Tuesday, August 4, 2026
27.7 C
Hyderabad

తుఫాన్ దెబ్బమీద మరో తుఫాన్!|EDITORIAL

మొంథా బీభత్సాన్ని మరకవ ముందే మరో తుఫాన్‌ దిత్వాహ్ దూసుకువస్తోంది. పెను బీభత్సం పొంచివుంది. అది ఎంతటి నష్టాన్ని కలిగిస్తోందో? ఎన్ని ప్రాణాలను బలితీసుకుంటుందో? ప్రజలు ఎన్ని కష్టనష్టాలకు ఓర్వాల్సి వస్తుందో? ఏయే ప్రాంతాలకు ముప్పు పొంచి ఉందో? తుఫాన్ అంటే చాలు ప్రజలు, ప్రభుత్వాలు, ప్రత్యేకించి రైతులు వణికిపోతున్నారు. ముందు జాగ్రత్త, నష్ట నివారణే తప్ప తుఫాన్లను ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ లేదు. చివరకు ప్రభుత్వాలకు కూడా. ప్రకృతి ప్రకోపిస్తే గడ్డి పోచలా తల వంచడమే తప్ప, చేయగలిగిందేమీ లేదు. ఇది మన, మన ప్రజల, రైతుల అనుభవ సారం.
అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టిలు, తుఫాన్లు రైతుల పాలిట శాపంగా మారాయి. సమయానుకూల వర్షాలే లేకుండా పోయాయి. ఆలస్యంగా లేదా ముందుగానే వర్షాలు పడుతున్నాయి. మన దేశంలో పంటలన్నీ దాదాపు వర్షాధారమే. దీంతో సాగు సమస్యగా మారి, రైతుల సావుకు వస్తున్నది. నష్ట నివారణ సాధ్యం కాదు. కానీ, నష్ట పరిహారం కూడా అందక రైతులు దిగాలుగా దివాళా తీస్తున్నారు. పంటలకు నేటికీ బీమా లేకపోవడం కూడా రైతులకు శాపంగా మారింది. దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు అన్నమో రామచంద్రా అంటూ ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

తీరప్రాంతాలు ప్రకృతి విపత్తులకు శాశ్వత కేంద్రాలుగా మారాయి. రైతులు, వ్యవసాయ కార్మికులు, మత్స్యకారులతో పాటు వివిధ వృత్తులపై ఆధారపడే లక్షలాది మంది ప్రతి ఏటా ఏదో రకంగా నష్టపోతూనే ఉన్నారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా సహజ విపత్తుల కడలిలో ఆయా ప్రజలు మనుగడ సాగించక తప్పని స్థితి దాపురించింది. ఈ ఏడాది ఇంతకుమందు విరుచుకుపడిన మొంథా తుఫాన్ తీరని నష్టాన్నే మిగిల్చింది. పెరిగిన సాంకేతికత ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించినప్పటికీ, పంట నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. పైగా వాతావరణ మార్పుల కారణంగా విపత్తుల తీరు కూడా మారింది. ఊహించని చోట, ఊహించని విధంగా క్లౌడ్ బరస్ట్ జరిగి, గంటల తరబడి కుండపోతగా వర్షం కురవడం, వాగులు, వంకలు పొంగి అనూహ్య వరదలు చోటు చేసుకోవడం, విపరీతమైన వేగంతో గాలి వీచడం వంటి వైపరీత్యాలు సాధారణంగా మారుతున్నాయి. దీంతో నష్టం భారీగా పెరుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.

నిజానికి మొంథా తుపాన్‌ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే ఏపీలోని 443 మండలాల్లో 3,109 గ్రామాలు తుఫాన్ బారినపడ్డాయి. 10 లక్షల మంది ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. 1.11 లక్షల మంది నిరాశ్రయులైనారు. 1.61 లక్షల హెక్టార్లలో పంటలు నీట మునిగి, 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టమూ ఉంది. మొంథా తుఫాన్ కారణంగా రూ.6,384 కోట్ల రూపాయల నష్టం సంభవించినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, ప్రభుత్వ లెక్కల మీద కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అది వేరే విషయం.
కేంద్ర సాయం ఇంకా రాష్ట్రానికి అందని ఈ సమయంలో మరో తుఫాన్ హెచ్చరిక మూలిగే నక్కపైన తాటి పండు పడ్డట్లుగానే ఉన్నది. ఈ నేపథ్యంలో విపత్తు అంచనాలు వేసి కేంద్ర ప్రభుత్వం వేగంగా, ఉదారంగా స్పందించాలి. హుద్‌హుద్‌ తుఫాన్‌ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రజలు ఇంకా మరచిపోలేదు. అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి.

అదే సమయంలో రాష్ట్రం పూర్తిగా కేంద్రంపై మాత్రమే ఆధారపడ కూడదు. నష్ట పరిహారానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే, రాష్ట్ర పరంగా అన్నింటికీ సంసిద్ధం కావాలి. విపత్తుల నివారణ, తక్షణ సహాయానికి ప్రత్యేక నిధిని సిద్ధంగా ఉంచాలి. ఆ నిధిని పరిహారంగా బాధిత ప్రజలకు అందేలా చూడాలి. పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతూనే, ప్రజల్లో చైతన్యం కలిగించి, విపత్తుల నివారణకు పూనుకోవాలి. వైపరీత్యాలపై కూడా ప్రజలకు ప్రభుత్వం ఉందన్న భరోసానివ్వాలి.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News