Sunday, November 8, 2026
23.3 C
Hyderabad

భారతీయ జీవన, విద్యావిధానమే జీవనాడి!|EDITORIAL

భారతీయ జీవన, విద్యావిధానం ఒకప్పుడు మనిషి మేధస్సుకు పదును పెట్టి, ప్రపంచాన్ని శాసించే స్థాయికి తీసుకెళ్లేలా ఉండేది. అన్ని రంగాల్లో విద్యార్థులను ఆరితేరేలా చేసే సమగ్ర విద్యా విధానం మనదే! కానీ, కాలక్రమేణా ఆ వ్యవస్థను మనమే కాల గర్భంలో కలిపేస్తున్నాం. బ్రిటిష్ పాలనలో మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానం భారతీయ విద్యా తత్వాన్ని దెబ్బతీసింది. ఫలితంగా నైపుణ్యాలు, విలువలు లేని విద్యార్థులు పెద్ద సంఖ్యలో తయారవుతున్నారు. చదువున్నా ఉపాధి లేదు. డిగ్రీలున్నా దిశా దెశా లేదు. ఇదే నేటి దుర్భర వాస్తవం.

దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో అవకాశాలు విస్తారంగా ఉన్నప్పటికీ బీటెక్, ఎంటెక్ వంటి డిగ్రీలు చదివిన యువత ఆ రంగాల వైపు అడుగులు వేయలేకపోతున్నారు. చదువు వేరు, వృత్తి వేరు అన్న దృక్పథం యువతలో బలంగా పాతుకుపోయింది. భారతీయ మేధస్సు అపారమని ప్రపంచం ఎప్పుడో గుర్తించింది. విదేశాల్లో ముఖ్యంగా ఇంగ్లిష్, గణితం, సైన్స్ రంగాల్లో మనవాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ అలాంటి మానవ వనరులను దేశంలోనే అభివృద్ధి చేసుకునేలా విద్యావిధానం రూపుదిద్దుకోలేదు.

సమాజంలో విలువలు పడిపోవడం, యువతలో నైపుణ్యాల కొరత మన విద్యావిధాన లోపాలే. అత్యాధునిక సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం విద్యార్థుల మేధస్సుపై తీవ్రంగా పడుతోంది. ప్రతి చిన్న విషయానికీ గూగుల్‌ను ఆశ్రయించడం అలవాటైంది. గంటల తరబడి ఫోన్లకు అతుక్కుపోయి చదువుకూ, ఆలోచనకూ దూరమవుతున్నారు. యువతలో పోర్న్ వ్యసనం, ఆన్‌లైన్ జూదాలు, మానసిక ఒత్తిడి పెరిగి చివరికి ఆత్మహత్యల వరకూ వెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది వ్యక్తిగత సమస్య కాదు. ఇది ఒక సామాజిక రుగ్మతగా మారింది.

ఈ పరిస్థితిని మార్చాలంటే అక్షరాభ్యాసం నుంచే క్రమశిక్షణను అలవర్చాలి. విద్యారంగాన్ని బలోపేతం చేసి విలువలతో కూడిన విద్యను అందించాలి. లేకపోతే సమాజం మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంది. నేటి తల్లిదండ్రులు చిన్న పిల్లలను బుజ్జగించడానికి, అన్నం పెట్టడానికి కూడా సెల్‌ఫోన్‌ను చేతికిస్తున్నారు. ఫలితంగా పిల్లల్లో మానసిక పరిపక్వత తగ్గి, తరగతి గదుల్లో పరధ్యానంగా మారుతున్నారు. ఆటస్థలాల్లో చురుకుదనం తగ్గి, ఒంటరితనం పెరుగుతోంది.

