
గిదేమన్న ద్వాపర యుగమా ఏంది? మనం కలి కాలంల ఉన్నం. గా బీముడు పుట్టుడేంది!? మల్ల గిన పుట్టిండా ఏంది!? యే గదైతాది? అని గద అన్పిస్తుంది. గిది కలి కాలం కాబట్టే జర్గాల్సినయి జర్గుత లేవు. జరగగూడనియి జర్గుతూ ఉన్నయి. బీముడు మల్లేం పుట్టలేదు గనీ, గా బీముడసంటోడు ఒకడు పుట్టిండు. గిదేం యింత అనుకుంటాండ్లా? నిజమే గీ యింత పపంచ రికార్డు గూడ అయిందంట. కావాలంటే, ఇగో సూడుండ్లి.
బీముడంటే ఎట్లుంటడు? బారిగ సెరీరం, మస్తు బరువు ఉంటడు గద. గట్లనే మన దేశంల మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో గిది జర్గింది. జబల్‌పూర్‌లోని సర్కార్ దవాఖానకి, 34 ఏండ్ల శుభాంగి అనేటామె తొమ్మిది నెల్లు నిండా నిండిన కడుపుతోని పోయింది. గా డాస్కర్లు పరీచ్చలు చేసి, లోపల పిండం బరువుగ ఉందన్నరంట. కాన్పు కనా కట్టమన్నరట. ఆకర్కి ఆపరేషన్ చేసి బయట్కి తీసిండ్లంట. ఇగ గప్పుడే పుట్టిన గా పసి పొల్లగాని బరువు జూసిన డాస్కర్లే పరేషాన్ అయిండ్లంట. ఎందుకంటే గా పొల్లగాడు 5 కిలోల మీద 200 గ్రాముల బరువుండంట. గంత బరువుతో పిల్లలు పుట్టడం ఎక్కడ జర్గదట. గిదేదో జన్యు పరంగా జర్గిందని గా డాస్కర్లు అంటుండ్లంట.
ఇగ యినాయక చవితి పండుగ టైంల బాబు పుట్టిండని, గా యినాయకుడి దీవెనలతోనే పుట్టిండని గా పొల్లగాని తల్లిదండ్రులు మస్తుగ ఖుషీ అయితాండ్లంట. ఇగ గీ యింతను సూడడనికి పోయినోల్లంతా, గంత బరువుండు కాబట్టి, బాల బీముడే పుట్టిండని అనుకుంటాండ్లంట!

