Monday, September 21, 2026
31.2 C
Hyderabad

జూబ్లీ హిల్స్ ఎక్కేదెవరు?|JUBILEE HILLS|MLA|BY ELECTIONS

నిజమైతే నేనే పోతా?
మరి మీరు రెడీయా?
కేటీఆర్, హరీశ్ రావులకు నవీన్ యాదవ్ సవాల్
రసవత్తరంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోరు
డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు
గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పావులు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ , బీఆర్‌ఎస్‌ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు పేలుతున్నాయి. జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ పై బీఆర్‌ఎస్‌ నేతలు సంచలన ఆరోపణలు చేశారు. నవీన్ రౌడీ అని, ఆయనపై అనేక కేసులున్నాయని విమర్శించారు. దీనికి ప్రతిగా నవీన్‌ యాదవ్‌ బీఆర్‌ఎస్‌ నాయకులకి గట్టి సవాల్‌ విసిరారు. తన మీద పెట్టిన కేసులు నిజమైతే తాను రాజకీయాలని వదిలి పెడతా, హైదరాబాద్‌ విడిచి వెళ్లిపోతానని ఛాలెంజ్‌ చేశారు. కానీ ఆ కేసులు తప్పని తేలితే మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావులు రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధమా? అంటూ సవాల్‌ విసిరారు.

కేసీఆర్‌ ప్రభుత్వం తనపై, తన కుటుంబ సభ్యులపై, అనుచరులపై ఒకే ఏడాదిలో 20 నుంచి 30 తప్పుడు కేసులు పెట్టిందని ధ్వజమెత్తారు. తన మీద రౌడీ అని ప్రచారం చేయడంపై బీఆర్‌ఎస్‌ నేతల కుట్ర ఉందని విమర్శించారు. తనకు న్యాయ వ్యవస్థ నమ్మకం కలిగించిందని.. తనను కాపాడిందని ఉద్ఘాటించారు. అలాగే, కాంగ్రెస్‌ ప్రచార రథాన్ని తగులబెట్టే ప్రయత్నం చేసిన బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కూడా కేసు నమోదైందని తెలిపారు. పోలీసులు ఈ విషయంపై చర్య తీసుకుంటారని చెప్పుకొచ్చారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌పైన విశ్వాసం ఉంచారని నవీన్‌ యాదవ్‌ నొక్కిచెప్పారు. జూబ్లీహిల్స్‌ అభివృద్ధి కాంగ్రెస్‌ గెలుపుతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

వ్యూహాత్మకంగా కాంగ్రెస్
మరోవైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. డివిజన్‌ వారీగా మంత్రులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నికలో ప్రతి ఓటు కీలకమని భావించిన సీఎం, బలమైన మంత్రులను రంగంలోకి దింపారు.

రహమత్‌నగర్‌ డివిజన్‌కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను నియమించారు. బోరబండ డివిజన్‌ బాధ్యతలు సీతక్క, మల్లు రవికి అప్పగించారు. వెంగళ్‌ రావునగర్‌ డివిజన్‌లో తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి సమన్వయం చేస్తారు. సోమాజిగూడ డివిజన్‌ పర్యవేక్షణ బాధ్యతలు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌ వహించనున్నారు. షేక్‌పేట డివిజన్‌ బాధ్యతలు కొండా సురేఖ, వివేక్‌ తీసుకుంటారు. ఎర్రగడ్డ డివిజన్‌ను దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు చూసుకుంటారు. అలాగే యూసుఫ్‌గూడ డివిజన్‌ పర్యవేక్షణ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నంలకు అప్పగించారు.

ఉప ఎన్నికలో సమన్వయం, ప్రచార వ్యూహం, స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను ప్రతి మంత్రి స్థాయిలో పర్యవేక్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో గెలుపు కాంగ్రెస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Latest News

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News