Tuesday, September 22, 2026
24.7 C
Hyderabad

అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!|EDITORIAL

ఒకప్పుడు రాజకీయమంటే సేవ. సిద్ధాంతాలు. ఇప్పుడు రాద్ధాంతాలు. రాక్షసంగా జనానికి కీడు చేయడమే రాజకీయంగా మారిపోయింది. అధికారాన్ని, పదవులను పొందడమంటే, ఎలాగైనా వాటిని గుంజుకోవడంగా మారింది. అందుకు ఎంతకైనా తెగించడం, ఎంతటి నీచానికైనా ఒడిగట్టడంగా మారింది. రీతి, నీతి, జాతి, నిజాయితీ లేకుండా పోయింది.

ఇప్పుడు రాజకీయ నేతలు అధికారం, పదవులుంటేనే పెదవులు విప్పుతున్నారు. లేకపోతే గోతులు తవ్వుతున్నారు. అధికారం రాకపోతే, అది ప్రజల తప్పు. వస్తే మన గెలుపుగా బాహాటంగా జబ్బలు చరుచుకుంటున్నారు. పార్టీలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలకతీతంగా ఈ దుస్థితి పరివ్యాప్తమై, విపరీతమై, విశృంఖలమై వికృత వికటాట్టహాసం చేస్తోంది.
పార్టీ ఏదైనా వాటి చరిత్రంతా ఒక్కటే! అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!! ‘డా.మార్గం-అడుగు’ ఎడిటోరియల్

రాజకీయాలంటేనే అధికారం, పదవులు పొందటం. ఒకప్పుడు వాటిని పొందడానికి కొన్ని విలువలుండేవి. నైతిక పద్ధతులను పాటించేవారు. మాట మీద నిలబడేవారు. ఆడిన మాట తప్పేవారు కాదు. నమ్మకంగా ఉండేవారు. ప్రజలే కేంద్రంగా ఆలోచించేవారు. అభివృద్ధే పరమావధిగా పని చేసేవారు. అనైతిక పనులకు, బంధుప్రీతి, అవినీతికి దూరంగా మసలేవారు. తాము నిర్వహించే శాఖల్లో అవినీతి జరిగితే, తాము నైతిక బాధ్యత వహిస్తూ ఆ పదవులను త్యజించేవారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గాంధీజీ ఏ పదవీని వద్దన్నారు. వద్దన్నా ఇచ్చిన పదవికి రాజీనామా చేసిన ఘనత మన రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ ది. ఎక్కడో రైలు పట్టాలు తప్పితే, ఆ తప్పిదాన్ని తనదిగా చెప్పి, రాజీనామా చేసిన నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం మన లాల్ బహదూర్ ది. కేవలం ప్రత్యేక తెలంగాణ సిద్ధాంతానికి కట్టుబడి, ఉన్న మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణ వచ్చే వరకు ఏ పదవినీ స్వీకరించనని చేసిన శపథాన్ని చివరికంటా నిలబెట్టుకున్న నిట్టనిలువు నిజాయితీ మన కొండా లక్ష్మణ్ బాపూజీది.

కాలం మారింది. అంతా రివర్స్ అయింది. భూతద్దం పెట్టి వెతికినా, ఇప్పుడు గాంధీలు, అంబేద్కర్ లు, లాల్ బహదూర్ లు, లక్ష్మణ్ బాపూజీలు కనిపించడం లేదు. వారి ఆనవాళ్ళను కూడా లేకుండా చేసి, అమాంతం మింగే గుంట నక్కలు రాజకీయాల్లోకి ప్రవేశించాయి. ఒకప్పుడు రాజకీయమంటే సేవ. సిద్ధాంతాలు. ఇప్పుడు రాద్ధాంతాలు. రాక్షసంగా జనానికి కీడు చేయడమే రాజకీయంగా మారిపోయింది. అధికారాన్ని, పదవులను పొందడమంటే, ఎలాగైనా వాటిని గుంజుకోవడంగా మారింది. అందుకు ఎంతకైనా తెగించడం, ఎంతటి నీచానికైనా ఒడిగట్టడంగా మారింది. రీతి, నీతి, జాతి, నిజాయితీ లేకుండా పోయింది.

