Saturday, November 7, 2026
21.9 C
Hyderabad

ఆడదంటే..?

మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో..

ఒకడంటడు..
ఆడదంటే పనిమనిషని.
పిండేశేదిరా..
ఎండేశేదిరా..
ఊడిశేదిరా..
తూడిశేదిరా..
అని.

ఇంకోడంటడు..
ఆడదంటే..
వంటమనిషని.
వండేటిదిరా..
పెట్టేటిదిరా..
తోమేదిరా..
కడిగేది..సుత కదారా అని.

ఓ
ఇంట్లోడంటడు..
అది బానిసని..
“కట్టు” (కున్న) బానిసని.
ఆడదంటే పెండ్లాంరా..
ఆడదంటే..
ఊ.. అంటే
పండేదిరా..
ఆ.. అంటే
లేశేదిరా..
పడక సుఖాన్నిచ్చేదిరాబై..
పిల్లలకనే మిషనురోయ్.. అని.

ఆడిపోరగాండ్లు ఇష్టం లేని అయ్యవ్వలైతే..
ఆడదంటే..
కడుపుల పెరకగ
ముందే పీనిగైయ్యే నెత్తురు ముద్ద అని..
తప్పిదారి పుడితే
మురికి కాల్వలల్ల, మూసీనదులల్ల, చెత్తకుప్పలల్లబడే వ్యర్థ మని.

ఆడిపోరగాండ్లలంటే జర పావురమున్న అయ్యవ్వలైతే..
ఆడదంటే..
పిల్ల
పెద్దమనిషి కాంగనే
ఓ అయ్య చేతులబెట్టే బొమ్మ అని.

ఇగ బడికిపోతే..
కొంత మంది
బడి పోరలంటరు..
ఆడదంటే..
కుదిరితే …దోస్తానీ చేశేది.
దొరికితే…మస్తీ..నీ చేశేది. అని.

జర కాలేజీకాడనైతే..
కొంతమంది
కాలేజీపోరండ్లంటరు
ఆడదంటే..
మా రోత కూతలు ఇనెటానికి..
మా ఎకిలి చేష్టలు సూశేటానికి
మాకోసం పుట్టిన జీవులంటరు..

రోడ్డు మీద పోయే..
పోకిరోడంటడు.
ఆడదంటే..
మేం ఏడిపిత్తే ఏడిశేదిరా..
మేం ఆడి పిత్తే ఆడేదిరా..
అని.

పోట్టకూటి కోసం పనికి పోతే..
ఈ సమాజంలో కొన్ని నరం లేని నాలికెలంటయి…
కామం తో చూశే కండ్లంటయ్..
ఆడదంటే..
ఆ ” అవసరం ” నే ముందంటయ్.. ముఖ్యం అని గూడా అంటయ్..

ఓ ప్రేమొన్మాది అంటడు.
ఆడదంటే..
వాన్ని ప్రేమిస్తే మెడలో పసుపు తాడు.
వాని ప్రేమను కాదంటే..
మెడలో ఉరి తాడంటడు.

ఓ సైకో అంటడు.
ఆడదంటే..
వాడి దేహపు ఆకలితీర్చే అవయవాల కుప్ప అంటడు.
పాణం పోయేంత సేపు
” పండుగ ” అని
పెట్రోలు మంటలలో కాల్చబడే పీనుగంటడు.

కానీ…
ఆడదంటే..
జన్మనిచ్చే” అమ్మ ” అని,
అమృతాన్ని పంచే దేవత అని.

ఆడదంటే…
“మరో జన్మన్నిచ్చే రేపటి ” అమ్మ”
కూడా అని
ఎప్పుడు ఎరుకైతదిరా..బై ? మీకు.

లెనిన్ గూడూరు  9849491179

Latest News

గ్రాడ్యుయేట్స్ కి ప్రజాస్వామ్య చైతన్యమేది?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కేవలం ఒక గుర్తుపై ముద్ర వేసే సాధనం మాత్రమే కాదు, అది పౌరుల భవిష్యత్తును, ప్రభుత్వ విధానాలను నిర్దేశించే అత్యంత శక్తివంతమైన ఆయుధం. సమాజంలో అందరికంటే ఉన్నతంగా...

దేవుడా! గా బాధ లేకుండ సూడు!?|ADUGU TRENDS

ఎవలైనా దేవుడ్ని ఏం కోరుకుంటరు? గా కట్టాలు ఎడబాపమంటరు. కాదంటే కాసిన్ని సిరి సంపదిలయ్యమని అడుక్కుంటరు. ఇంకొందరైతే ఆరోగ్యం, సుఖసంతోషాలు, పశాంతమై జీవితం కావాలని కోరుకుంటరు. కనీ, గీ భక్తుడు ఏం కోరుకున్నడో...

