శ్రీ క్రోధినామ సంవత్సరం–ఉత్తరాయణం
శిశిరఋతువు-మాఘమాసం-శుక్లపక్షం
తిధి శు.త్రయోదశి సాయంత్రం 06.49
వరకు ఉపరి చతుర్దశి
నక్షత్రం పునర్వసు సాయంత్రం 06.45
వరకు ఉపరి పుష్యమి
యోగం ప్రీతి ఉదయం 11.24 వరకు ఉపరి
ఆయుష్మాన్
కరణం కౌలవ ఉదయం 07.47 వరకు ఉపరి
గరజి
వర్జ్యం రాత్రి తెల్ల 03.03 నుండి 04.42
వరకు
దుర్ముహూర్తం పగలు 12.24 నుండి 01.12
వరకు తిరిగి పగలు 02.46 నుండి 03.34
వరకు
రాహుకాలం ఉదయం 07.30 నుండి
09.00 వరకు
సూర్యోదయం ఉదయం 06.48
సూర్యాస్తమయం సాయంత్రం 06.11
ఫిబ్రవరి 10 సోమవారం 2025
రాశి ఫలితాలు
మేష రాశి
ఈ రోజు మీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.
వృషభ రాశి
శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి అనుభవించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఖర్చులు నియంత్రించుకోవాలి. కుటుంబంలో చికాకులు ఎదుర్కొనవచ్చు.
మిథున రాశి
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరగవచ్చు. కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది.
కర్కాటక రాశి
ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబంలో సమస్యలు తలెత్తవచ్చు. ఉద్యోగస్తులకు ఒత్తిడులు పెరగవచ్చు.
సింహ రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. పనుల్లో విజయాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కన్య రాశి
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరమైన సమయం.
తులా రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల సమయం.
వృశ్చిక రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధల నుండి విముక్తి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ధనుస్సు రాశి
ముఖ్యమైన పనుల్లో విజయాలు సాధిస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి.
మకర రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబంలో వివాదాలు తలెత్తవచ్చు. గృహ నిర్మాణ యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
కుంభ రాశి
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
మీన రాశి
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధల నుండి విముక్తి పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.

