వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అక్రమ ఇసుక రవాణా ను నియత్రించేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ కమిషనరేట్ పరిధిలో ఇసుక తరలించే వాగులను ఆకస్మికంగా సందర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే పోలీస్ కమిషనర్ బుధవారం కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాల నేరెళ్ళ వాగును సందర్శించి ప్రధానంగా రవాణాదారులు ఇసుకను అక్రమంగా తరలించే మార్గాలపై పోలీస్ కమిషనర్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ హరికృష్ణ ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా అక్రమంగా ఇసుక తరలించే వారి సమాచారాన్ని అందుబాటులో వుంచుకోవడంతో పాటు వారి కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సీపీ అధికారులకు సూచించారు.
చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన సీపీ
అక్రమ ఇసుక రవాణా కట్టడికై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా కమలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబాల శివారు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఇసుక చెక్ పోస్ట్ ను వరంగల్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా కమిషనర్ తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో భాగంగా సిపి ముందుగా తనిఖీ నిర్వహిస్తున్న తీరును సంబంధిత చెక్ పోస్ట్ సిబ్బందిని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. తనిఖీలు జరిపే సమయంలో సిబ్బంది తప్పనిసరిగా తనిఖీ చేసిన వాహన వివరాలను నమోదు చేసుకోవాలని, ఇసుక తరలించే వాహనాలకు అనుమతి పత్రాలు ఉన్నాయో కూడా తప్పనిసరిగా పరిశీలించాలని. నిరంతరం ఇసుక రవాణా వాహనాలపై నిఘా పెట్టాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

