Sunday, September 20, 2026
25.2 C
Hyderabad

స్టేటస్ సింబల్ గా నేరాలు, నేరగాళ్ళు!|EDITORIAL

నేరమే రాజకీయమై, చట్టాలు చుట్టాలై, నేరగాళ్ళే రాజ్యమేలుతున్న రోజులివి. నేరగాళ్ళు ఒళ్ళు విరుచుకుని, జబ్బలు చరుచుకుని, తలెత్తుకుని ఊరేగుతుంటే, మంచివాళ్ళు తల దించుకుని తరించిపోతున్న దుర్నీతిలో, దౌర్భాగ్యంగా బతుకులీడుస్తున్న సమయ, సందర్భాల్లో మనం జీవిస్తున్నందుకు సిగ్గుపడాల్సిన దుస్థితిలో ఉన్నాం. అందుకే రాజకీయాల్లో ఉంటూ, పార్టీల్లో చేరిపోయి, పార్టీలు పెట్టుకుని నేరచరితులు నానా హంగామా చేస్తున్నారు. చివరకు కోర్టులకు వెళ్ళినా, జైళ్ళ నుంచి విడుదలైనా చేస్తున్న ఆర్భాటాలు విస్మయం కలిగించకమానవు. అలాంటి వాళ్ల కోసం పోలీసుల హైరానా, మీడియా హడావుడి అవమానకరంగా మారింది.

తమ బలప్రదర్శన కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేంటి? నేర చరితుల హడావుడి దేనికి సంకేతం? సమాజానికి ఏ విలువలను ఆపాదిస్తున్నాం? ముందు తరాలకు ఈ నైతిక విలువలనే బోధిస్తున్నామా?

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

నేరమే రాజకీయమై, చట్టాలు చుట్టాలై, నేరగాళ్ళే రాజ్యమేలుతున్న రోజులివి. నేరగాళ్ళు ఒళ్ళు విరుచుకుని, జబ్బలు చరుచుకుని, తలెత్తుకుని ఊరేగుతుంటే, మంచివాళ్ళు తల దించుకుని తరించిపోతున్న దుర్నీతిలో, దౌర్భాగ్యంగా బతుకులీడుస్తున్న సమయ, సందర్భాల్లో మనం జీవిస్తున్నందుకు సిగ్గుపడాల్సిన దుస్థితిలో ఉన్నాం. అందుకే రాజకీయాల్లో ఉంటూ, పార్టీల్లో చేరిపోయి, పార్టీలు పెట్టుకుని నేరచరితులు నానా హంగామా చేస్తున్నారు. చివరకు కోర్టులకు వెళ్ళినా, జైళ్ళ నుంచి విడుదలైనా చేస్తున్న ఆర్భాటాలు విస్మయం కలిగించకమానవు. అలాంటి వాళ్ల కోసం పోలీసుల హైరానా, మీడియా హడావుడి అవమానకరంగా మారింది.

తాజాగా ఏపీ సీఎం జగన్, హైదరాబాద్‌లో సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. పది నిముషాల హాజరీ కోసం పెద్ద పటాలాలను, వందిమాగథులను వెంటేసుకుని వచ్చారు. వాళ్ళందరి రక్షణ కోసం పోలీసులు ప్రజల్ని తరిమేశారు. మన ఓట్లతో గెలిచి, వీరు ఊరేగడమేంటని అనిపించకమానదు. అసెంబ్లీకి రావడారంరి బాధ్యతగా ఫీల్ కాని నేతకు ఇంత హంగామా అవసరమా? పైగా ఆయనేమన్నా ప్రజాప్రయోజనం కోసం హైదరాబాద్ వచ్చారా? తనపై ఉన్న నేరారోపణ కేసుల్లో నిందితుడిగా హజరవడానికి వచ్చారు. అదే సాధారణ నిందితుల పట్ల పోలీసులు ఇలాగే వ్యవహరిస్తారా? ఏపీలో జగన్ ఎక్కడికి వెళ్ళినా, మందీమార్బలం వెంట కార్లు బారులు తీరి వస్తుండటంతో తరచూ ప్రమాదాలు సంభవించి అమాయక ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అయినా ఆయన వైఖరిలో మార్పు లేకపోవడం విడ్డూరం,
గతంలో కేటీఆర్‌ కూడా ఒకటి రెండు సందర్భాల్లో ఇలాగే చేశారు. ఈ కార్‌ రేసు కేసులో విచారణకు వచ్చినప్పుడు, ఆయన్ని ఏసీబీ అరెస్టు చేస్తుందన్న సందర్భంలోనూ పార్టీ కేడర్ ను ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ హడావుడి చేశారు. ఈ నిందితుల నిరపేక్ష వ్యవహారానికి కోర్టులే బ్రేకులు వేయాలి. కనీసం కోర్టుకు విచారణకు వచ్చే సందర్భంలోనైనా ఆంక్షలు విధిస్తే బాగుంటుంది.

