స్టోర్లో కొనుగోలు పరిమితి!
అమెరికాలో కోడిగుడ్ల కొరత కారణంగా ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. గతేడాది డిసెంబర్‌లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి కారణంగా 2.3 కోట్ల కోళ్లను వధించడంతో, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఒహాయో, మిస్సౌరీ వంటి రాష్ట్రాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది. గత ఏడాది జనవరిలో డజను గుడ్ల ధర $2.52 ఉండగా, డిసెంబర్ నాటికి $4.15కి పెరిగింది. ప్రస్తుతం ఇది $7.34కి చేరింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్టోర్లు గుడ్ల విక్రయంపై పరిమితి విధించాయి. ట్రేడర్ జో ఒక్కరికి రోజుకు డజను మాత్రమే ఇస్తుండగా, హోల్ ఫూడ్స్ మూడు కార్టన్లు, క్రోగర్ రెండు డజన్లు మాత్రమే విక్రయిస్తోంది. హోటళ్లపై కూడా దీని ప్రభావం పడింది. వాఫిల్ హౌస్ వంటి రెస్టారెంట్లు గుడ్లపై 50% అదనపు రుసుం వసూలు చేస్తున్నాయి. వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు.

