Friday, June 19, 2026
34.3 C
Hyderabad

ప్యూ(పూ)ర్ ‘‘శ్రీమంతుడు!’’

అతడే ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి
వరికోల్ నుంచి మోకిళ్ళ వరకు
పత్రికా ప్రటనలు మోయడం నుంచి…
‘మెగా’తో కలిసి రూ.750 కోట్ల విల్లాల దాకా!
ఎమ్మెల్సీ, కాంట్రాక్టర్.. అన్నీ ఆయనకేనా?
‘పల్లా’ చెప్పాడంటూ బయట పెట్టిన కవిత!
రాష్ట్రంలో అధిక ధనవంతుల జాబితాలో చోటు?

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
పల్లెమీద కోపంతో పట్టణానికి వలసొచ్చి ఆగర్భ శ్రీమంతుడిగా ఎదిగిన తండ్రి. పల్లెలో తన మూలాలు వెతుక్కునేందుకు పట్టణం వదిలిపెట్టిన కొడుకు. ఈ రెండు జీవితాల మధ్య సామాజిక సేవ. లింకు ఊరు దత్తత. సినిమా బాగా హిట్టైంది. ఇప్పుడు ఇక్కడ ప్రస్థావిస్తున్నది తండ్రి తరహా. కొడుకు సేవ, దత్తత కలగలిసిన క్యారెక్టర్ గురించి. ఇదేమీ ఎవరో రాసిన కథ కాదు. తనకు తాను రాసుకున్న కథ. ఇక ఈ కథను చెప్పిందెవరో కాదు సాక్షాత్తు కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవిత. ఆమెకు ఈ కథ చెప్పింది జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నది కూడా కవిత చెప్పిందే. ఇక అసలు కథలోకి వెళితే…
నిన్నటి వరకు అతడు పూర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి.. నేడు అతన్ని హైదరాబాదులోనే కాదు అంతటా, అందరూ ‘శ్రీమంతుడు’ అని పిలుస్తారు. భారత రాష్ట్ర సమితిలో అతడు అధిక ధనవంతుల్లో ఒకరు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, నడికుడ మండలం, వరికోల్ గ్రామంలో 1975, ఏప్రిల్ 17న మధ్య తరగతి కుటుంబమైన పోచంపల్లి జనార్దన్ రెడ్డి, సమ్మక్క దంపతులకు జన్మించాడు. ఆయన ఎంబీఏ పూర్తి చేశాడు. బీఆర్ఎస్ యువరాజు ‘కేటీఆర్ ఫ్రెండ్’, ‘క్లాస్ మేట్’ నని ప్రచారం చేసుకుని రాజకీయాల్లో ఎదిగారు. వాస్తవంగా కేటీఆర్ చిన్నమ్మ కొడుకు, వరుసకు సోదరుడు, కేసీఆర్ కు వెన్నంటి ఉండే సంతోష్ రావుకు పూణేలో క్లాస్ మేట్, రూం మేట్ కూడా. బయట ప్రపంచానికి కేటీఆర్ కూడా తనకు క్లాస్ మేట్ అని ఈయన ప్రచారం చేసుకుని, కేటీఆర్ ప్రాపకం, సంతోష్ సహకారంతో రాజకీయాల్లో బాగా రాణించారు. 2014లో, 2018లో పరకాల నుంచి, 2023లో జనగామ నుంచి పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అందుకు ప్రతిగా ఆయనకు రెండుసార్లు ఎమ్మెల్సీ అవకాశం దక్కింది. వరంగల్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా రెండు సార్లు ఎన్నికయ్యారు. అందులో ఒకసారి ఏకగ్రీవం కూడా అయ్యారు. అందుకు అప్పట్లో ఆయన భారీగానే ఖర్చు చేశారని ప్రచారంలో ఉంది. 2018 ఎన్నికలకు పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ ఆయనే చక్కబెట్టారని అంటూంటారు.
అయితే ఆయన బీఅర్ఎస్ రాజకీయాల్లో కీలక నేతగా చక్రం తిప్పుతున్నారని తెలిసింది. మొన్నామధ్య తన పేరునే ఉన్న ఎన్జీఓ పేరుతో కేటీఆర్ చేతుల మీదుగా పరకాలలో మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. బహుషా వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి దండె లేదా గండి కొట్టి, ఆయన పరకాల నుంచి పోటీ చేస్తారేమో! అనే ప్రచారం జరుగుతోంది.
ఇక భారీ నిర్మాణ రంగ సంస్థ ‘మోగా’తో భాగస్వామ్యం కుదిరే వరకు పరిస్థితి వెళ్ళిందనే విషయాన్ని సాక్షాత్తు కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లెలు కల్వకుంట్ల కవితే వెల్లడించారంటే, అతడు ఏ మేరకు సంపాదించారో అర్థం చేసుకోవచ్చు. మోన్నామధ్య రేవ్ పార్టీ జరుగుతుండగా, రెడ్ హ్యాండెడ్ గా అడ్డంగా బుక్కైన హైదరాబాద్ శివారులోని ఓ రిసార్టు కూడా ఆయనదేనని ప్రచారం జరిగింది. అయితే, దాన్ని మరొకరికి లీజుకిచ్చానని, తన అల్లుడు ఆ వ్యవహారం చూస్తున్నారని, తనకా విషయమేమీ తెలియదని, దానితో సంబంధం లేదని తెలివిగా తన పలుకుబడితో తప్పించుకున్నారని కూడా ప్రచారంలో ఉంది.
శ్రీనివాస్ రెడ్డి తరచూ దుబాయ్ కి వెళ్తారని తెలిసింది. ఆయనకు అక్కడ కూడా ఆస్తులు, వ్యాపారాలు ఉన్నాయని ఓ ప్రచారం ఉంది. హైదరాబాదులోనూ ఒక భారీ సంస్థతో విల్లాలు నిర్మిస్తున్నట్లుగా బీఆర్ఎస్ బహిష్కృత నేత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఆరోపించడం రాష్ట్ర రాజకీయాల్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. స్వయంగా కవిత శ్రీనివాస్ రెడ్డి శ్రీమంతుడు అని వ్యాఖ్యానించడం మామూలు విషయంమేమీ కాదు. ఈ లెక్కన ఆయన కూడా మామూలోడేమీ కాకపోవచ్చు. అంతేకాదు సంతోష్ రావు స్నేహితుడైన శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్ చుట్టూ ఉండి తప్పుదారి పట్టిస్తున్న కోటరీలో ఒకరిగా కవిత ప్రస్థావించడం, విమర్శించడం గుర్తుంచుకోవాలి.
సైలెంట్ గా, సౌమ్యూడిగా కనిపించే శ్రీనివాసరెడ్డి వెనుక ఇంత చరిత్ర ఉందా? అని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు చర్చించుకుంటున్నారు. నిన్నటి వరకు అతి సామాన్యుడుగా కనిపించిన శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడు శ్రీమంతుడుగా గుర్తింపు తెచ్చుకోవడం వెనుక బీఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్న సంతోష్ రావు మద్దతు ఉందని ప్రచారం జరుగుతోంది. కవిత ఆరోపణల్లో నిజం నిగ్గు తేల్చాలంటే శ్రీనివాస్ రెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ ఆస్తులపై విచారణ జరిపించాలని లేదా కవిత వ్యాఖ్యల ఆధారంగా న్యాయస్థానాలు సుమోటోగా కేసు నమోదు చేయాలని లేదా బీఆర్ఎస్ పార్టీ సీనియర్లతో ఓ కమిటీని వేసి నిగ్గు తేల్చాలని పార్టీ కోసం 2001 నుంచి పనిచేసిన గులాబీ తమ్ముళ్లు గుస్సాగా డిమాండ్ చేస్తున్నారు.

