Monday, June 22, 2026
36.5 C
Hyderabad

‘పునర్జన్మ’ ప్రాప్తి…! జీవ ‘కారుణ్య’ విముక్తి!!|ADUGU|SPECIAL STORY

-‘బ్రెయిన్ డెడ్’ కు ‘కామా’, ‘కోమా’కు ‘ఫుల్ స్టాప్’!!!|BRAIN DEAD|COMA

జీవితం విచిత్రం. పుట్టుక వరమైతే, మరణం శాపం. అనివార్యం. ఇందుకు ఈ రెండు ఘటనలే నిదర్శనం. బ్రెయిన్ ‘డెడ్’ అయిన మహిళ, ఒక్క కుదపుతో ‘పునర్జన్మ’ ముక్తిని పొందితే, కోమాలోకి వెళ్ళిన రాణాకు కోర్టు ‘కారుణ్య’ అనుమతినిచ్చి శాశ్వత జీవ విముక్తిని ప్రసాదించింది! మృత్యువు ఒకరికి అకస్మాత్తుగా దూరమై సంతోషాన్ని నింపితే, మరొకరికి శాశ్వతంగా దగ్గరై ప్రశాంతతను చేకూర్చింది. విధి వింత నాటకంలో కాలం రాసిన ఈ రెండు భిన్నమైన ముగింపులు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.

బ్రెయిన్ ‘డెడ్’ – ఒక్క కుదపుతో ‘రీ బర్త్’!

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో ఒక అద్భుతం చోటుచేసుకుంది. జిల్లా కోర్టులో పనిచేసే వినితా శుక్లా అనే మహిళ ఫిబ్రవరి 22న తీవ్ర అస్వస్థతకు గురవడంతో, వైద్యులు ఆమెను ‘బ్రెయిన్ డెడ్’గా భావించి, బతికే అవకాశాలు లేవని తేల్చేశారు. దీంతో నిరాశ చెందిన కుటుంబ సభ్యులు అంత్యక్రియల ఏర్పాట్లు చేసి, ఆమెను అంబులెన్స్ లో ఇంటికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో రోడ్డుపై ఉన్న ఒక పెద్ద గుంట కారణంగా వాహనం భారీ కుదుపునకు గురైంది. దీంతో అపస్మారక స్థితిలో ఉన్న వినిత ఒక్కసారిగా ఊపిరి తీసుకుంది. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను తిరిగి హాస్పిటల్ కి తరలించారు. ఆమె కోలుకుంటోంది. కుటుంబ సభ్యులు దీన్ని ‘దైవలీల’గా భావిస్తుంటే.. వైద్యులు ‘దవాలీలే‘ అంటున్నారట. ఏది ఏమైనా, చావుకు చేరువైన ఆ మహిళ, తిరిగి ఊపిరి తీసుకోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

‘కోమా’లో ఉన్న రాణాకు కోర్టు ‘కారుణ్యం’!

13 ఏళ్లుగా కోమాలో ఉండి, జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీశ్ రాణాకు సుప్రీంకోర్టు కారుణ్య మరణాన్ని ప్రసాదిస్తూ సంచలన తీర్పునిచ్చింది. 2013లో చండీగఢ్ వర్సిటీలో ఇంజనీరింగ్ చదువుతుండగా, నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో హరీశ్ తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. నాటి నుండి అతడు మంచానికే పరిమితమయ్యాడు. ఎన్ని దవాఖానాలు తిరిగినా ఫలితం రాక, కొడుకు నరకాన్ని చూడలేక తల్లిదండ్రులు కారుణ్య మరణం కోసం మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ తీర్పుపై హరీశ్ తండ్రి అశోక్ స్పందిస్తూ.. “ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డ చావును కోరుకోరు, కానీ వాడు పడుతున్న బాధ చూడలేకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది” అని కన్నీటి పర్యంతమయ్యారు. చదువులో టాపర్‌గా ఉన్న కొడుకును పోగొట్టుకోవడం అత్యంత దురదృష్టకరమని, ఈ తీర్పు ఎందరో బాధితులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. తమ విన్నపాన్ని మన్నించిన అత్యున్నత న్యాయస్థానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Latest News

జూన్ 22, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు అష్టమి రాత్రి 07.26 వరకు ఉపరి నవమి నక్షత్రం ఉత్తర మధ్యాహ్నం 02.37 వరకు ఉపరి హస్త యోగం వ్యతీపాత మధ్యాహ్నం 03.02 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం 07.41...

