గెలిశేదానికి, ఓడేదానికి ఏంది తేడా? గింత యికమతు, గింతంత యిగురం. ఇగో యిగురం ఉండాలగని ఏదైనా శేయొచ్చు. గదెంట్లంటరా?

ఓ రైతు బలే యిగురంగ యెవుసం శేస్తాండు. తన శెల్కల మక్కలేసిండు. ఇగ గా శేనుకు నీల్లు యికమతుతోటి కడతాండు. సాలు పొడుగూత పారిస్తే నీల్లు దబదబ పోతయి, ఆగితే గా కట్టలను తెంపుతయి. గట్లగాకుండ, సాల్లను సరిపోసినట్లు శేసిండు. ఇగ నీల్లు వదిలిండు. గా నీల్లు గా కట్టలల్లకెల్లి తిరుక్కుంట తిరుక్కుంట పోతానయి. మంచిగ శేనుకు ఇంకుతానయి. ఇగ శేను పచ్చగ పెరుగుతాంది. గీ యికమతు మంచిగుంది కదా? మీరూ గట్లనే శేసి సూడుండ్లి. మీకు తెలిసిన రైతులకు శెప్పుండ్లి.

