Wednesday, September 23, 2026
24.7 C
Hyderabad

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని గణాంకాలు విడుదల చేస్తుంటే, రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ఈ విరుద్ధ విచిత్ర పరిస్థితి ప్రభుత్వ ప్రకటనలకూ, భూమి మీద క్షేత్రస్థాయి వాస్తవాలకూ పొంతనలేని భారీ అంతరాన్ని బయటపెడుతోంది.

ప్రస్తుతం వరి కోతలు పూర్తయి, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన రైతులు సమయానికి కొనుగోళ్లు జరగక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు రైతుల కష్టాన్ని పూర్తిగా నీళ్లలో కలిపేశాయి. తెలంగాణలో మంథని, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా వర్షాల దెబ్బకు వేలాది క్వింటాళ్ల ధాన్యం తడిసిపోయింది. మార్కెట్ యార్డుల్లో నిల్వ చేసిన ధాన్యం పూర్తిగా నాణ్యత కోల్పోయింది.

రైతుల ఆవేదనలో నిజం ఉంది. కోతలు పూర్తయ్యాక 10 నుంచి 15 రోజుల పాటు కొనుగోళ్ల కోసం ఎదురుచూడాల్సి వస్తోందని వారు చెబుతున్నారు. అధికారులు తగిన సంఖ్యలో గన్నీ బ్యాగులు, తూకం యంత్రాలు, రవాణా వాహనాలు అందుబాటులో ఉంచకపోవడంతో కొనుగోళ్లు నెమ్మదిస్తున్నాయి. ఫలితంగా ధాన్యం యార్డుల్లో పేరుకుపోతోంది. సమయానికి కొనుగోలు జరిగి ఉంటే అకాల వర్షాల కారణంగా ఈ స్థాయిలో నష్టం వాటిల్లేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుగుతున్నాయని చెబుతోంది. అయితే క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు మాత్రం వేరేలా ఉన్నాయి. కొన్నిచోట్ల రైతులు ధాన్యం కుప్పల వద్దే రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర నిరాశతో రైతులు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఈ సమస్య కేవలం వరి వరకే పరిమితం కాదు. దేశవ్యాప్తంగా పంటల మార్కెట్ వ్యవస్థలో తీవ్రమైన అసమానతలు నెలకొన్నాయి. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. అదే సమయంలో వినియోగదారుడు కూడా తక్కువ ధరలకు సరుకులు పొందడం లేదు. మధ్యలో లాభపడేది మాత్రం దళారులు, నిల్వదారులు, పెద్ద వ్యాపారులు, వ్యాపార సంస్థలే.

గోధుమల పరిస్థితి కూడా ఇందుకు భిన్నమైందేమీ కాదు. కేంద్ర ప్రభుత్వం 2025-26 ఏడాదికి గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాకు రూ.2,585గా నిర్ణయించింది. కానీ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో హోల్‌సేల్ మార్కెట్లలో గోధుమ ధర కిలోకు రూ.23 నుంచి రూ.25 మధ్య మాత్రమే పలుకుతోంది. అంటే రైతులు కనీస మద్దతు దర కంటే తక్కువకే అమ్ముకోవాల్సి వస్తోంది. మరోవైపు రిటైల్ మార్కెట్‌లో గోధుమపిండి ధర మాత్రం కిలోకు రూ.36 నుంచి రూ.40 వరకు ఉంది. బ్రాండెడ్ పిండి అయితే రూ.50 దాటుతోంది. రైతుకు ధర తగ్గినా వినియోగదారుడికి ప్రయోజనం ఎందుకు చేరడం లేదు అన్న ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది.

సాధారణంగా ముడి సరుకు ధర తగ్గితే తుది ఉత్పత్తి ధర కూడా తగ్గాలి. కానీ భారత మార్కెట్ వ్యవస్థలో అది కనిపించడం లేదు. గోధుమల ధర పెరిగినప్పుడు పిండి కంపెనీలు వెంటనే ధరలు పెంచుతాయి. కానీ ధరలు తగ్గినప్పుడు అదే వేగంతో తగ్గించవు. ఈ తేడా మొత్తం లాభాల రూపంలో మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్తోంది. ఇదే పరిస్థితి వరి, మక్క, పప్పుధాన్యాలు సహా అనేక పంటల్లో కనిపిస్తోంది.

పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వ కొనుగోళ్లు బలంగా ఉండటంతో రైతులకు కనసీ మద్దతు ధర సమీప ధరలు లభిస్తున్నాయి. కానీ ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు వ్యవస్థ బలహీనంగా ఉండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది. ఫలితంగా ధరలు కుప్పకూలుతున్నాయి. ఈ అసమానత దేశవ్యాప్తంగా రైతుల ఆదాయంలో భారీ వ్యత్యాసాలకు దారితీస్తోంది.

వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో ధరల పర్యవేక్షణ విభాగం ఉన్నప్పటికీ మార్కెట్‌లో జరుగుతున్న అక్రమ ధరల నియంత్రణలో అది ప్రభావవంతంగా వ్యవహరించడం లేదు. రైతు నుంచి వినియోగదారుడి వరకు సరఫరా వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటే కేవలం మద్దతు ధరలు ప్రకటించడం సరిపోదు. సమయానికి కొనుగోళ్లు, శాస్త్రీయ నిల్వ వ్యవస్థలు, వేగవంతమైన రవాణా, మార్కెట్ సంస్కరణలు, మధ్యవర్తుల నియంత్రణ వంటి చర్యలు సమగ్రంగా అమలు కావాలి. అకాల వర్షాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ముందు జాగ్రత్త చర్యలు, రైతులకు తక్షణ పరిహారం అందించే వ్యవస్థ కూడా బలోపేతం కావాలి.

అన్నదాత దేశానికి వెన్నెముక అని ప్రతి ప్రభుత్వం చెబుతుంది. కానీ రైతు పండించిన పంటను సమయానికి కొనలేని వ్యవస్థ ఉంటే ఆ మాటలకు అర్థం ఉన్నట్లేనా? రైతుకు గిట్టుబాటు ధర, వినియోగదారుడికి అందుబాటు ధర. ఈ రెండింటి మధ్య సమానత, సమన్వయం తీసుకురావడమే నిజమైన వ్యవసాయ విధానం. లేకపోతే ప్రతి పంట సీజన్ రైతుకు ఆశ కంటే ఆందోళననే మిగులుస్తుంది.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News