బట్టలు సర్ఫు, సబ్బుతోటి ఉతుకుతం. గా బట్టలుతికే మిషినిలైతే లిక్విడ్ పొత్తం. జెరం వత్తే, ఓ పారాసిటమాల్ గోలేత్తం. గీ జెరానికేసే గోలి గా బట్టలకెత్తే!? గా జెరం పోయినట్లే గా మురికి పోతదా? సోచాయించడానికే సొంపుతలేదు కదా? కానీ, గిది దొరింపైన శిట్కానే అని గీ మద్దెల ఓ ఈడియా యిడుదల అయింది. కావాలనంటే మీరే సూడు0డ్రి.

ఒకామే వాషింగ్ మిషనిల మురికి పట్టిన బట్టలేసింది. గండ్ల నే గింత లిక్విడ్ పోసింది. అయిటెంక గా మిషిని ల ఓ పారాసిటమాల్ గోలి యేసింది. ఇగ కాసేపటికి గదాన్ని తెరిసి సూత్తే గా బట్టలు మల్లె పువ్వు లెక్క తెల్లగ అయినయి. గంతే కాదుల్లా..! నీళ్ళ ల్ల గల్లకు గట్టిగ గార లెక్క మురికి పట్టిన అంగిని యేసింది. గది నానినంక గా గల్ల మీద ఓ పండ్ల పేస్ట్ ను, ఓ పారాసిటమాల్ గోలి ని రుద్ది0ది. గా నీళ్ళల్ల నే అటు ఇటు నలిసింది. పైకి లేపి సూస్తే గా అంగి, గల్ల కూడా తెల్లగ మల్లె పువ్వు లెక్క మెరిసింది. ఇగ గీ దీన్ని నెట్టింట్ల లచ్చల మంది సూసిండ్లు. సూసినోళ్ళు సూసినట్లు కామెంట్లు కూడా శేషిండ్లు. గిది నిజమేనని ఒకాయినే అన్నడు. గా జెరం గోలి గిట్ల ఆడొద్దు అని ఇంకొకాయినె అన్నడు. మొత్తానికి గోలీలు శెలీరానికే కాదుళ్ల… గా శెలీరం మీద తీసుకునే బట్టలకు కూడా పనికొత్తానయి అన్నట్లు!

