పతి ఏటా యినాయకులను పతిష్టించి, పూజించి, కోటొక్క తీర్గ కొలిచి సివరాకరికి నిమజ్జనం చేస్తుంటం. కానీ, గీ యినాయకునికి నిమజ్జనమే లేదు!? ముంబై గిర్గావ్ లో ఓ గణేశ్ మండలి గీ సంప్రదాయాన్ని మొదలు పెట్దింది. గతేడాది లెక్కనే గీ ఏడాది కూడా, 40 అడుగుల భారీ ఫైబర్ గణపతి యిగ్రహాన్ని పెట్టిండ్రు. ఇగా యిగ్రహాన్ని పోయిన లెక్కనే గీ ఏడాది కూడా సెరువులు, కుంటలు, ఆకరికి సముద్రంల కూడా నిమజ్జనం సేస్త లేరు. కానీ, అనంత చతుర్దశి నాడు సముద్రతీరంలో జలాభిషేకం సేసి, గా తర్వాత గా యిగ్రహాన్ని తిరిగి గదే పందిరికి తీసుకువత్తరు.

గీ గిర్గావ్ పహిలీ సుతార్ గల్లీ సార్వజనిక్ గణేశోత్సవ్ మండల్ వరసగా 65వ ఏడాది ఉత్సవాలను జరుపుకుంటాంది. పక్రుతి పరిరచ్చణ, పర్యావరణం కోసం గతేడాది ఫైబర్ యిగ్రహాన్ని పతిష్టించిండ్రు. గదాన్నే గీసారి కూడా పతిష్టించిండ్రన్నట్లు!? మంచిగుంది కదా గీ పద్ధతి.

