Tuesday, September 22, 2026
27.2 C
Hyderabad

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిస్) కొన్ని నిబంధనలు పెట్టింది. గదె హాల్ మార్కింగ్ యిదానం. ఇంతకు గా హాల్ మార్కింగ్ అంటే ఏ0దో? బంగారం కొనుగోలు చేసే ముందు ఏమేం సెయాల్నో సూద్దమా?

బంగార0 నగల స్వచ్చతను తెలుసుకొనేట0దుకు ‘హాల్మార్క్’ యిధానాన్ని బిస్ రూపొందించింది. దీని ఆధారంగా నగపై ముద్రించిన మూడు ముఖ్యమైన అంశాల్ని పరిగణనలోకి తీసుకోవాలె. మొదటిది స్వచ్ఛత గ్రేడ్. రె 0డోది బిస్ స్టాండర్డ్ మార్క్. మూడోది హెచ్ యు ఐ డి.

2021 నుంచే బంగారు నగలపై ఈ హాల్మార్కింగ్ను ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

స్టాండర్డ్ లోగో: గిది త్రిభుజాకారంలో ఉండే గురుతు. గా నగని సర్కార్ నిబంధనల ప్రకారం తనిఖీ చేసినమని, గండ్ల వాడిన బంగారం ప్రామామాణికమైనదని లెక్క.

క్యారట్లలో స్వచ్ఛత: గా బంగారం నగ మీద ముద్రించిన క్యారెట్స్ అంకెను పరిగణనలోకి తీసుకోవడం తప్పనిసరి. 24 క్యారట్ల బంగారాన్ని వంద శాతం స్వచ్చమైనదిగ భావిస్తరు. అయితే, గా బంగారంతోటి నగల తయారీ సాధ్యం కాదు గనక వెండి, రాగి, జింక్ వంటి ఇతర లోహాల్ని కలుపుతరు. గా నగల్లో అసలు బంగారం ఎంత? గండ్ల కలిపిన ఇతర లోహాల మోతాదు ఎంత? అనేదానికి గీ లెక్క.

ఇగ ఇండ్ల 22K916 (91.6% స్వచ్ఛమైన బంగారం). దీన్ని సాధారణ నగలకు ఉపయోగిస్తరు. 18K750 (75% స్వచ్ఛమైన బంగారం) వజ్రాల నగలకు వినియోగిస్తరు. 14K585 అంటే ఇగ ఇండ్ల 58.5 శాతం మాత్రమే బంగారం ఉంటుందని అర్థం.

హెచ్ యు ఐ డి నంబర్ కీలకం: బంగారు నగ మీద ఉండే హెచ్ యు ఐ డి (హాల్మార్క్ యునిక్ ఐడెంటిఫికేషన్) నంబర్ కూడా అవసరమే. ప్రతి నగల వ్యాపారి ఈ ఆరంకెల ఆల్ఫాన్యూమరిక్ ఉన్న నగల్నే అమ్మాలని సర్కార్ చెబుతోంది. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్లే ప్రతి నగకు ఒక ప్రత్యేకమైన హెచ్ యు ఐ డి నంబరును కేటాయిస్తరు. గీ కోడ్ సాయంతోటి కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛమైందో, కాదో స్వయంగా తనిఖీ చేసుకోవచ్చు. ఇగ ఇందుకోసం బిస్ కేర్ అనే యాప్ కూడా అందుబాటులో ఉంది. యాప్ ఓపెన్ కావ0గనే ‘Verify HUID’ అని కనిపించే ఆప్షన్పై ఒత్తాలే. ఆపై బంగార0 నగ మీద ఉన్న HUID నంబర్ ని అందుల కొట్టాలే. గండ్ల గా నగకు సంబంధించిన హాల్మార్కింగ్ వివరాలన్నీ ఓ కాగితం లా కన బడతయి. హాల్మార్క్ చేసిన కేంద్రం, నగలు, దాని స్వచ్చత..స్వయంగా తెలుసుకోవచ్చు.

Latest News

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

సెప్టెంబర్ 21, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు దశమి సాయంత్రం 05.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ పూర్తిగా ఉంది యోగం శోభ సాయంత్రం 04.30 వరకు ఉపరి అతిగండ కరణం గరజి సాయంత్రం 05.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News