కొత్తగ ఇల్లు కడతం. ఏడాది తిరక్కముందే గా ఇంటికి శెదలు పడతది. బూజులొత్తయి. బండల కింద పొక్కలు పడతయి. శీమెలు, ఎల్కలు సొత్తయి. ఇగ ఇల్లంత ఆగమాగం. ఇగ ఆయింత రెండు మూడు రోజులు ఇల్లొదిలి ఎటన్న పోయొత్తిమా? గయన్ని ఇల్లు పీకి పందిరేత్తయి. ఇగ కొత్త ఇల్లే పాడుబడ్డ, పాత కొంపైతది. గిట్ల గాకుండ ఉండాల్నంటే ఓ శిట్కా ఉంది ఇనుండ్రి.

యాంటీ-టర్మైట్ కోరస్ అని ఓ రసాయనం గా ఎరువుల షాపుల్ల దొరుకుతాంది. ఇండ్లు కట్టేటప్పుడే, గా పునాదుల్ల గిదీన్ని సల్లుతరు. గిది శెద పురుగులను సంపడానికి, గవాటిని దరిదాపులకు రాకుండ ఉంచడానికి బాగా పనిశేత్తదట. పునాదులు తవ్వినప్పుడే మట్టిల లేకపోతే ఇల్లు కట్టినంక గూడ గోడల పక్కన భూమిల సల్లుతరన్నట్లు. అయితే గది కాస గట్టి రకం రసాయనం కాబట్టి ఘాటెక్కువ. దీన్ని వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలె.