భాగ్యనగరానికి సరికొత్త మణిహారం!|EDITORIAL

దశాబ్దాల చరిత్రకు ఆధునిక హంగులు తోడవుతున్నాయి! విమానాశ్రయాన్ని తలపించేలా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపురేఖలు మారుతున్నాయి. రూ.715 కోట్లతో సరికొత్త ప్రపంచం ఆవిష్కృతమవుతోంది. భాగ్యనగరి కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరనుంది! మార్గం - అడుగు, ఎడిటోరియల్ హైదరాబాద్...

నవంబర్ 07, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి త్రయోదశి ఉదయం 10.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం చిత్త ఉదయం 05.56 వరకు ఉపరి స్వాతి యోగం ప్రీతి రాత్రి తెల్ల 04.28 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం...

మనువుల బడి!?|ADUGU TRENDS

గీ రోజుల్ల కొందరు పెండ్లంటనే భయపడతాండ్రు. ఇగ గా మనువాడినోల్లు బాధలు పడతాండ్రు. గిట్ల పెండ్తైతాందో లేదో గట్ల యిడుపుకాయితాలైతానయి. కలిసి బతికే శానామంది ఆలుమొగల్లల్ల ఓ ముద్దూ లేదు ఓ ముచ్చటా...

ప్రశ్నించడమే నేరమా?|EDITORIAL

అధికారాన్ని ప్రశ్నిస్తే ఆంక్షలు.. అవినీతిని ఎండగడితే కేసుల భయం.. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తే చట్టాల సంకెళ్లు! ఇదేనా ప్రజాస్వామ్యం? పాలకులను నిలదీయాల్సిన మీడియా గొంతుకలకే అడ్డుకట్ట వేస్తే ప్రజల పక్షాన నిలిచేదెవరు? మార్గం...

నవంబర్ 06, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 10.44 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం హస్త రాత్రి తెల్ల 05.23 వరకు ఉపరి చిత్త యోగం వైధృతి ఉదయం 07.18 వరకు ఉపరి విష్కంబ కరణం తైతుల ఉదయం 10.44...

జనాలకు గా సర్కార్ నజరానా!?|ADUGU TRENDS

పండుగలొత్తే గ దుకాణదారులు, కంపెనీలోల్లు ఆపర్లు పెట్టడం శూసినం. కనీ, ఏకంగా పభుత్వమే పజలకు బంపబరాఫర్ ఇచ్చుడు ఎక్కడైన సూసినమా? ఇగో గా సర్కార్ ఏం శేసిందో సూడుండ్రి. ఇగ దీపాలి రానే వచ్చే....

ట్రంప్ కు అమెరికన్ల షాక్ !|EDITORIAL

ప్రపంచాన్నే తన నిర్ణయాలతో గడగడలాడిస్తున్న ట్రంప్‌కు సొంత దేశంలోనే ఓటర్లు షాక్‌ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల దెబ్బకు రిపబ్లికన్ల ఆధిపత్యం కుప్పకూలింది. రెండు సభల్లోనూ ఎదురుదెబ్బతో ట్రంప్‌కు ఇక రాజకీయ గండం...

నవంబర్ 05, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి ఏకాదశి ఉదయం 11.40 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తర రాత్రి తెల్ల 05.19 వరకు ఉపరి హస్త యోగం ఐంద్ర ఉదయం 09.15 వరకు వైధృతి కరణం బాలవ ఉదయం 11.40 వరకు ఉపరి...

గివీల్లు సావును జయించిండ్రు!?|ADUGU TRENDS

భూమ్మీద నూకలున్నోడ్ని ఎవరూ సంపలేరు. గా నూకలే లేనోల్లను ఎవరూ కాపాడలేదరంటే గిదే. నిజంగా గివీల్లు మ్రుత్యుంజయులే! సంద్ర పయాణంల తుఫాన్ల శిక్కకున్నరు. గల్లైంతన మూడు నెలలకు పానాలతో కనపడ్డరు!! గా పసిఫిక్ మహాసంద్రంల...

పుర పోరులో కూటమి జోరు!|EDITORIAL

జగన్ కంచుకోటలకే బీటలు.. పట్టణ పీఠాలపై కూటమి జైత్రయాత్ర! ఆంధ్రప్రదేశ్ స్థానిక సమరంలో పసుపు ప్రభంజనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పులివెందుల నుంచి మాచర్ల వరకు విజయదుందుభి మోగిస్తూ వైసీపీకి కూటమి గట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News