Saturday, September 26, 2026
32.3 C
Hyderabad

అడుగుకు అభినందనలు!|ADUGU DIGITAL MEDIA

మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు
ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు

అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు!

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ, మట్టి వినాయకుల పంపిణీ చేయడమే గాక, వివిధ కార్యక్రమాలు చేపడుతున్న అడుగు డిజిటల్ మీడియా బృందాలపై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అడుగు ప్రయత్నాన్ని ఆపకుండా కొనసాగించాలని అడుగు కార్యాలయానికి ఫోన్లు చేసి అభినందిస్తున్నారు.

అలాగే, మట్టి విగ్రహాలను ప్రతిష్టించిన ఉత్సవ కమిటీల అధ్యక్షులను సత్కరించి ప్రోత్సహిస్తూ, డిజిటల్, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించడం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డా మార్గం లక్ష్మీ నారాయణకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఫోన్ ద్వారా, అలాగే ఈడీ మార్గం సాయి సందేశ్ తేజను జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ ప్రత్యేకంగా గురువారం ఫోన్‌లో అభినందించారు. అలాగే ఈ కార్యక్రమాలను ముందుండి నడిపిస్తున్న డా. మార్గంకు కూడా అభినందనలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు దోహదపడే మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ లు వేముల వీరేశం, జాటోతు రామచంద్రనాయక్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీలు తాత మధు, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, యశస్విని రెడ్డి, మందుల సామేలు, మదన్ మోహన్ రావు, పాల్వాయి హరీష్ బాబు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మెన్ శివసేనారెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎంపీలు డా.జీ రంజిత్ రెడ్డి, పి. రాములు, రాపోలు ఆనందభాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్, బాల్క సుమన్, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజు, మెతుకు ఆనంద్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పోతుగంటి భరత్ ప్రసాద్, జిల్లా నాయకులు పల్లా సుందర్ రామ్ రెడ్డి, తొర్రూరు మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి తదితరులు కూడా అభినందించిన వారిలో ఉన్నారు.

Latest News

ఇగ్రహం ఉన్న సోటనే నిమజ్జనం!|ADUGU TRENDS

ప్రతి ఏటా ఇనాయకులను నిలబెడత0.. తొమ్మిది, పది రోజులు ఘనంగా పూజలు సేస్త0. ఇగ గా ఇగ్రహాలను చెరువుల్ల, కుంటల్ల నిమజ్జనం సేస్త0. గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సేసే గా...

సర్ వివాదం.. ఈసీ విశ్వసనీయతకు సవాల్!|EDITORIAL

ఓటు ప్రజాస్వామ్యానికి ఆయుధం.. ఆ ఓటుకు కాపలాదారు ఈసీ! మరి కాపలాదారుడి విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తితే? సర్ వివాదాలు, కమిషనర్ల అభ్యంతరాలు, ప్రతిపక్షాల ఆరోపణల నడుమ.. ఎన్నికల సంఘం పారదర్శకత ఇప్పుడు దేశం...

సెప్టెంబర్ 26, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 09.45 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం11.50 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం గండ పగలు 02.41 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర ఉదయం 09.48 వరకు ఉపరి బవ రాహుకాలం...

ఆరోగ్యకరమైన భవిష్యత్తుల కోసం ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ!|PHARMACIST|HEALTH

(ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం : 25 సెప్టెంబర్ 2026) ప్రపంచంలో ఔషధం అవసరం లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఔషధ ప్రయోక్తలైన ఫార్మసిస్ట్ లు ప్రతి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఔషధాలతో పాటు...

మూడో బిడ్డకు బంపర్ ఆఫర్!?|ADUGU TRENDS

ఎనకటికి ఎంత ఎక్కువ మందిని కంటే గంత ఇలువ. అంత గౌరవం. ఒక్కొకల్లు డజను మందిని కనేది. గంపెడు మందితో ఇల్లు కళకళలాడేది. ఎంత ఎక్కువ మంది ఉంటే, గా ఇంటికి అంత...

శాశ్వత సభ్యత్వంలో భారత్ ముందడుగు!?|EDITORIAL

భారత్‌కు శాశ్వత సభ్యత్వం సాధించాలంటే దౌత్య మద్దతుతోపాటు ఐ రా స చార్టర్‌ సవరణకు అవసరమైన ప్రక్రియలు పూర్తికావాలి. తాజా యూరప్‌ మద్దతు ఆశలను పెంచినా, తుది ఫలితానికి మరింత అంతర్జాతీయ సమ్మతి...

సెప్టెంబర్ 25, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 09.53 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం శతభిషం ఉదయం 11.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శూల పగలు 03.50 వరకు ఉపరి గండ కరణం గరజి ఉదయం 09.43...

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News