Friday, June 19, 2026
28.4 C
Hyderabad

మందుబాబులకో శుభవార్త!|ADUGU TRENDS

ఇగిప్పుడు యేడ సూసినా, తాగి పడేసిన బీరు, విస్కీ సీసాలెనాయె.! పార్కుల్ల, బస్సు స్టాపుల్ల, స్టాండ్లల్ల, రైల్వే స్టేషన్లల్ల, రోడ్ల పక్కల, శెట్ల కింద, ఆకరికి ఏర్గ పోయేకాడ, ఉచ్చ పోసే కాడా గూడా గయేనాయె.!! ఏ పార్టీ, ఫంక్షన్ శేసినా మందు, శియ్యలేనాయె. ఇగెవడన్న పంక్షన్ శేసినోడు మందు పెట్టకపోయినా, మనమే నల్గురం కలిసి తాగి పోబడితిమి. ఏహె గిదంత కాదు.. పార్టీ అంటే మందే? మందంటే మందే.!

గీ తాగి పడేసిన సీసాలు ఏర్క పోయేటోల్లకు గూడా వశమైతలేదాయె.! మరి గవాట్ని ఎట్ల తీసెయ్యాల్నని గప్పట్ల తెలంగాణ సర్కారోల్లు గా సీసాలతోటి ఆదాయం గూడ వత్తదంటే పెద్ద లొల్లాయె. ఇగ గిదంత పనికాదని, గా తమిళనాడుల ఓ ఉపాయం కనిపెట్టిండ్రు. గదేందో సూద్దాం పాండ్రి.

ఏటీఎం లెక్కనే గీ మిషిని తయారు శేసిండ్రు. గా మిషిన్ల తాగి పడేసిన సీసా ఎయ్యాలె. ఐటెంక మీ పోనుతోటి యూపీఐని స్కాన్ శెయ్యాలె. గంతే గా మిషిని మీకు పది రూపాయల నోటిత్తది. గదాన్ని ఏఐ వెండింగ్ మిషిని అంటాండ్లు. గిదీన్నిప్పుడు శెన్నైల డెమో పెట్టిండ్రు. ఇగ తొందర్లనే గీ మిషన్లను అంతట పెడ్తరట. గీ మిషిని తోటి సీసాల లొల్లిపోతదేమో గనీ, తాగేటోల్లు ఎక్కువైతరేమో సూడుండ్రి.

Latest News

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్! తప్పెవరిది? శిక్షలెవరికి? మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి? దళారుల ప్రమేయం నిజం కాదా? మార్కెటింగ్ శాఖదే బాధ్యతా? కేంద్రం ఎందుకు స్పందించదు? వరంగల్ జేడీఎం సప్పెన్షన్! 7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు 84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు సీసీఐ పత్తి...

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే...

జూన్ 18, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు చవితి రాత్రి 11.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.32 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యాఘాత రాత్రి 10.54 వరకు ఉపరి హర్షణ కరణం వణజి మధ్యాహ్నం 12.59 వరకు...

గోడలకంటే, గీ ఇకమతు మస్తుగుందే!|ADUGU TRENDS

ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా...! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది....

పంటల సాగుకు శాశ్వత పరిష్కారమేది?!|EDITORIAL

వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్‌పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం...

జూన్ 17, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు తదియ రాత్రి 02.00 వరకు ఉపరి చవితి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.51 వరకు ఉపరి పుష్యమి యోగం వృద్ధి రాత్రి 01.35 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల మధ్యాహ్నం 03.06 వరకు...

48 ఏండ్ల తర్వాత?!|ADUGU TRENDS

ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి. బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు...

విలీనమే పరిష్కారమా?!|EDITORIAL

ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం...

జూన్ 16, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 06.37 వరకు ఉపరి విదియ నక్షత్రం ఆరుద్ర రాత్రి 07.23 వరకు ఉపరి పునర్వసు యోగం గండ ఉదయం 07.29 వరకు ఉపరి వృద్ధి కరణం బవ ఉదయం 06.37...

జూన్ 15, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ అమావాస్య ఉదయం 09.06 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం మృగశిర రాత్రి 09.00 వరకు యోగం శూల ఉదయం 10.30 వరకు ఉపరి గండ కరణం నాగవ ఉదయం 09.06 వరకు ఉపరి...

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News