Saturday, September 19, 2026
23.7 C
Hyderabad

సోలార్‌ విద్యుత్తుదే భవిష్యత్తు!|EDITORIAL

రోజురోజుకు ఇంధన వనరులు తరిగిపోతున్నాయి. జల విద్యుత్ ఖరీదైనదిగా మారుతోంది. మరోవైపు విద్యుత్ వినియోగం పెరుగుతోంది. జనాభా పెరుగుతోంది. డిమాండ్ కనుగుణంగా విద్యుత్ తయారీ ఓ సవాల్ గా మారింది. వీటన్నింటికీ మించి విద్యుత్ నిలువ ఉంచుకునేందుకు వీలు కానిది కావడంతో ఉత్పత్తి చేసినంతా వాడుకోవడం లేకపోతే కొనుక్కోవడం మాత్రమే మనం చేయగలిగింది. ఈ కారణాల రీత్యా ప్రత్యామ్నాయ విద్యుత్ ను ఉత్పత్తి చేయడం తప్ప మరో దారే లేదు. నీటి, థర్మల్ విద్యుత్ కు బదులుగా సోలార్, పవన విద్యుత్ లపై ప్రభుత్వాలు దృష్టి సారించడమొక్కటే మార్గంగా ఉంది. రాను రాను ఈ రెండు రకాల విద్యుత్ లకు డిమాండ్ పురుగుతున్నది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు సోలార్‌ విద్యుత్‌పై దృష్టి సారించాయి. అందుకు తగ్గట్లుగా వ్యక్తిగత ప్లాంట్‌ ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీలు ఇస్తున్నారు. ఏపీ కూడా సోలార్‌ పవర్‌ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. సోలార్ విద్యుత్ తయారీ, వినియోగం అంశాలు జాతీయ విధానంగా రూపుదిద్దుకుంటే దేశ వ్యాప్తంగా మంచి ఫలితాలు అందే అవకాశం ఉంది. సంప్రదాయ విద్యుత్‌తో పోలిస్తే సోలార్‌ విద్యుత్‌ ఖరీదైనదిగా చెబుతున్నారు. అయితే, సంపూర్ణ అధ్యయనం, సరైన పరిశోధనలు చేసి, చౌకగా తాయరు చేయడంపై ఆలోచనలు సాగాలి. చౌకగా ఉత్పత్తి చేయగలిగితే, దేశం మొత్తం వెలుగులు నింపేలా చేయవచ్చు. ఇది పాలకుల చిత్తశుద్ది, సమర్థతపై ఆధారపడి ఉంటుంది.

ఇక నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ అందుబాటు ఉంటేనే ప్రగతి వేగం పుంజుకుంటుంది. భవిష్యత్‌లో మరిన్ని పరిశ్రమలు రావడానికి ఆస్కారం ఉంటుంది. నిజానికి మనదేశంలో అనేక సహహజ వనరులు ఉన్నాయి. వాటిని ఉపయోగించడంలో వైఫల్యాలున్నాయి. నిరంతర విద్యుత్‌ సాధిస్తే దానికి అనుబంధంగా అనేక విధాలుగా దేశం పురోగమిస్తుంది. సోలార్‌తో నడిచే వాహనాలు కూడా రావచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలు వస్తున్నాయి. దీని మార్కెట్‌ కూడా పెరుగుతోంది. సోలార్‌ విద్యుత్‌ పెరిగితే అప్పుడు పెట్రో ఉత్పత్తులపైనా భారం తగ్గుతుంది. మన దేశంలోనే సోలార్‌ ఉత్పత్తుల కు మంచి ఆదరణ ఉంటుంది. మన దేశంలో భూమధ్య రేఖకు సమీపాన ఉండటం, ఎక్కువ ఉష్ణ ప్రాంతం కావడం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుకూలం. నిజానికి రోడ్లు, మంచినీరు, విద్యుత్‌ అన్ని గ్రామాలకు ఇవ్వగలిగితే అంతకుమించిన అభివృద్ధి మరోటి ఉండదు. మనదేశంలో వనరులకు కొదవ లేదు. సోలార్‌ విద్యుత్ అందుబాటులోకి వస్తే కాలుష్యం తగ్గిపోతుంది. పరిశ్రమలను ప్రోత్సహించడమేగాక, పారిశ్రామిక సెజ్‌లలో ప్రత్యేక రాయితీలు కల్పించవచ్చు. పెట్టుబడి దారులకు ఇబ్బందులు తగ్గుతాయి. ఆ దిశంగా మన ఐఐటిలు పరిశోధనలు జరపాలి. పరిశోధనలకు ప్రోత్సాహం, ప్రాధాన్యం ఇవ్వాలి. మేకిన్‌ ఇండియా అంటున్న ప్రధాని మన ఐఐటిల్లో సోలార్‌ విద్యుత్‌ పరిశోధనలకు పెద్దపీట వేయాలి.

