అనంతపురం జిల్లా గుత్తిలో ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ నంబర్ బ్లాక్ చేశాడని 100కు కాల్ చేసిన ఘటన జరిగింది. “అతను నాతో మాట్లాడట్లేదు, నా నంబర్ బ్లాక్ చేశాడు. మీరు వాడితో మాట్లాడి నా నంబర్ అన్లాక్ చేయించండి” అంటూ పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో గుత్తి PS బ్లూ కోల్ట్స్ పోలీసులు ఆమెను సంప్రదించారు. అయితే, తన ఇంటికి రావొద్దని, నంబర్ అన్లాక్ చేయిస్తే చాలని యువతి చెప్పింది. పోలీసుల వల్ల అది సాధ్యపడదని, కావాలంటే స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలని సూచించారు.

