గీ అవ్వ అందరసొంటి మామూలు అవ్వ కాదు. భలే బాద్దరిది. పేరుకే ముసలిది కనీ, వయసొళ్ళు కూడా సేయలేని పనులు శేసి సూపిత్తా0ది. ఏకంగా వింగ్ వాక్ శేసి అందరి మనసులను గెలిసి0ది. తాజాగా తన గిన్నీస్ రికార్డును తానే బద్దలు కొట్టింది.

గీ అవ్వ పేరు బ్రెట్టి. ఊరు ఇంగ్లాండు. వయసు 97 ఏ0డ్లు. గీ మద్దెలనే పక్షవాతం వచ్చి నయమైంది. అయినా, ఊకెనే ఇంట్లో కూసోలే. తనకంతకు ముందు నుంచే తెలిసిన వింగ్ వాక్ చేసి చూపింది. యిమాన0 రెక్కలకు ఏసుక్రీస్తు శిలువోలే కట్టుకొని గాలిలో విమానం లేసి పోతా0టే, పల్టీలు కొడతా ఉంటె అట్లనే ఉండి గాలిల తేలి పోయింది. అందరిని ఆశీర పరిసింది.

