Friday, June 19, 2026
32.1 C
Hyderabad

అమల్లోకి కోడ్.. కొత్త స్కీమ్స్కు బ్రేక్..!!

7 ఉమ్మడి జిల్లాల్లో అమల్లోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్
పాత పథకాల అమలు తప్ప.. కొత్తవాటికి నో చాన్స్
జిల్లాల్లో మంత్రుల శంకుస్థాపనలు బంద్

రాష్ట్రంలో ఎలక్షన్కోడ్ అమల్లోకి రావడంతో కొత్త స్కీమ్స్కు బ్రేక్ పడింది. 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈసీ బుధవారం షెడ్యూల్ రిలీజ్ చేయగా.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వరంగల్– -ఖమ్మం- -నల్లగొండ ఉపాధ్యాయ, మెదక్- –నిజామాబాద్– -ఆదిలాబాద్- -కరీంనగర్ ఉపాధ్యాయ, మెదక్- – నిజామాబాద్— ఆదిలాబాద్– కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో 7 ఉమ్మడి జిల్లాల్లో దాదాపు 40 రోజులు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండనున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో తప్ప మిగతా అన్ని ఉమ్మడి జిల్లాలో కోడ్ వర్తిస్తుంది.

ఈ నేపథ్యంలో మార్చి 8 వరకు ఇప్పటికే ప్రకటించిన స్కీమ్స్ను మాత్రమే అమలు చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల మంజూరు స్కీమ్లను ప్రారంభించింది. లబ్ధిదారులకు నగదు బదిలీతోపాటు ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల సాంక్షన్ పత్రాలు అందచేసింది. ఇవి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగనున్నాయి.

శంకుస్థాపనలు బంద్

ఎమ్మెల్సీ కోడ్ అమల్లోకి రావడంతో జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల పర్యటనలు తగ్గనున్నాయి. నిత్యం జిల్లాల్లో మంత్రులు, జిల్లా ఇన్ చార్జి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. కోడ్ అమల్లోకి రావడంతో ఈ ఏడు ఉమ్మడి జిల్లాల్లో శంకుస్థాపనలు బంద్ కానున్నాయి. బుధవారం పలువురు మంత్రులు జిల్లాల పర్యటనలకు వెళ్లాల్సి ఉండగా.. కోడ్ అమల్లోకి రావడంతో వాటిని రద్దు చేసుకున్నారు.

వరుసగా ఎన్నికలు

ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చే నెల 27న జరగనుండగా.. మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎన్నికల పక్రియ మార్చి 8న ముగియనున్నది. మరుసటి రోజు ఎన్నికల కోడ్ ముగుస్తుంది. మార్చి 29న 3 ఎమ్మెల్యే కోటా, ఆగస్ట్ 6న హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ టర్మ్ సైతం ముగియనున్నది. వీటికి కూడా త్వరలో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ లోపే లోకల్ బాడీ ఎన్నికలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

వచ్చే నెలలో ఒక దశ లేదా రెండు దశల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా.. మార్చిలో ఈ పక్రియ ముగియనుందని సమాచారం. ఇక లోకల్ బాడీ పూర్తయ్యాక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించే అవకాశముందని తెలుస్తున్నది. ఈ ఏడాది చివరలో జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగనున్నట్టు సమాచారం. 2020 డిసెంబర్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగ్గా తర్వాత ఏడాది ఫిబ్రవరిలో కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. వీటితోపాటు గ్రేటర్ వరంగల్, ఖమ్మంతో పాటు పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల టర్మ్ కూడా ముగియనున్నది.

ఫిబ్రవరి 2 నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రచారానికి బీజేపీ రెడీ అయింది. ఫిబ్రవరి 2 నుంచి మూడు సెగ్మెంట్లలో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్తో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలూ ప్రచారంలో పాల్గొనేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. నిజామాబాద్‌–కరీంనగర్–ఆదిలాబాద్–మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా మల్క కొమరయ్య, అదే సెగ్మెంట్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి అంజిరెడ్డి, వరంగల్–ఖమ్మం–నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి పేర్లను బీజేపీ ఇప్పటికే ప్రకటించింది.