అధికారంలో ఉండగా అడ్డదిడ్డంగా సంపాదించడం, ప్రజలను పురుగుల్లా చూడటం, ఓట్ల కోసం దొంగ దండాలు పెట్టడం, అధికారం దక్కగానే అడ్డంగా మెక్కడం, అడ్డమైన సంపాదనతో అధికారాంతమున కూడా హంగామాలు చేయడం దేశ, రాష్ట్రాల రాజకీయాల్లో పరిపాటిగా మారింది. ప్రత్యర్థులను వేధించడమే అధికారం పరమావధి అన్నట్టుగా రాజకీయాలను మార్చిన ఘనత కేసీఆర్‌, జగన్‌రెడ్డిలకు దక్కింది. ఓటుకునోటు కేసులో పట్టుకుని, జైలులో వేసిన రేవంత్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కావడాన్ని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌ రావులు జీర్ణించుకోలేక పోతున్నారు. రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌, హరీష్‌ రావులు ఒంటికాలి విూద లేస్తున్నారు. అసభ్యంగా వాడు, వీడు అని సంబోధిస్తున్నారు. జగన్‌ కూడా అప్పుడే ఏపీలో అంతా అయిపోయిందన్న మైకంలో మాట్లాడుతున్నారు. ఈ కారణంగానే ప్రజలు తమను గద్దె దించారన్న సంగతిని జగన్‌, కేసీఆర్‌లు మరచిపోయారు.

అధికారాన్ని దక్కించుకోవడానికి చాలా తొందరలో ఉన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వీరిద్దరూ సొంతంగా ఏర్పాటు చేసుకున్న సోషల్‌ మీడియాపై ఆధారపడుతున్నారు. సోషల్‌ మీడియాతో ఎన్నికల్లో గెలిచిపోవచ్చునన్న భ్రమల్లో బతుకుతున్నారు. ప్రజల్ని తక్కువ అంచనా వేయడం వల్లే తాము ఓడిపోయామని వాళ్లు ఇంకా గుర్తిచడం లేదు. తాము అధికారంలో ఉంటే అంతా సవ్యంగా ఉందని, ఇతరులు అధికారంలోకి వస్తే, అంతా సర్వనాశనం అయిపోతోందని వగలుపోతున్నారు. జూబ్లీహిల్స్ లో బీఆర్‌ఎస్‌ బోల్తాపడింది. బీజేపీ కూడా అతిగా ఊహించుకుని బొక్కబోర్లా పడింది. అయినా బుద్ధి రావడంలేదు.

తమ బలప్రదర్శన కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమేంటి? నేర చరితుల హడావుడి దేనికి సంకేతం? సమాజానికి ఏ విలువలను ఆపాదిస్తున్నాం? ముందు తరాలకు ఈ నైతిక విలువలనే బోధిస్తున్నామా? తలదించుకోవాల్సిన వాళ్ళే తలబిరుసుగా ప్రవర్తిస్తే వారిని నిలువరించాల్సిన అవసరం అందరిపైనా ఉంది. అహంకారపూరిత పోకడలను, చిల్లరమల్లర అల్లర్లు, హడావుడిలను సమాజం హర్షించదని రాజకీయ నేతలు గుర్తించాలి. ప్రత్యేకించి నేరారోపణలతో నిందితులుగా కోర్టులకొచ్చే రాజకీయ నేతల హంగామాను కోర్టులే కట్టడి చేయాలి. నిర్ణీత ఆంక్షలు విధించి అమాయక ప్రజలను రాజకీయ నాయకుల బారి నుండి రక్షించాలి.

Latest News

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News