నడుమ.. ఎన్నికల సంఘం పారదర్శకత ఇప్పుడు దేశం...

సెప్టెంబర్ 26, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 09.45 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం11.50 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం గండ పగలు 02.41 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర ఉదయం 09.48 వరకు ఉపరి బవ రాహుకాలం...

అడుగుకు అభినందనలు!|ADUGU DIGITAL MEDIA

మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు! పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News