Thursday, April 30, 2026
38.2 C
Hyderabad

SANGAREDDY|సంగారెడ్డిలో ఘోర రసాయన ప్రమాదం|CHEMICAL ACCIDENT

10 MEMBERS DEATH| 10 మంది దుర్మరణం, పలువురి పరిస్థితి విషమం

ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మున్సిపాలిటీలోని పాశమైలారంలో ఉన్న సీగాచి కెమికల్స్‌ పరిశ్రమలో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్‌ ఒక్కసారిగా పేలడంతో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది మృతి చెందగా, వీరిలో ఐదుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. శిథిలాల కింద ఇంకా 15 మంది పని చేస్తున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. రెస్క్యూ కార్యకలాపాల్లో భాగంగా ఇప్పటివరకు కేవలం ఆరుగురిని మాత్రమే బయటకు తీశారు.

ప్రమాద స్థలానికి 8 ఫైరింజన్లు, హైడ్రా, పోలీసు బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్‌ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. పరిశ్రమలో సంభవించిన ఈ పేలుడు పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో భారీ ఆందోళనకు కారణమైంది. ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించగా, పరిశ్రమ యాజమాన్యానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.

ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం

సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు అత్యవసరంగా అన్ని సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు వెంటనే అందించాలని, ప్రమాదానికి గల కారణాలను తేల్చేందుకు విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అలాగే బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Latest News

అదిరింది..గీ బొంగులతో పందిరి!?|ADUGU TRENDS

సల్లగుండాలె! సూడ్డానికి మంచిగుండాలె! ఏం శేయాలె? గిట్ల ఆలోసించిన గీ అన్నకు భలే ఐడియా వచ్చింది. గదేందో సూత్తాం పదండ్రి. అసలే ఎండా కాలం.. ఆపైన వానా కాలం. ఇగ తర్వాత సలికాలమే అనుకోండ్లి!...

కవిత్వాన్ని భూమార్గం పట్టించిన మహాకవి!|EDITORIAL

సమాజాన్ని మేల్కొలిపే శక్తి సాహిత్యానికి ఉంది. ఆ శక్తికి రూపం ఇచ్చినవారు కవులు. అలాంటి కవుల్లో అగ్రగణ్యుడు శ్రీరంగం శ్రీనివాసరావు, అంటే “శ్రీశ్రీ”. ఆయన కవిత్వం కేవలం సాహిత్యానికే పరిమితం కాలేదు. అది...

30-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 08.06 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం చిత్త రాత్రి 01.21 వరకు ఉపరి స్వాతి యోగం వజ్ర రాత్రి 08.23 వరకు ఉపరి సిద్ది కరణం గరజి ఉదయం...

భూకంపం పుట్టిస్తున్న భూ సేకరణ!|EDITORIAL

అభివృద్ధి ప్రజల సహకారంతో మాత్రమే సుస్థిరంగా ఉంటుంది. రైతులను భాగస్వాములుగా కాకుండా బాధితులుగా మార్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉండవు. అమరావతి వంటి మహత్తర ప్రాజెక్ట్ విజయవంతం కావాలంటే, అక్కడి రైతుల నమ్మకం,...

29-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 07.30 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం హస్త రాత్రి 12.00 వరకు ఉపరి చిత్త యోగం హర్షణ రాత్రి 08.52 వరకు ఉపరి వజ్ర కరణం కౌలవ ఉదయం...

ఫ్లాష్.. ఫ్లాష్.. ఫ్లాష్! హార్మూజ్ ని తెరుస్తాం! కానీ,

అమెరికాకు ఇరాన్ రెండు షరతులు అమెరికా-ఇరాన్ చర్చలపై అనిశ్చితి కొనసాగుతున్న సమయంలో ఇరాన్ కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చింది. హర్మూజ్ జలసంధిని తెరిచి నౌకల రాకపోకలకు అనుమతిస్తామని తెలిపింది. అయితే అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని...

శిన్న శిట్కాతోటి కొవ్వు ఖతం!?|ADUGU TRENDS

ఇగిప్పుడు అందరి బాధా గా పెయ్యిల శెడు కొవ్వే! మనం తినే ఆహారపు అలవాట్లు, బతుకు తెరువులు బాగా మారినయి. జీవన శైలి గూడ మస్తుగ మారింది. ఇగ గిదీంతోటి పెయ్యిల అట్టు...

కొంగ జపం శాంతి తపం!?|EDITORIAL

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు నిజమేనా? అసలా చర్చలు దౌత్య నాటకమా? నిజమైన పరిష్కార ప్రయత్నమా? మధ్యప్రాచ్యంలోని తాజా ఉద్రిక్తతలను పరిశీలిస్తే ఈ ప్రశ్న తలెత్తక మానది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య...

28-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 07.22 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఉత్తర రాత్రి 11.09 వరకు ఉపరి హస్త యోగం వ్యాఘాత రాత్రి 09.48 వరకు ఉపరి హర్షణ కరణం బవ ఉదయం...

27-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.45 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం పుబ్బ రాత్రి 10.46 వరకు ఉపరి ఉత్తర యోగం ధ్రువ రాత్రి 11.09 వరకు ఉపరి వ్యాఘాత కరణం వణజి ఉదయం...

పదే పదే అదే మాట!|BRS|KCR|TELANGANA

గెలిస్తే కేసీఆర్ క్రెడిట్|CREDIT ఓడితే ప్రజలదే పొరపాటు|PEOPLE గులాబీ బాస్ వింత శోధన|PINK BOSS కేసీఆర్ వితండ వాదన వెయ్యేళ్ళైనా బీఆర్ఎస్ కు బుద్ధి రాదా? ఇక కేసీఆర్, ఆయన ఫ్యామిలీ మారదా? ‘అప్పుడు ఓట్లేసి తప్పు చేశారు... ఇప్పడు ప్రజలు...

గోడకు నీల్లు పట్టే ఇకమతు!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడితే, గా గోడలకు నీల్లు పట్టుడు అంత అల్కన కాదు. గోడలెక్కి పైపుతోటి నీల్లు కొట్టాలె. లేకపోతే గా కింది నుండే పైపుతోటి గోడలకు పట్టాలె. ఇగ గా నీల్లతోటి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News