Wednesday, September 23, 2026
28.5 C
Hyderabad

ప్రస్తుత పరిరక్షణే భవితకు భద్రత|ARTICLE|ESSAY

ప్రపంచ యాంటీమైక్రోబియల్ అవగాహన సప్తాహం: 18-24 నవంబర్ 2025

సూక్ష్మజీవ నాశకాలకు బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంద్రాలు మరియు పరాన్నజీవులు స్పందించక పోతే యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏ ఎం ఆర్) ఏర్పడుతది. ఔషధ నిరోధకత ఫలితంగా, యాంటీబయోటిక్స్ మరియు ఇతర సూక్ష్మజీవ నాశకాలు ప్రభావ రహితమై అంటులు (ఇన్ఫెక్షన్స్) మొండి పారి, బాగు చేయటం అసాధ్యమై, వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరిగి, జబ్బు ప్రమాదకరంగా మారి, మరణం కూడా సంభవించ వచ్చు.

ఏ ఎం ఆర్ ఇప్పటికే జటిల సమస్యగా మారింది. ఏ ఎం ఆర్ వల్ల ఔషధ నిరోధక అంటులు (ఇన్ఫెక్షన్స్) పెరిగి, మన ఆరోగ్య, ఆహార, పర్యావరణ, ఆర్థిక వ్యవస్థలకు చాలా హాని కలుగుతున్నది. మానవ వైద్యం, పశు వైద్యం, వ్యవసాయం, మాంస ఉత్పత్తిలో సూక్ష్మజీవ నాశకాల వినియోగం విచక్షణా రహితంగా జరుగుతున్నది. సూక్ష్మజీవి నాశకాల, అంటు వ్యర్థాల అశాస్త్రీయ, బాధ్యతా రహిత విసర్జన కూడా ఒక విష వలయంగా మారింది.

ఔషధ నిరోధక సూక్ష్మజీవుల పుట్టుక, వ్యాప్తి గురించి ప్రపంచవ్యాప్తంగా అర్థం చేయించటానికి, ఏ ఎం ఆర్ ను అవగతం చేసెటానికి ప్రపంచ యాంటీ మైక్రోబియల్ అవగాహన సప్తాహం (డబ్ల్యూ ఏ ఏ డబ్ల్యూ) ను ఏటా నవంబర్ 18 నుంచి 24 ను నిర్వహిస్తున్నరు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ ఎచ్ ఓ) ఈ సంవత్సరానికి “యాక్ట్ నౌ: ప్రొటెక్ట్ అవర్ ప్రసెంట్, సెక్యూర్ అవర్ ఫ్యూచర్” అనే నినాదాన్ని ఎంపిక చేసింది. డబ్ల్యూ ఎచ్ ఓ అధికారిక కార్యక్రమమైన దీనికి ఆహార మరియు వ్యవసాయ సంస్థ (ఎఫ్ ఏ ఓ), ఐక్యరాజ్య పర్యావరణ యోజన (యూ ఎన్ ఈ పి), ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ ఏ ఎచ్ ఓ) కలుపుకొని పని చేస్తున్నయి.

దీని తీవ్రతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2024 సాధారణ సభలో ఏ ఎం ఆర్ మీద ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సమావేశం ఏ ఎం ఆర్ ను ఎదుర్కోవటానికి చేపట్ట వలసిన చర్యలను సూచిస్తూ, ప్రభుత్వాలు, పౌర సమాజం, ఆరోగ్య నిపుణులు, పశువైద్యులు, వ్యవసాయదారులు, పర్యావరణ కార్యకర్తలు మరియు ప్రజలు అందరికీ ఏ ఎం ఆర్ పరిష్కార దిశగా అంకితభావంతో అడుగులు వేయాలని విజ్ఞప్తి చేసింది.

ఏ ఎం ఆర్ పరిష్కారానికి ప్రభుత్వాలు, అధికారులు, వైద్యుల నుంచి వ్యవసాయదారుల దాకా బాధ్యతాయుతంగా వ్యవహరించాలె. ప్రజలు యాంటీబయాటిక్స్ వినియోగంపై ఫార్మసిస్ట్ లు, పెస్టిసైడ్స్ వినియోగంపై వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలె. ఏ ఎం ఆర్ ను అవగాహన చేసుకొని, దాని పట్ల ప్రస్తుతం వివేకవంతంగా పనిచేస్తేనే మన భవిష్యత్తు భద్రంగా ఉంటుంది.

-డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్: 9440163211

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News