Monday, September 21, 2026
27.3 C
Hyderabad

కవిత పార్టీతో బీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?|EDITORIAL

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామానికి వేదిక సిద్ధమవుతోంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ప్రకటించబోతున్నట్లు వస్తున్న సమాచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రకటన కేవలం కొత్త పార్టీ ఆవిర్భావం మాత్రమే కాకుండా, ఇప్పటికే క్షీణ స్థితిలో ఉన్న బీఆర్‌ఎస్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ముఖ్యమైన ప్రశ్నగా నిలిచింది.

కవిత పార్టీ ఏర్పాటు నిర్ణయం రాజకీయంగా చూపే ప్రభావాన్ని అంచనా వేయాలంటే, ప్రస్తుత బీఆర్‌ఎస్ పరిస్థితిని పరిశీలించాలి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 39 స్థానాలకు పరిమితమై అధికారాన్ని కోల్పోయింది. ఇది గతంలో వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. ఓటమికి ప్రధాన కారణాలుగా ప్రజలతో దూరం పెరగడం, ప్రభుత్వంపై పెరిగిన అసంతృప్తి, అలాగే ప్రత్యర్థి పార్టీల సమర్థ వ్యూహాలు కూడా పని చేశాయి. ఆతర్వాత పార్లమెంట్, ఎమ్మెల్సీ, ఉప ఎన్నికల్లో పరాజయాల పరంపర ఆ పార్టీ గ్రాఫ్ పడిపోతున్న వైనానికి నిదర్శనాలు.

ఈ నేపథ్యంలో కవిత కొత్త పార్టీ ప్రకటిస్తే, బీఆర్‌ఎస్‌పై ఏ విధమైన ప్రభావం ఉండనుంది? ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన సంప్రదాయ ఓటు బ్యాంక్‌లో విభజన ఏర్పడడుతుంది. బీఆర్ఎస్ లో అంతగా అవకాశాలు, గుర్తింపు రానీ బీసీలు, దళితులు, ఆదివాసీలు వంటి వర్గాలపై దృష్టి పెట్టడం వల్ల, అదే వర్గాలపై ఆధారపడిన బీఆర్‌ఎస్ ఓట్లలో కనీసం 5% నుండి 10% వరకు చీలిక వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, కొత్త పార్టీకి అవసరమైన స్థాయి వ్యవస్థ, కేడర్, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం అంత సులభం కాదు. కానీ, కవిత వాటన్నింటి సమకూర్పు తర్వాతే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని భావిస్తున్నారు పరిశీలకులు.

ఇక టీఆర్‌ఎస్ పేరును తిరిగి తీసుకురావాలన్న ఆలోచన కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. “తెలంగాణ” అనే పదానికి ఉన్న భావోద్వేగ అనుబంధం బీఆర్ఎస్ పార్టీకి ఒకప్పుడు పెద్ద బలంగా నిలిచింది. అదే కారణంగా టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్‌ఎస్‌గా మారడం వ్యూహాత్మకంగా తప్పిదమైందని ఆపార్టీలోనే మెజార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాత పేరును పునరుద్ధరించడం ద్వారా కనీసం 3% నుండి 5% వరకు సానుభూతి ఓట్లు తిరిగి పొందవచ్చని అంచనా వేయవచ్చు.

అయితే, బీఆర్ఎస్ ఓటమికి కేవలం పేరు మార్పు మాత్రమే కారణం కాదని గుర్తించాలి. అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న నిర్ణయాలు, నాయకత్వ శైలి, అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోవడం వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషించాయి. పార్టీ, ప్రభుత్వ నిర్ణయాలు కొద్ది మందికే పరిమితం కావడం, భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించకపోవడం వల్ల స్థానిక నాయకత్వం బలహీనపడింది. దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.

కవిత పార్టీ ప్రకటించడం ద్వారా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వస్తోంది. అది కుటుంబ రాజకీయాల పరిమితులు. ఒకే కుటుంబానికి చెందిన నేతలు వేర్వేరు రాజకీయ మార్గాల్లో నడిస్తే, అది ఓటర్లలో గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది. అదే సమయంలో, కొత్త పార్టీకి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం కూడా ఒక సవాలే. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఓటర్లు స్పష్టమైన విధానాలు, నమ్మకమైన నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నది మరచిపోవద్దు.

ఇక ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై కూడా ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి కొద్ది కాలమే అయినప్పటికీ, ప్రజలు వేగవంతమైన అభివృద్ధిని ఆశిస్తున్నారు. గత ప్రభుత్వంపై అసంతృప్తి కారణంగా వచ్చిన మార్పు, ఇప్పుడు కొత్త ప్రభుత్వంపై కూడా ఒత్తిడిని పెంచుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా బీఆర్‌ఎస్ తనను తాను పునర్నిర్మించుకోవడం అత్యవసరం. మరి ఆ దిశగా అధినాయకత్వం ఆలోచిస్తుందా? అందరికీ అవకాశాలిస్తుందా? లేక ఇచ్చినట్లు నటిస్తోందా?

కవిత కొత్త పార్టీ ఏర్పాటు రాజకీయ సమీకరణాలను తాత్కాలికంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో అది ఎంతవరకు నిలదొక్కుకుంటుందన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. బీఆర్‌ఎస్‌కు ఇది ఒక హెచ్చరికగా భావించాలి. పార్టీ పునర్వ్యవస్థీకరణ, నాయకత్వ మార్పులు, ప్రజలతో మమేకం వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులే కాదు, శాశ్వత శత్రువులు కూడా ఉండరు. చివరకు ప్రజాభిప్రాయం కూడా శాశ్వతంగా ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగినవారే విజయాన్ని అందుకుంటారు. లేదంటే, ఎంత బలమైన పార్టీ అయినా క్షీణించడానికి ఎక్కువ సమయం పట్టదు!

Latest News

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News