గీ పులి మాములిది కాదుల్లో! మహా మాయలాడి! ఆడ శివంగి అనుకోండ్రి. గీ ఆడ పులి సావాసం, సాహసం సూత్తె ముక్కు మీద యేలేసుకుంటరు. ఔరా! అనుకుంటరు. అవ్ మల్లా!

గీ పులి పేరు రాణి. పశ్చిమ బెంగాల్‌ల పులుల సంతతిని పెంచనీకే అధికారులు అక్టోబర్ల బిహార్ నుండి గీ ఆడపులి ‘రాణి’ని తీసుకొచ్చిండ్రు. గదాన్ని ఓ బోన్ల ఉంచిండ్రు. ఆదివారం మిట్ట మధ్యానం గా పులి గాడ నుండి తప్పించుకున్నది. ఎన్‌క్లోజర్ కంచె కింద నాలుగు అడుగుల లోతున కాంక్రీట్ పునాది ఉన్నప్పటికీ, గదాని కింద నుండి సొరంగం తవ్వుకుని మరీ గా పులి పారిపోయింది. ఇగ గా రాణిని యెతకడానికి 60 మంది సిబ్బంది, ఓ మూడు కుంకీ ఏనుగులు కూడా రంగంలోకి దిగినయి. రాణి తప్పించుకోవడం గిదే మొదటిసారి కాదుల్లా.. గతంల కూడా గీడికి తీసుకొచ్చిన 2 వారాలకే పారిపోయింది. ఇగప్పుడు 13 రోజుల తర్వాత అస్సాంల ఓ నది ఒడ్డున గుర్తించి పట్టుకొచ్చిండ్రు. గీ పులి రాణి.. గా అస్సాం అడవుల్ల ఓ మగ పులి రాజుతోటి జత కట్టి ఉండొచ్చని.. గదాని జత గూడటానికి తప్పించుకుని పోతాందని అనుకుంటాండ్రు.

