వాన దేవుడు వానలు కురిపిత్తరని మనం నమ్ముతం. గా వానాకాలం, సలికాలం, ఎండాకాలమని ఓ లెక్క పకారం వత్తయి. గీ మద్దెల గయి కూడా లెక్క తప్పినయి. పడితే ఒకటే వాన.. లేకపోతే లేనే లేకపాయె. గట్ల గా ఉత్తర ప్రదేశ్ ల వానలు బాగా పడతానయి. గా వానలతో ఆగమాగమై మనుసుల పానాలు కూడా పోతానయి. గివీటిని సూసి పానం సెలించిన ఒకాయినె ఏకంగా ఇంద్రుడి మీదనే న్యాయమూర్తికి ఫిర్యాదు శేసిండు.!?

ఉత్తర ప్రదేశ్ రాస్ట్రం హర్దోయ్ జిల్లాకు సెందిన సూరజ్ గీ పని శేసిండు. ‘గా ఇంద్రుడి పోన్ నెంబర్ నాకు తెలవదు. గాయినె ఎక్కడుంటడో అడ్రస్ కూడా తెల్వదు. కానీ, గీ వానలేంది? ఎప్పుడు పడితే గప్పుడు గీ తీర్గ వానలు పడితే జనమేం కావాలె? కొంచెం మతలబైన సెప్పాలె కద? జనం ఆగమాగమైతాండ్రు. సచ్చిపోతాండ్రు. గూడు, టికానా కూడా లేకుండా పోతానయి. గిదంత పని కాదు. గా ఇంద్రుడికి శెప్పండి. గీ వానల్ని ఆపమని. గాయినె మీద చర్యలు కూడా తీసుకోండ్రంటూ’ గా రాసిచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నడు. గీ ఉత్తరాన్ని గా జిల్లా న్యాయాధికారికి పంపిండు. గీ మద్దెల గా ఉత్తర ప్రదేశ్ ల 56 మంది గీ వానలకే సచ్చిపోయిండ్రంట. ఇగ గీ ఉత్తరం మస్తు వైరలైతాంది.!?