పాఠశాలల్లో కూడా బోధన యాంత్రికంగా మారింది. స్క్రీన్ల ద్వారా పాఠాలు చెప్పడం పెరిగిపోయింది. పిల్లలు టీచర్లతో సంభాషించడం మానేసి, పరస్పర అవగాహన కోల్పోతున్నారు. పుస్తక పఠనం తగ్గింది. పరిసరాలపై అవగాహన లేకుండా, చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా చదువులు పూర్తిచేసి పట్టాలు పుచ్చుకుంటున్నారు. మనం తినే అన్నం ఎక్కడి నుంచి వస్తుందో, పాలు ఎలా వస్తాయో కూడా తెలియని తరం తయారవుతోంది.

సెల్‌ఫోన్ వ్యసనానికి తోడు జంక్ ఫుడ్ వల్ల ఊబకాయం పెరుగుతోంది. టీనేజర్లలో ఆత్మహత్యా ప్రయత్నాలు పెరిగాయి. అధ్యయనాల ప్రకారం ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. బ్లూ లైట్ ప్రభావం, నిద్రలేమి, ఆటలు ఆడకపోవడం మనమే తెచ్చుకున్న సమస్యలు. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ విద్య పిల్లలను మరింతగా ఫోన్లకు బానిసల్ని చేసింది. ఇప్పుడు కోవిడ్ లేకపోయినా ఆ అలవాటు మాత్రం కొనసాగుతోంది.

టెక్నాలజీ అవసరం కాదనలేం. కానీ, దానికీ ఓ పరిమితి ఉండాలి. అదే జీవితం కాకూడదు. చిన్నప్పటి నుంచే పిల్లలను టెక్నాలజీకి అతుక్కుపోయేలా చేయడం వారిని బడి, కుటుంబం, చివరకు స్వతంత్ర ఆలోచనల నుంచే దూరం చేస్తోంది. పిల్లల్లో మానసిక పరివర్తన, పరిపక్వత రావాలంటే సమతుల ఆహారం, వ్యాయామం, నడక, ఆటలు తప్పనిసరి. మన ప్రాచీన జీవన విధానాల్లో ఉన్న సౌలభ్యం, సమతుల్యతను మళ్లీ మనం పాటించాలి.

ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలకు అతీతంగా విద్యను చూడాలి. పాఠశాలల్లో పెరుగుతున్న వ్యాపార ధోరణిని అడ్డుకోవాలి. కానీ అంతకన్నా ముందు తల్లిదండ్రులే మారాలి. ఈ బిజీ జీవితంలో పిల్లల కోసం సమయం కేటాయించాలి. మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి. లేదంటే మన పిల్లల భవిష్యత్తే కాదు, మన సమాజపు పునాది కూడా కూలిపోయే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులూ… తస్మాత్ జాగ్రత్త! ఇప్పటికైనా జాగ్రత్త పడకపోతే, రేపు పశ్చాత్తాపంతో కూడా పని ఉండదు.

Latest News

మధ్యయుగంలో దక్షిణ భారతదేశం|ADUGU DIGITAL MEDIA|EDUCATION|COMPITITIVE EXAMS|SPECIAL

తొలి మధ్యయుగ కాలంలో ఉత్తర భారత దేశాన్ని రాజపుత్ర రాజ్యాలు (ప్రతిహరులు, పరమారులు, సోలంకులు, చందేలులు, చౌహాన్లు, గహద్వాలులు) పాలించారు. క్రీ.శ 8 వ శతాబ్దం తర్వాత మూడు గొప్ప రాజ్యాలు దక్షిణ భారతదేశ...

శతవసంతంలోకి స్ఫూర్తి ప్రదాత ఆడ్వాణీ|LK ADVANI|NARENDRA MODI

లాల్‌కృష్ణ ఆడ్వాణీ... భారత రాజకీయాల్లో ఆయనది తిరుగులేని ముద్ర. చెరగని చరిత్ర. ఈ నవంబరు 8న, దీపావళి పండుగతో ఆయన వందేండ్లు పూర్తి చేసుకుంటున్నారు. సంపూర్ణాయుష్షును, ఆరోగ్యాన్ని పొందిన ఆయనపై భారత ప్రధాని...

