Friday, November 6, 2026
25.7 C
Hyderabad

ప్రశ్నించడమే నేరమా?|EDITORIAL

అధికారాన్ని ప్రశ్నిస్తే ఆంక్షలు.. అవినీతిని ఎండగడితే కేసుల భయం.. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తే చట్టాల సంకెళ్లు! ఇదేనా ప్రజాస్వామ్యం? పాలకులను నిలదీయాల్సిన మీడియా గొంతుకలకే అడ్డుకట్ట వేస్తే ప్రజల పక్షాన నిలిచేదెవరు?

మార్గం – అడుగు, ఎడిటోరియల్

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకకు ఎంతో విలువ ఉంటుంది. ప్రభుత్వాల పనితీరును నిలదీయడం, అధికారుల అవినీతిని వెలుగులోకి తీసుకురావడం, ప్రజాధనం దుర్వినియోగాన్ని ఆధారాలతో బయటపెట్టడం మీడియా ప్రాథమిక బాధ్యత. కానీ నేటి పరిస్థితులు చూస్తుంటే ప్రశ్నించడమే నేరంగా మారుతున్నదా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. పాలకుల తప్పిదాలను ఎత్తిచూపే మీడియాపై చట్టాల పేరుతో ఆంక్షలు విధించే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టం–2023 (డీపీడీపీ)కు సంబంధించిన నిబంధనలు, 2025లో ఖరారైన మార్గదర్శకాలు ఈ ఆందోళనలకు కారణమవుతున్నాయి. వ్యక్తిగత గోప్యతను కాపాడటం ఎంత ముఖ్యమో, ప్రజా ప్రయోజనాల కోసం సమాచారాన్ని వెలికితీసే పాత్రికేయ స్వేచ్ఛను రక్షించడం కూడా అంతే ముఖ్యం. అయితే పరిశోధనాత్మక జర్నలిజానికి స్పష్టమైన, సమగ్రమైన మినహాయింపు లేకపోవడం ఈ చట్టంపై ప్రధాన అభ్యంతరంగా మారింది. అవినీతికి పాల్పడిన అధికారి వివరాలు సేకరించాలన్నా, అక్రమ ఆస్తులపై పరిశోధన చేయాలన్నా, సంబంధిత వ్యక్తుల సమ్మతి కోసం ఎదురుచూడాలా? ముందుగానే సమాచారం అందిస్తే ఆధారాలు మాయమయ్యే ప్రమాదం లేదా? చట్టం వార్తా ప్రచురణను నేరుగా నిషేధించకపోయినా, నిబంధనలు, జరిమానాల భయం మీడియా సంస్థలను స్వీయ నియంత్రణ వైపు నెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అక్టోబర్ 27న ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మధ్యంతర ఉపశమనంపై అప్పుడే నిర్ణయం తీసుకోకుండా, గోప్యతా హక్కులు, పత్రికా స్వేచ్ఛ మధ్య సమతుల్యత అవసరమని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నవంబర్ 17న జరగనుంది.

ఇక తెలంగాణలో ప్రతిపాదించిన విద్వేష ప్రసంగాలు, విద్వేష నేరాల నిరోధక బిల్లు కూడా చర్చనీయాంశంగా మారింది. విద్వేష ప్రచారాన్ని అరికట్టడం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, ఆ పేరుతో ప్రభుత్వ విధానాలను విమర్శించే గొంతుకలను అణచివేసే పరిస్థితి రాకూడదు. ఈ బిల్లును మార్చి 30న శాసనసభ సెలెక్టు కమిటీకి పంపగా, జూలైలో కమిటీని ఏర్పాటు చేశారు. ఆగస్టులోనూ వివిధ నిబంధనలపై చర్చలు జరిగాయి. బిల్లులోని పదజాలం, శిక్షలు, అధికారుల విచక్షణాధికారాలు దుర్వినియోగానికి అవకాశం కల్పించకుండా సమగ్ర పరిశీలన జరగాలి. ఇప్పటికే భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనలు, ఐటీ చట్టం వంటి చట్టాలు అమల్లో ఉన్నాయి. వాటి అమలులో లోపాలను సరిదిద్దకుండా కొత్త చట్టాలతో మరిన్ని అధికారాలు కల్పించడం పరిష్కారం కాదు. రాజకీయ విమర్శకు, విద్వేష ప్రసంగానికి మధ్య స్పష్టమైన గీత ఉండాలి. వ్యక్తిగత గోప్యతను కాపాడుతూనే ప్రజా ప్రయోజనాల కోసం సమాచార సేకరణకు రక్షణ కల్పించాలి. రాజ్యాంగంలోని 19(1)(ఏ) అధికరణం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను కాపాడటం పాలకుల బాధ్యత. మీడియా ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెప్పాలి తప్ప, ప్రశ్నించిన వారిని భయపెట్టకూడదు. విమర్శను శత్రుత్వంగా భావించే పాలనలో పారదర్శకతకు స్థానం ఉండదు. ప్రజాస్వామ్యం అధికారంలో ఉన్నవారి ఇష్టానుసారం నడిచేది కాదు; ప్రజల హక్కులు, ప్రశ్నించే స్వేచ్ఛతో బలపడేది. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాల రూపకల్పనలో మీడియా, పౌర సమాజం, న్యాయ నిపుణుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే పాత్రికేయులకు స్పష్టమైన రక్షణలు కల్పించాలి. ప్రశ్నించే గొంతుకలను బలహీనపరిస్తే చివరకు నష్టపోయేది ప్రజాస్వామ్యమే. ప్రశ్నించడం నేరం కాదు.. అదే ప్రజాస్వామ్యానికి ప్రాణం!

