పతి రోజూ దేవుడికి నైవేద్యం పెడ్తరని తెలుసు. కానీ ఎన్ని రకాల వైవేద్యాలు పెడ్తరు? భక్తుల శక్తి కొద్ది, శేతనైనంతల, ఆచారం, పండుగలను బట్టి ఒకటో, మూడో, ఐదో రకాలు పెడ్తరు. పండ్లు, పాలు, పంచదార, కొబ్బరికాయలను కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. పూరీ జగన్నాథుడికి గుడిల, గా నల్లనయ్యకు కొన్ని పర్వదినాలల్ల 56 రకాల వంటకాలతో కూడిన చప్పన్ భోగ్ సమర్పిత్తరు. కానీ, గీ దేవుడికి ఏకంగా పన్నెండు వందల రకాల నైవేద్యాలు సమర్పిత్తరని తెలుసా?

మన ఉగాదిలెక్క గా గుజరాత్ ల అన్నకూట్ ఉత్సవం శేత్తరు. ఇగ గిదే టైంల గా వడోదరల ఉన్న స్వామి నారాయణ్ గుడిని శాలా మంది భక్తులు దర్శించుకుంటరు. ఏటా దీపాలి తర్వాత వచ్చే పంటలను నైవేద్యంగా పెడ్తరు. ఐటెంకనే గా పంటల్ని ఇంటికి పట్టుకపోతరు. ఇగాడ గీ రోజున 1200 రకాల వంటకాల్ని గా దేవుడికి నైవేద్యంగ పెట్టిండ్రట. ఇగిప్పటిదాక గిన్ని రకాలుగ నైవేద్యం ఎక్కడ పెట్టలేదటుల్లా? ఎన్ని రకాలు పెడ్తే ఏంది? గయేమన్న గా దేవుడు తింటడా? గావాటిని మల్లా భక్తులే గదా తినేది? ఏమంటరు?