ఇప్పుడు రాజకీయ నేతలు అధికారం, పదవులుంటేనే పెదవులు విప్పుతున్నారు. లేకపోతే గోతులు తవ్వుతున్నారు. అధికారం రాకపోతే, అది ప్రజల తప్పు. వస్తే మన గెలుపుగా బాహాటంగా జబ్బలు చరుచుకుంటున్నారు. పార్టీలు, ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాలకతీతంగా ఈ దుస్థితి పరివ్యాప్తమై, విపరీతమై, విశృంఖలమై వికృత వికటాట్టహాసం చేస్తున్నాయి.

ఏపీలో మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌, తనకు విపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రానుపో అంటున్నారు. చివరకు హైకోర్టు కడప తొక్కారు. ఐదేళ్లు సీఎంగా పనిచేసిన ఆయనకు నిబంధనలు తెలియకపోవడం సిగ్గుచేటు. ఇదేం దేబురింపు? ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తేనే కాదా ప్రమోషన్ దొరికేది? పైగా గురువింద గింజ తన నలుపెరనట్లు, ఎదుటి పార్టీని ఎలా దిబ్బతీయాలా అన్నదే ఇప్పుడు అన్ని పార్టీల ప్రథమ కర్తవ్యంగా మారింది. అధికారంలో ఉంటే అక్రమాలకు పాల్పడడం, ఆస్తులు కూడబెట్టుకోవడం, ఓడితే ఎదుటి పార్టీని విమర్శించడం అలవాటు చేసుకున్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. మొగున్ని కొట్టి మొగసాలకెక్కినట్లు, పార్టీల వ్యవహారాలుంటున్నాయి. అధికారం ఉన్నంత కాలం దోచుకోవడం, దాచుకోవడం, దివాలా తీయించడం చివరకు దొంగే, దొంగా దొంగా అని అరచినట్లుగా నానా యాగీ చేసేయడం, అబద్ధాలను పదే పదే చెప్పి, నిజాలుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తూ, ఎదుటి పార్టీలపై, ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నాయి. దీనికి పార్టీలు, నేతలు, ఎవరూ మినహాయింపు కాదు.

ఇందులో భాగమే పార్టీ పిరాయింపులు, అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి మించి, చేస్తున్న ఫిరాయింపులు అన్ని పార్టీలను ముంచే స్థాయికి చేరాయి. ఎంతటి నేతలైనా అధికార పార్టీల్లో చేరడానికి ఎంత మాత్రం సిగ్గుపడటం లేదు. రాజకీయ, సిద్ధాంత నిబద్దతలేవీ లేవు. అభివృద్ధి కోసమే అంటే చాలు అన్నీ మాఫీ అనుకుంటున్నారు. నేతలకు పార్టీలు, ప్రజలపై విశ్వాసం కన్నా, పదవులపైనే వ్యామోహం ఎక్కువగా ఉందనడానికి తాజా రాజకీయాలే ఉదాహరణ.

గతంలో కాంగ్రెస్ సృష్టించిన ‘ఆగస్టు సంక్షోభాల’కు లెక్కలేదు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం పేరుతో కాంగ్రెస్ కంటికి నిద్రలేకుండా చేసి, ఏకంగా టీడీపీని విలీనం చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ ది. ఇక ఇప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ మారిన తన 10 ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి కాకుండా, బర్తరఫ్ కోసం పట్టపడుతున్నది. ఏదైనా తనదాకా వస్తే కానీ.. అన్నట్లుగా బీఆర్ఎస్ పరిస్థితి ఉంది. బీజేపీ కూల్చిన విపక్ష రాష్ట్రాల ప్రభుత్వాల లెక్క ఆ పార్టీ కూడా చెప్పలేదు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ… పార్టీ ఏదైనా వాటి చరిత్రంతా ఒక్కటే! అన్ని పార్టీలు ఆ తాను ముక్కలే!!

Latest News

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News