Latest News

మనువుల బడి!?|ADUGU TRENDS

గీ రోజుల్ల కొందరు పెండ్లంటనే భయపడతాండ్రు. ఇగ గా మనువాడినోల్లు బాధలు పడతాండ్రు. గిట్ల పెండ్తైతాందో లేదో గట్ల యిడుపుకాయితాలైతానయి. కలిసి బతికే శానామంది ఆలుమొగల్లల్ల ఓ ముద్దూ లేదు ఓ ముచ్చటా...

నవంబర్ 06, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 10.44 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం హస్త రాత్రి తెల్ల 05.23 వరకు ఉపరి చిత్త యోగం వైధృతి ఉదయం 07.18 వరకు ఉపరి విష్కంబ కరణం తైతుల ఉదయం 10.44...

జనాలకు గా సర్కార్ నజరానా!?|ADUGU TRENDS

పండుగలొత్తే గ దుకాణదారులు, కంపెనీలోల్లు ఆపర్లు పెట్టడం శూసినం. కనీ, ఏకంగా పభుత్వమే పజలకు బంపబరాఫర్ ఇచ్చుడు ఎక్కడైన సూసినమా? ఇగో గా సర్కార్ ఏం శేసిందో సూడుండ్రి. ఇగ దీపాలి రానే వచ్చే....

ట్రంప్ కు అమెరికన్ల షాక్ !|EDITORIAL

ప్రపంచాన్నే తన నిర్ణయాలతో గడగడలాడిస్తున్న ట్రంప్‌కు సొంత దేశంలోనే ఓటర్లు షాక్‌ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల దెబ్బకు రిపబ్లికన్ల ఆధిపత్యం కుప్పకూలింది. రెండు సభల్లోనూ ఎదురుదెబ్బతో ట్రంప్‌కు ఇక రాజకీయ గండం...

నవంబర్ 05, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి ఏకాదశి ఉదయం 11.40 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తర రాత్రి తెల్ల 05.19 వరకు ఉపరి హస్త యోగం ఐంద్ర ఉదయం 09.15 వరకు వైధృతి కరణం బాలవ ఉదయం 11.40 వరకు ఉపరి...

గివీల్లు సావును జయించిండ్రు!?|ADUGU TRENDS

భూమ్మీద నూకలున్నోడ్ని ఎవరూ సంపలేరు. గా నూకలే లేనోల్లను ఎవరూ కాపాడలేదరంటే గిదే. నిజంగా గివీల్లు మ్రుత్యుంజయులే! సంద్ర పయాణంల తుఫాన్ల శిక్కకున్నరు. గల్లైంతన మూడు నెలలకు పానాలతో కనపడ్డరు!! గా పసిఫిక్ మహాసంద్రంల...

పుర పోరులో కూటమి జోరు!|EDITORIAL

జగన్ కంచుకోటలకే బీటలు.. పట్టణ పీఠాలపై కూటమి జైత్రయాత్ర! ఆంధ్రప్రదేశ్ స్థానిక సమరంలో పసుపు ప్రభంజనం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. పులివెందుల నుంచి మాచర్ల వరకు విజయదుందుభి మోగిస్తూ వైసీపీకి కూటమి గట్టి...

నవంబర్ 04, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి దశమి పగలు 01.00 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం మఖ ఉదయం 06.27 వరకు ఉపరి పుబ్బ యోగం బ్రహ్మ ఉదయం 11.33 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర పగలు 01.00 వరకు ఉపరి...

గురువును గౌరవించుడంటే గిదే మరి!?|ADUGU TRENDS

‘మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ’ అన్నరు. గంట్లంటే గా తల్లిని దైవంగ సూడాలె. తండ్రిని కూడా దైవంగనే భావించాలె. ఇగ గట్లనే...

ఏది గొప్ప? అధికారమా? ఓటు హక్కా!?|EDITORIAL

ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తడం చిన్న విషయమేమీ కాదు. అలాగే ఆధారాలు లేని ఆరోపణలు కూడా సమర్థనీయం కాదు. అందువల్ల ఎస్ఐఆర్‌కు సంబంధించిన రాష్ట్రాలవారీ గణాంకాలు, తొలగించిన పేర్ల వివరాలు, పునరుద్ధరించిన...

నవంబర్ 03, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 02.41 వరకు ఉపరి దశమి నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.32 వరకు ఉపరి మఖ యోగం శుక్ల మధ్యాహ్నం 02.07 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి పగలు 02.41 వరకు ఉపరి...

నవంబర్ 02, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి అష్టమి సాయంత్రం 04.40 వరకు ఉపరి నవమి నక్షత్రం పుస్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం శుభ సాయంత్రం 04.54 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ సాయంత్రం 04.40 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News