మిఠాయిల కొవ్వొత్తులు!?|ADUGU TRENDS

మిఠాయిలంటే నోరూరంది ఎవ్వలికి సెప్పండ్రి? శెక్కెర రోగమున్నోల్లైనా శెవి కోసుకుంటరు. గా మిఠాయిలు తినాల్ననే మనిసి బలహీనతని గామె ఓ ట్రెండ్ గ మార్సింది. ఏం శేసిందో సూడుండ్రి. గీమె పేరు కృతిక వీరకణ్ణన్....

ఇరాన్‌పై మళ్ళీ యుద్ధం!|EDITORIAL

యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ.. అమెరికా హెచ్చరికలతో ఇరాన్‌లో కలవరం మొదలైంది. అణు కేంద్రాల వద్ద అయోడిన్ మాత్రల పంపిణీ యుద్ధ భయాలకు అద్దం పడుతోంది. ప్రపంచ శాంతికి దౌత్యమే ఏకైక మార్గం. మార్గం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 08 నుండి నవంబర్ 14 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకున్న పనులను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు రావచ్చు....

గ్రాడ్యుయేట్స్ కి ప్రజాస్వామ్య చైతన్యమేది?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కేవలం ఒక గుర్తుపై ముద్ర వేసే సాధనం మాత్రమే కాదు, అది పౌరుల భవిష్యత్తును, ప్రభుత్వ విధానాలను నిర్దేశించే అత్యంత శక్తివంతమైన ఆయుధం. సమాజంలో అందరికంటే ఉన్నతంగా...

దేవుడా! గా బాధ లేకుండ సూడు!?|ADUGU TRENDS

ఎవలైనా దేవుడ్ని ఏం కోరుకుంటరు? గా కట్టాలు ఎడబాపమంటరు. కాదంటే కాసిన్ని సిరి సంపదిలయ్యమని అడుక్కుంటరు. ఇంకొందరైతే ఆరోగ్యం, సుఖసంతోషాలు, పశాంతమై జీవితం కావాలని కోరుకుంటరు. కనీ, గీ భక్తుడు ఏం కోరుకున్నడో...

భాగ్యనగరానికి సరికొత్త మణిహారం!|EDITORIAL

దశాబ్దాల చరిత్రకు ఆధునిక హంగులు తోడవుతున్నాయి! విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. రూ.715 కోట్లతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. భాగ్యనగరి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరనుంది! మార్గం - అడుగు, ఎడిటోరియల్ హైదరాబాద్...

నవంబర్ 07, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 10.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం చిత్త ఉదయం 05.56 వరకు ఉపరి స్వాతి యోగం ప్రీతి రాత్రి తెల్ల 04.28 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం...

మనువుల బడి!?|ADUGU TRENDS

గీ రోజుల్ల కొందరు పెండ్లంటనే భయపడతాండ్రు. ఇగ గా మనువాడినోల్లు బాధలు పడతాండ్రు. గిట్ల పెండ్తైతాందో లేదో గట్ల యిడుపుకాయితాలైతానయి. కలిసి బతికే శానామంది ఆలుమొగల్లల్ల ఓ ముద్దూ లేదు ఓ ముచ్చటా...

ప్రశ్నించడమే నేరమా?|EDITORIAL

అధికారాన్ని ప్రశ్నిస్తే ఆంక్షలు.. అవినీతిని ఎండగడితే కేసుల భయం.. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తే చట్టాల సంకెళ్లు! ఇదేనా ప్రజాస్వామ్యం? పాలకులను నిలదీయాల్సిన మీడియా గొంతుకలకే అడ్డుకట్ట వేస్తే ప్రజల పక్షాన నిలిచేదెవరు? మార్గం...

నవంబర్ 06, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 10.44 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం హస్త రాత్రి తెల్ల 05.23 వరకు ఉపరి చిత్త యోగం వైధృతి ఉదయం 07.18 వరకు ఉపరి విష్కంబ కరణం తైతుల ఉదయం 10.44...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News