Tuesday, September 22, 2026
26.3 C
Hyderabad

సర్కార్ దవాఖానాలో గర్భస్త శిశువు మృతి

డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యమంటూ ఆరోపణ
శిశువు మృతదేహంతో బాధితుల ఆందోళన
బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్, ప్రజాసంఘాలు
తెల్లవారు జాము 3 గంటల వరకు రాస్తారోకో
8 గంటల పాటు హాస్పిటల్ వద్ద హై డ్రామా
బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామన్న పోలీసులు
విచారించి డాక్టర్లు, సిబ్బందిపై వేటు వేస్తామన్న అధికారులు
పోలీసులు, అధికారుల హామీతో శాంతించిన ఆందోళనకారులు

పాలకుర్తి సర్కార్ దవాఖానాలో గర్భస్త శిశువు మృతి చెందడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. డాక్టర్లు సిబ్బంది నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందినట్లు ఆరోపించిన బాధితులు సర్కార్ దవాఖానా వద్దే ఆందోళనకు దిగారు. ప్రధాన కూడలిలో రాస్తా రోకో చేశారు. వారికి మద్దతుగా బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ ఎంఎల్ లిబరేషన్, ప్రజాసంఘాల నాయకులు నిలిచారు. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. బుధవారం సాయంత్రం 7 గంటల నుంచి గురువారం తెల్లవారు జాము 3 గంటల వరకు 8 గంటల పాటు హైడ్రామా నడిచింది. బాధితులు ఎంతకూ వినకపోవడంతో కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ ఓ దిగి వచ్చారు. జరగిన ఘటనపై క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు, విచారణ జరిపి, దోషులను శిక్షిస్తామని వైద్యాధికారులు హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు.

బాధితుల కథనం ప్రకారం…పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన యాట భిక్షపతి భార్య యాట అర్చన ప్రసవానికి పాలకుర్తిలోని ప్రభుత్వ దవాఖానాకి మంగళవారం మధ్యాహ్నం వచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యురాలు అపర్ణ, మరో డాక్టర్, సిబ్బంది నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి, నొప్పులు రావడం లేదని ఆబ్జర్వేషన్ లో ఉంచారు. తీరా బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పరిస్థితి విషమించడంతో పాలకుర్తిలోని ఓ ప్రవేట్ హాస్పిటల్ కి వెళ్లాలని సూచించారు. తీరా చేసేదేమీ లేక అక్కడకు తరలించగా అప్పటికే గర్భంలోని శిశువు మృతి చెందారని ప్రసవం చేశారు. శిశువును విగత జీవిగా చూడడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ పండంటి బిడ్డను పొట్టన పెట్టుకున్నారంటూ సర్కార్ దవాఖానా వైద్యులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శిశువు మృత దేహంతో బాధిత బంధువులు దవాఖానా ఎదుటే ఆందోళనకు దిగారు.

ఇదిలావుండగా, బీఆర్ఎస్ కు చెందిన మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షుడు పసునూరి నవీన్, గూడ దామోదర్, యూత్ నాయకులు మహేందర్, సురేశ్, రాజేంద్రా చారి తదితరులు, బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్, పట్టణ అధ్యక్షుడు పబ్బ సంతోశ్, నాయకులు కమ్మగాని శ్రీకాంత్, దుంపల సంపత్, సిపిఐ ఎం ఎల్ నేత, ప్రజా సంఘాల నేత గుమ్మడి రాజుల సాంబయ్య తదితరులు బాధితులకు మద్దతుగా నిలిచారు. ప్రభుత్వానికి, వైద్యులు, సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎసిపి నర్సయ్య, పాలకుర్తి సిఐ గట్ల మహేందర్ రెడ్డి, ఎస్ఐలు దూలం పవన్ కుమార్, రాజు, రామ్ చరణ్ లు సహా పోలీసులు జోక్యం చేసుకున్నా, అర్థరాత్రి వరకు పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఆందోళనకారులు పాలకుర్తిలోని ప్రధాన కూడలిలో రాస్తారోకోకు దిగారు. దీంతో కలెక్టర్ జోక్యంతో ఎట్టకేలకు జనగామ జిల్లా డిప్యూటీ వైద్యాధికారి రవీందర్, హాస్పిటల్ సూపరింటెండెంట్ అపర్ణ పాలకుర్తికి చేరుకున్నారు. కేసు షీట్ చూపించాలని, దోషులను శిక్షించాలని ఆందోళనకారులు పట్టుపట్టడంతో, క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు, విచారించి దోషులను శిక్షిస్తామని అధికారులు చెప్పడంతో గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు.

Latest News

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News