వారంతా ప్రస్తుతం ప్రచారాన్ని ప్రారంభించారు. పోలింగ్కు నెల రోజులు కూడా లేకపోవడంతో ఇతర బీజేపీ నేతలు ప్రచారాన్ని వెంటనే ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎన్నికల ఆఫీసులను ప్రారంభించేందుకు బీజేపీ రెడీ అయింది. వచ్చేనెల 2న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించేందుకుగానూ ఇప్పటికే బీజేపీ జిల్లా, అసెంబ్లీ, మండలాల వారీగా ఇన్ చార్జ్ లనూ నియమించింది.

Latest News

ఎక్కువ కాలం ఎవలు బత్కుతరు?!|ADUGU TRENDS

పుట్టిన పతి ప్రాణీ గిట్టక మానది. గట్లనే ఒక్కో జీవికి ఒక్కో ఆయుర్ధాయం ఉంటది. జెల్లీ ఫిష్ కి ఏకంగా అమరత్వమే ఉందంట. గిది వయసైపోయినంక, మళ్ళీ శైశవ దశకు చేరుకుని జీవితాన్ని...

సంకల్పంతోనే కామన్ స్కూల్ విజయవంతం!|EDITORIAL

విద్యారంగంలో నిజమైన సంస్కరణలు రావాలంటే ప్రభుత్వ పాఠశాలల నాణ్యతను పెంచడం, కామన్ స్కూల్ విధానాన్ని దశలవారీగా అమలు చేయడం, ప్రైవేట్ విద్యాసంస్థలపై సమర్థవంతమైన నియంత్రణ విధించడం ఒకేసారి అమలు చేయాలి. తెలంగాణ పబ్లిక్...

జూన్ 19, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పంచమి రాత్రి 10.13 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఆశ్లేష మధ్యాహ్నం 03.30 వరకు ఉపరి ముఖ యోగం హర్షణ రాత్రి 08.30 వరకు ఉపరి వజ్ర కరణం బవ ఉదయం 11.06...

అంతా ‘పత్తి’త్తులే!?|COTTON|CCI|SCAM

సీసీఐ పత్తి కొనుగోల్ మాల్! తప్పెవరిది? శిక్షలెవరికి? మిల్లర్లు, అధికారుల అనుబంధమేంటి? దళారుల ప్రమేయం నిజం కాదా? మార్కెటింగ్ శాఖదే బాధ్యతా? కేంద్రం ఎందుకు స్పందించదు? వరంగల్ జేడీఎం సప్పెన్షన్! 7గురు మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు 84మంది మార్కెటింగ్ అధికారులకు నోటీసులు సీసీఐ పత్తి...

మందుబాబులకో శుభవార్త!|ADUGU TRENDS

ఇగిప్పుడు యేడ సూసినా, తాగి పడేసిన బీరు, విస్కీ సీసాలెనాయె.! పార్కుల్ల, బస్సు స్టాపుల్ల, స్టాండ్లల్ల, రైల్వే స్టేషన్లల్ల, రోడ్ల పక్కల, శెట్ల కింద, ఆకరికి ఏర్గ పోయేకాడ, ఉచ్చ పోసే కాడా...

‘నీట్‌’గా నిర్వహించలేమా?!|EDITORIAL

లక్ష్యం ఎంత గొప్పదైనా, దాన్ని అమలు చేసే వ్యవస్థ సమర్థంగా, విశ్వసనీయంగా లేకపోతే నమ్మకం దెబ్బతింటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం, ఎన్‌టీఏ ‘నీట్’ లోపాలను సరిదిద్దాలి. లేకపోతే ప్రతి ఏటా పరీక్షల కంటే...

జూన్ 18, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు చవితి రాత్రి 11.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుష్యమి సాయంత్రం 04.32 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యాఘాత రాత్రి 10.54 వరకు ఉపరి హర్షణ కరణం వణజి మధ్యాహ్నం 12.59 వరకు...

గోడలకంటే, గీ ఇకమతు మస్తుగుందే!|ADUGU TRENDS

ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా...! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది....

పంటల సాగుకు శాశ్వత పరిష్కారమేది?!|EDITORIAL

వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్‌పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం...

జూన్ 17, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు తదియ రాత్రి 02.00 వరకు ఉపరి చవితి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.51 వరకు ఉపరి పుష్యమి యోగం వృద్ధి రాత్రి 01.35 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల మధ్యాహ్నం 03.06 వరకు...

48 ఏండ్ల తర్వాత?!|ADUGU TRENDS

ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి. బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు...

విలీనమే పరిష్కారమా?!|EDITORIAL

ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News