తెలివుండాలె. ఇగ గదే ఉంటే ఎన్ని ఉపాయాలైనా శేయొచ్చు. గట్లనే గీ తమ్ముడు మంచి పాయమే శేసిండు. ప్లాస్టిక్ టబ్బును వాష్ బేసిన్ శేసిండు. కర్సు తక్కువల గదెట్ల శేసిండో మనమూ సూద్దామానుల్లా?

ఒక టబ్బును తీసుకుండు. గదానికి ఓ రంద్రం శేసిండు. గదాంట్లె ప్లాస్టిక్ బాటిల్ మూతి కుతికెల కాడికి కత్తిరిచ్చి, గా రంద్రంలో తిప్పిండు. ఇగ గా టబ్బు కింద బయటికెల్లిన సీస మూతకు ఒక పైపును బిగించిండు. ఇగ గా టబ్బును గోడకు రెండు శీకులు కొట్టి, గదాంట్లె ఇరికిచ్చిండు. ఇగ పైన నల్లా తిప్పితే గా నీల్లు గా టబ్బుల పడ్తయి. ఇగ శేతులు, మూతులు కడుక్కోవచ్చన్నట్లు. మంచిగున్నది కదా గీ ఉపాయం. మీరూ శేసి సూడుండ్లి. మీ ఇండ్లల్ల.

