Wednesday, September 23, 2026
26 C
Hyderabad

Internet|ఇంటర్నెట్ లేకుండానే పనిచేసే Bitchatmesh|బిట్‌చాట్‌ మెష్ యాప్

Data Protection|డేటా భద్రతకు అధిక ప్రాధాన్యత|Main Importance

Twitter|ట్విట్టర్ సహవ్యవస్థాపకుడు జాక్ డోర్సే రూపొందించిన కొత్త కమ్యూనికేషన్ యాప్‌ బిట్‌చాట్ మెష్| BitChat Mesh ఇప్పుడు I Phone Users| ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా ఇంటర్నెట్ అవసరం లేకుండా పనిచేస్తుంది. బ్లూటూత్ ఆధారంగా సమీప యూజర్లతో మెష్ నెట్‌వర్క్‌ను ఏర్పరచి, మెసేజింగ్‌ చేయడానికి వీలు కల్పిస్తుంది. యాప్ స్టోర్‌లో ఇప్పటికే ఈ యాప్‌ అందుబాటులో ఉంది. ప్రత్యేకత ఏమిటంటే, ఈ యాప్‌లో ఎలాంటి వ్యక్తిగత వివరాలు అవసరం ఉండవు. అంటే మీ పేరు, ఫోన్ నంబర్‌, ఈమెయిల్ అడగదు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండానే ఈ యాప్‌ను వాడుకోవచ్చు. బిట్‌చాట్‌ మెష్‌ యాప్‌ లో పంపే సందేశాలన్నీ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ తో సురక్షితంగా ఉంటాయి. దీనికోసం నాయిస్‌ ప్రోటోకాల్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఉపయోగిస్తున్నారు. ఇక చాటింగ్‌ డేటా అంతా మీ ఫోన్‌లోనే లోకల్‌గా స్టోర్ అవుతుంది. కొద్ది రోజుల్లో అది ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంది. బ్యాకప్‌ సిస్టమ్‌ లేదు కనుక మీ డేటా మళ్లీ ఎక్కడా లభించదు. అంటే పూర్తిగా గోప్యతకు ప్రాధాన్యత ఇచ్చేలా యాప్‌ డిజైన్ చేశారు.

ఈ యాప్‌లో యూజర్లు తమకు ఇష్టమైన కాంటాక్ట్‌లను ఫేవరెట్స్‌గా సెటప్‌ చేయొచ్చు. అవసరం లేని కాంటాక్ట్‌లను బ్లాక్ చేయొచ్చు. యాప్‌ ఇంటర్‌ఫేస్‌ చాలా సులభంగా ఉంటుంది. ఎవరూ మిమ్మల్ని ట్రాక్ చేయలేరు, మీ మెసేజ్‌లను చూడలేరు. ఇది గోప్యతకు ప్రాముఖ్యత ఇచ్చే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, వరదలు, టెలికం సేవల అంతరాయం వంటి అత్యవసర పరిస్థితుల్లో బిట్‌చాట్ మెష్ యాప్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ అవసరం లేకుండా బ్లూటూత్ ఆధారంగా సమీప వ్యక్తులతో కమ్యూనికేట్ చేయవచ్చు.

అయితే డెవలపర్లు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఈ యాప్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లో అభివృద్ధి చేశారు. ఇప్పటివరకు భద్రతా నిపుణులు దీన్ని సమగ్రంగా పూర్తిగా పరీక్షించలేదు. అందువల్ల ప్రైవేట్, అత్యంత సున్నితమైన చాటింగ్ కోసం ప్రస్తుతానికి వాడొద్దని హెచ్చరిస్తున్నారు. భవిష్యత్‌లో మరింత భద్రతా ఫీచర్లు రాగానే పూర్తిస్థాయిలో వాడుకోవచ్చని సూచిస్తున్నారు.

ఇప్పుడు ఇది iOS 16 మరియు ఆ తర్వాతి వెర్షన్‌లను సపోర్ట్ చేస్తోంది. ఐఫోన్‌, ఐప్యాడ్‌, విజన్ ప్రో వంటి ఆపిల్‌ డివైజ్‌లపై మాత్రమే పనిచేస్తోంది. ఇక ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా దీన్ని త్వరలో విడుదల చేయనున్నట్టు సమాచారం ఉన్నా, ఖచ్చితమైన తేదీ మాత్రం వెల్లడించలేదు. మొత్తంగా చెప్పాలంటే, గోప్యతకు ప్రాధాన్యతనిచ్చే, ఇంటర్నెట్ లేకుండా పని చేసే మెసేజింగ్ యాప్ కావాలని కోరుకునే వారికి బిట్‌చాట్ మెష్‌ మంచి ఎంపిక కావచ్చు.

Latest News

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News