భూమ్మీద నూకలున్నోడ్ని ఎవరూ సంపలేరు. గా నూకలే లేనోల్లను ఎవరూ కాపాడలేదరంటే గిదే. నిజంగా గివీల్లు మ్రుత్యుంజయులే! సంద్ర పయాణంల తుఫాన్ల శిక్కకున్నరు. గల్లైంతన మూడు నెలలకు పానాలతో కనపడ్డరు!!
గా పసిఫిక్ మహాసంద్రంల గీ అద్భుతం జరిగింది! జూలై 30న ఓ తొమ్మిది మంది కలిసి 20 అడుగుల పడవల మైక్రోనేసియా దేశంల ఉన్న మురిలో ద్వీపం నుంచి రువో ద్వీపానికి బయల్దేరిండ్రు. కొద్ది సేపటికే గా సంద్రంల తుఫాన్ల శిక్కుకున్నరు. ఇగ రువో ద్వీపానికి గవాల్లు ఎంతకూ తిరిగి రాకపోవడంతోటి అధికారులు గాలించిండ్రు. 10 రోజుల్ల లచ్చ చదరపు కిలోమీటర్లు జల్లెడపట్టిండ్రు. ఇగ ఇదిట్ల ఉండంగ గీ మద్దెల పసిఫిక్ ద్వీప దేశమైన కిరిబాటిల ఫానింగ్ ఐలాండ్ సమీపంల గా తప్పిపోయిన గా పడవను తానికులు గుర్తించి కాపాడిండ్రు. గా సమయానికి గా పడవల ఇద్దరు పొల్లగాండ్లు, ముగ్గురు పెద్దోల్లు మొత్తం అయిదుగురు మాత్రమే పాణాలతో ఉన్నరు. మరో నలుగురు గల్లంతైండ్రు. బతికిన గవాల్లు కూడా తీవ్ర డీహైడ్రేషన్, పోషకాహార లోపంతోటి బాధపడుతాండ్రు. గవాల్లకు వైద్గం శేత్తాండ్రట. గీ ముచ్చట నిజంగనే అందర్నీ ఆశీరపరుత్తాంది.

