Tuesday, September 15, 2026
25.2 C
Hyderabad

ప్రభుత్వంలో కీలక మార్పులు

తెలంగాణలో IAS అధికారుల బదిలీలు

సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఎవరు ఊహించని విధంగా పలువురు IAS అధికారులను బదిలీలు చేసింది. బదిలీలు ఇలా ఉన్నాయి.

  1. డాక్టర్ శశాంక్ గోయెల్ (IAS, 1990 బ్యాచ్) ను డిటి.ఎంసిఆర్ హెచ్ఆర్డీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ పదవి నుంచి బదిలీ చేసి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఉపాధ్యక్షుడిగా నియమించారు. అలాగే, ఆయన్ను EPTRI డైరెక్టర్ జనరల్ అదనపు బాధ్యతల్లో ఉంచారు.
  2. జయేశ్ రంజన్ (IAS, 1992) ను ఐటీ, ఈసీ, క్రీడా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్ సెల్ సీఈఓగా మరియు SPEED ప్రాజెక్టు బాధ్యతలతో కూడిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అదనంగా యాటీ అండ్ సి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా మరియు పురావస్తు శాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
  3. సంజయ్ కుమార్ (IAS, 1995) LET&F శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయనను బదిలీ చేసి, పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ, క్రీడా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
  4. ఎం.దాన కిషోర్ (IAS, 1996) మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసి, ఇప్పుడు కార్మిక శాఖ LET&F ప్రధాన కార్యదర్శిగా మారారు. అదనంగా లేబర్ కమిషనర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్, మరియు ఉపాధి శిక్షణ డైరెక్టర్ బాధ్యతలను కూడా అప్పగించారు. ఇక గవర్నర్ కార్యాలయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పదవిలో కూడా కొనసాగుతారు.
  5. స్మిత సబర్వాల్ (IAS, 2001) ని ట్రాన్స్ఫర్ చేసి, తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించారు.
  6. డాక్టర్ టీకే శ్రీదేవి (IAS, 2004) మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్ పదవి నుంచి బదిలీై, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శిగా నియమించబడ్డారు. బయట HMDA పరిధిలో మున్సిపాలిటీలకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు.
  7. ఇలంబరిథి (IAS, 2005) జిహెచ్‌ఎంసీ కమిషనర్ పదవి నుంచి బదిలీై, మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ (హెచ్ఎండిఎ పరిధి) కార్యదర్శిగా నియమితులయ్యారు.
  8. ఆయన స్థానంలో ఆర్‌వీ కర్ణన్ (IAS, 2012) డైరెక్టర్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి బదిలీై, జిహెచ్‌ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు.
  9. కె.శశాంక (IAS, 2013) స్టేట్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కమిషనర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ పదవిలో అదనపు బాధ్యతల్లో కొనసాగుతారు.
  10. ఎస్.హరీష్ (IAS, 2015) సమాచార పౌర సంబంధాల ప్రత్యేక కమిషనర్ గా ఉండగా, ఇప్పుడు తెలంగాణ జెన్‌కో CMDగా నియమించబడ్డారు. ఇదే సమయంలో I&PR శాఖ ప్రత్యేక కార్యదర్శి అదనపు బాధ్యతలు కూడా కొనసాగిస్తారు.
  11. కె.నిఖిల (IAS, 2015) TGIRD CEOగా ఉండి, ఇప్పుడు తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యదర్శి మరియు CEOగా అదనపు బాధ్యతలు చేపట్టారు.
  12. ఎస్.సంగీత సత్యనారాయణ (IAS, 2015) సీఎం కార్యాలయం జాయింట్ సెక్రటరీగా ఉన్న ఆమెను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ గా నియమించారు. అదనంగా ఆరోగ్యశ్రీ CEO బాధ్యతను కూడా చేపట్టారు.
  13. ఎస్.వెంకట రావు (IAS, 2015) ప్రోటోకాల్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీై, దేవాదాయ శాఖ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. యాదాద్రి దేవస్థానం EO బాధ్యతలు కూడా చేపట్టారు.
  14. పి.కాత్యాయని దేవి (IAS, 2017) స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీై, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) అదనపు CEOగా నియమితులయ్యారు.
  15. ఈవీ నర్సింహారెడ్డి (IAS, 2017) స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీై, ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్ సెల్ (SPEED) అదనపు CEOగా నియమితులయ్యారు. ముసీ నది అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యత కూడా చేపట్టారు.
  16. భోర్ఖాడే హేమంత్ సహదేవరావు (IAS, 2018) TGMSIDC మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీై, GHMC జోనల్ కమిషనర్‌గా నియమితులయ్యారు.
  17. జి.ఫణీంద్ర రెడ్డి (IAS, 2018) చీఫ్ రేషన్ ఆఫీసర్ హైదరాబాదు నుంచి బదిలీై, TGMSIDC మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.
  18. పి.కధిరవన్ (IAS, 2020) హైదరాబాదు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) నుంచి బదిలీై, గ్రామీణాభివృద్ధి శాఖలో జాయింట్ కమిషనర్‌గా నియమితులయ్యారు.
  19. కె.విద్యాసాగర్ (నాన్-కేడర్), ప్రధాన కార్యదర్శి కార్యాలయం OSDగా ఉన్న ఆయనను అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) హైదరాబాదు గా నియమించారు. చీఫ్ రేషన్ ఆఫీసర్ హైదరాబాదు బాధ్యతలు కూడా చేపట్టారు.
  20. రూపేందర్ రెడ్డి (నాన్-కేడర్) ను హెచ్ఎండిఎ కార్యదర్శిగా నియమించారు.

ఈ ఉత్తర్వులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ద్వారా జీఓ (గెజిట్) విడుదల చేశారు.

G.O.515 – IAS – Transfers & Postings

Latest News

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News