Latest News

ఎక్కువ కాలం ఎవలు బత్కుతరు?!|ADUGU TRENDS

పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని...

సంకల్పంతోనే కామన్ స్కూల్ విజయవంతం!|EDITORIAL

విద్యారంగంలో నిజమైన సంస్కరణలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడం, కామన్ స్కూల్ విధానాన్ని దశలవారీగా అమలు చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలపై సమర్థవంతమైన నియంత్రణ విధించడం ఒకేసారి అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్...

జూన్ 19, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి రాత్రి 10.13 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 03.30 వరకు ఉపరి ముఖ యోగం హర్షణ రాత్రి 08.30 వరకు ఉపరి వజ్ర కరణం బవ ఉదయం 11.06...

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్! తప్పెవరిది? శిక్షలెవరికి? మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి? దళారుల ప్రమేయం నిజం కాదా? మార్కెటింగ్ శాఖదే బాధ్యతా? కేంద్రం ఎందుకు స్పందించదు? వరంగల్ జేడీఎం సప్పెన్షన్! 7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు 84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు సీసీఐ పత్తి...

మందుబాబులకో శుభవార్త!|ADUGU TRENDS

ఇగిప్పుడు యేడ సూసినా, తాగి పడేసిన బీరు, విస్కీ సీసాలెనాయె.! పార్కుల్ల, బస్సు స్టాపుల్ల, స్టాండ్లల్ల, రైల్వే స్టేషన్లల్ల, రోడ్ల పక్కల, శెట్ల కింద, ఆకరికి ఏర్గ పోయేకాడ, ఉచ్చ పోసే కాడా...

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే...

జూన్ 18, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు చవితి రాత్రి 11.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.32 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యాఘాత రాత్రి 10.54 వరకు ఉపరి హర్షణ కరణం వణజి మధ్యాహ్నం 12.59 వరకు...

గోడలకంటే, గీ ఇకమతు మస్తుగుందే!|ADUGU TRENDS

ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా...! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది....

పంటల సాగుకు శాశ్వత పరిష్కారమేది?!|EDITORIAL

వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్‌పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం...

జూన్ 17, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు తదియ రాత్రి 02.00 వరకు ఉపరి చవితి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.51 వరకు ఉపరి పుష్యమి యోగం వృద్ధి రాత్రి 01.35 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల మధ్యాహ్నం 03.06 వరకు...

48 ఏండ్ల తర్వాత?!|ADUGU TRENDS

ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి. బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు...

విలీనమే పరిష్కారమా?!|EDITORIAL

ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News