గీ రోజుల్ల కొందరు పెండ్లంటనే భయపడతాండ్రు. ఇగ గా మనువాడినోల్లు బాధలు పడతాండ్రు. గిట్ల పెండ్తైతాందో లేదో గట్ల యిడుపుకాయితాలైతానయి. కలిసి బతికే శానామంది ఆలుమొగల్లల్ల ఓ ముద్దూ లేదు ఓ ముచ్చటా లేదు. గిదంతా ఎందుకైతాంది? గిట్ల జరగొద్దంటే ఏం శేయాల్నని గా గోవా సర్కార్ ఏకంగా ఓ సదువు పడినే మొదలు పెట్టింది. గా మూడు ముడులు గట్టిగ ఉండాల్నంటే ఏం శేయాల్నో గా బడిల శెప్తరు.

‘మ్యారేజ్ రెడీనెస్: ప్రిపేరింగ్ ఫర్ హెల్తీ అండ్ లాస్టింగ్ రిలేషన్షిప్స్’ పేరుతోటి గా గోవా కాలేజ్ ఆఫ్ హోమ్‌సైన్స్ 15 రోజులు పాఠాలు బోధిత్తదట. మానవాభివృద్ధి, కుటుంబ అధ్యయనాల యిభాగం ఈ సర్టిఫికెట్ కోర్సును పవేశపెట్టింది. ఇగ డిసెంబర్ 2 తారీకు నుండి 17వ తారీకు వరకు తరగతులు జరుగుతయట. ఇగీ మద్దెల గా గోవాల 3 యేల యిడుపుకాయితాల కేసులున్నయట. ఒక్క 2024లనే గా కేసులు యెయ్యి దాటినయట.
గందుకే గా డేటింగ్, వెడ్డింగ్, మ్యారేజీల మద్దె తేడా, గా మనువుల ఆలుమొగల పభావాన్ని గీ కోర్సుల శెప్తరట. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలల్ల, పెండ్లికానోల్లు, పెండ్లి శేసుకునేటోల్లు, గా సంసారాన్ని సక్కగ శేసుకోవాలనుకునేటోల్లు ఎవలైనా గీ బడిల శేరొచ్చట.
ఇగ “కెరీర్ కోసం ఏండ్లకు ఏండ్లు కట్టపడేటోల్లు, గదే గవాల్ల మనువు, కుటుంబం కోసం ఏమాత్రం టైమిత్తలేరాయె. మనువంటే పెండ్లాం, గామెతో మంచి సంబంధాలు, బొచ్చెడు బాద్దెతలు తెలిసుండాలె. ఇగ గయన్నీ బాగుంటేనే గా పెండ్లిల్లు పెటాకులు కాకుంటుంటయి. గీ సదువు బాగనే ఉంది కనీ, ఒక్క సదువుతోటే బాగుపడ్తరా? సదువుతోపాటే సామాజిక బాద్దెత, సంస్కారం, మన సంప్రదాయాలు కూడా బోధించాలె. ఏమంటరు?