‘తెలంగాణ జన’సేన అయ్యేనా?!|TELANGANA|JANASENA|PSPK

-ఏపీ తరహాలో స్వతంత్రంగా ఎదిగేనా?|AP -బీజేపీకి తోక పార్టీగా మిగిలేనా?|BJP -జన సేనతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|JANASENA తెలంగాణ జనసేన అయ్యేనా?! తెలంగాణ జనం జన సేనను ఆదరించేనా? తెలంగాణలో జనసేన సక్సెస్ అయ్యేనా? సాధారణంగా...

సిమిటి, అస్తర్కార్ లేకుండనే గోడలు?!|ADUGU TRENDS

ఇల్లు కట్టి సూడు, పెండ్లి శేసి సూడన్నరు. గయి రెండంటే గంత కట్టమన్నట్లు.? పెండ్లంటే గిప్పట్ల సిడెంల అయిపోతానయి గనీ, గీ ఇండ్లంటేనే గవాటి టైం గయి తీసుకుంటయి. మట్టి, సిమెంటు, ఇటికె,...

సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం యోగా!|EDITORIAL

ఆధునిక వైద్యశాస్త్రం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ చికిత్స కంటే, నివారణే ఉత్తమమనే సత్యం ఎప్పటికీ మారదు. యోగా అదే నివారణ వైద్యానికి ప్రతీక. మన పురాతన జ్ఞాన సంపదగా ప్రారంభమైన యోగా నేడు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 21 నుండి జూన్ 28 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టిన పనుల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం వల్ల కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు సులభంగా...

జెర పెండ్లి శేసుకోరా…?!|ADUGU TRENDS

పెండ్లిల్లు సర్గంల అయితయి అని ఎందుకన్నరో గనీ, గీ భూమ్మీద మాత్రం లేటైతానయి. బహు కట్టమైతానయి. ఎవర్నడుగు దుర్బిణి యేసి సూసినా, ఆడి పిల్లలు అసలే దొరుకుతలేరంటాండ్రు. మన దగ్గర గిట్లుంటే, మరి...

సమగ్ర పంటల విధానమే రైతుకు రక్ష!|EDITORIAL

వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కొనుగోళ్ల విస్తరణలో లేదు. శాస్త్రీయ పంటల ప్రణాళికలో మాత్రమే ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యంకాదు. కానీ రైతులు మార్కెట్‌కు అవసరమైన...

జూన్ 20, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు షష్ఠి రాత్రి 10.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మఖ మధ్యాహ్నం 02.48 వరకు ఉపరి పుబ్బ యోగం వజ్ర సాయంత్రం 06.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ ఉదయం 09.34...

ఎక్కువ కాలం ఎవలు బత్కుతరు?!|ADUGU TRENDS

పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని...

సంకల్పంతోనే కామన్ స్కూల్ విజయవంతం!|EDITORIAL

విద్యారంగంలో నిజమైన సంస్కరణలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడం, కామన్ స్కూల్ విధానాన్ని దశలవారీగా అమలు చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలపై సమర్థవంతమైన నియంత్రణ విధించడం ఒకేసారి అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్...

జూన్ 19, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి రాత్రి 10.13 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 03.30 వరకు ఉపరి ముఖ యోగం హర్షణ రాత్రి 08.30 వరకు ఉపరి వజ్ర కరణం బవ ఉదయం 11.06...

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్! తప్పెవరిది? శిక్షలెవరికి? మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి? దళారుల ప్రమేయం నిజం కాదా? మార్కెటింగ్ శాఖదే బాధ్యతా? కేంద్రం ఎందుకు స్పందించదు? వరంగల్ జేడీఎం సప్పెన్షన్! 7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు 84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు సీసీఐ పత్తి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News