అవునుల్లా…నిజమే! గా పాత పోన్లు బంగారమే. గా పోన్లల్ల కెల్లి ఎల్లే, గా బంగారమసొంటి పొరతోటి, బంగారం లెక్క బ్రాస్ లెట్లు, కడాలు తయారు చేసుకుంటాండ్లు. కావాలంటే మీరే సూడుండ్లి.

ఇగో గీ యన్న.. పాత పోన్లను తీసుకున్నడు. గ వాటి డిప్పలు తీసిండు. గండ్ల బంగారం లెక్క ఉన్నదాన్నంతా ఒలిసిండు. ఒక గిన్నెల పోసి యేడి శేసిండు. ఇగ గది ద్రవమైంది. గదాన్ని బంగారె కడెం పోతల పోసిండు. గంతే, బంగారం కడెం తయారైంది. పాత పోన్లే కదాని పడేయకుండ్లి. అసలే బంగారం పిరమైంది. గిట్ల శేసి సూడుండ్లి.