అంతేకాకుండా అనేక కంపెనీలు విద్యుత్‌ వాహనాలు విడుదల చేస్తున్నాయి. వీటికి ఛార్జింగ్‌ సమస్యలు ఉన్నాయి. విదేశాల్లో ముఖ్యంగా అమెరికా తదితర యూరోప్‌ దేశాల్లో ఉన్నట్లుగా దారిపొడవునా ఛార్జింగ్‌ స్టేషన్లు రావాలి. అప్పుడే విద్యుత్‌ వాహనాలకు గిరాకీ పెరుగుతుంది. మనుగడ, భవిష్యత్తు కూడా ఉంటుంది. సోలార్ ద్వారా కర్బన ఉద్గారాల విడుదల తగ్గతుంది.

దేశంలో తొలి సారిగా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ ధృవీకరణ పొందిన ఉత్పాదనతో ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేసింది. గుమ్మడిదల మండలం అన్నారం పారిశ్రామికవాడలోని సోలార్‌ ప్రీమియర్‌ మాడ్యుల్‌ పరిశ్రమ రాయితీలను సద్వినియోగం చేసుకోవడానికి అదనంగా మరో సోలార్‌ యూనిట్‌ను విస్తరించింది. పెట్టుబడులు పెట్టి ఉన్న పరిశ్రమను అదనంగా విస్తరించింది. దీంతో అదనంగా 200 మెగావాట్ల విద్యుత్‌ తయారుచేయనుంది. అంతే కాకుండా సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసి విడుదల చేశారు. అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. సోలార్‌ ఉత్పత్తి పెరిగితే పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు స్వస్తి పలకనుంది. ఈ -వాహనాలు వస్తే వాయు కాలుష్యం తగ్గి పర్యావరణాన్ని రక్షించే విధంగా మారనుంది. సోలార్‌ పరిశ్రమలను స్థాపించే వారికి రాయితీలను విస్తరిస్తామని కూడా ప్రభుత్వాలు ప్రకటించాయి. సంగారెడ్డి పారిశ్రామిక వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఐదేండ్ల కాలంలో ఈ యూనిట్‌ సామార్ధ్యాన్ని వెయ్యి మెగావాట్ల పెంచనున్నారు. దీంతో రాష్ట్రంలో నీటి విద్యుత్‌కు తోడుగా సోలార్‌ విద్యుత్‌ రానుంది. ఇందు కోసం రూ.12 వందల కోట్ల పెట్టుబడితో ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు కానుంది. పైలట్‌ ప్రాజెక్ట్ గా సోలార్‌ వాహనాలు, అదనంగా సోలార్‌ విద్యుత్‌ను తయారు చేయనున్నారు. దీని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యావరణ హితం, చౌక, సులభమైన ఉత్పత్తి వంటి వాటి వల్ల సోలార్ విద్యుత్ మన లాంటి దేశానికి ఎంతో మేలు చేస్తుంది.
…..

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News